Homeఅంతర్జాతీయంరవి అస్తమించని బ్రిటన్ సామ్రాజ్యపు చరిత్ర అంతా డొల్లతనంతో నిండి ఉందని మరోసారి రుజువైంది.

రవి అస్తమించని బ్రిటన్ సామ్రాజ్యపు చరిత్ర అంతా డొల్లతనంతో నిండి ఉందని మరోసారి రుజువైంది.

కింగ్ చార్లెస్ మొదటి భార్య కుమారుడైన ప్రిన్స్ హారీ పట్ల ఆ కుటుంబం చూపించిన వివక్ష ఇప్పుడు తన బయోగ్రఫీ బుక్ ‘స్పేర్’ ద్వారా ప్రపంచానికి తెలుస్తోంది. అణువణువునా అహంకారం నింపుకున్న కుటుంబ సభ్యులు తనకు కనీసం అన్నతో సమానంగా తిండి కూడా పెట్టని దుస్థితిని హ్యారీ తన పుస్తకం ద్వారా బయటపెట్టారు. ఓ రిపోర్ట్.

యువరాజుపై వివక్ష నిజమేనని డయానా స్పెన్సర్ బట్లర్ పాల్ బరేల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తన పుట్టుకపైనే ఇప్పటి కింగ్ చార్లెస్ డయానాతో జోక్స్ వేసారని హ్యారీ తన అటోబయగ్రఫీలో వెల్లడించారు. పెద్ద కొడుకు విలియం తరువాత పుట్టిన హ్యారీని తండ్రి స్పేర్ అని వ్యవహరించేవాడని తెలిసింది. అది కూడా నేరుగా తల్లి డయానాతో మొదటిసారి బాబును చూసినప్పుడే చెప్పారట. నాకు ఓ అదనం ప్రసాదించావు అని.. అది తలచుకుని హ్యారీ ఆవేదనకు గురవుతున్నారు. ప్రిన్స్ హ్యారీపై పక్షపాతం నిజమేనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన డయానా సహాయకుడు..ఇంకా చాలా విషయాలు వెల్లడించారు. తనకు తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు.మొదట హ్యారీ రాసిన పుస్తకంలో ఆరోపణలను ప్రపంచం చిన్నపిల్లాళ్ల మధ్య గొడవగానే చూసింది.

కానీ క్రమంగా బయటపడుతున్న పలు విషయాలను చూసి ముక్కున వేలేసుకుంటోంది. చార్లెస్ కు ఉన్నది కేవలం ఇద్దరే ఇద్దరు కుమారులు.. అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి రెండో కొడుకుపై అంతగా వివక్ష ఎందుకు చూపించారన్నది అందరినీ వేదిస్తోంది. మొదటి నుంచి తన పట్ల ఇదే రేసిజం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ రెండో యువరాజు హ్యారీ రాసిన ‘స్పేర్’ పుస్తకం పలు ఆసక్తికర విషయాలను తట్టిలేపుతూ చర్చకు దారి తీస్తోంది. ఈ పుస్తకం ఆధారంగా, హ్యారీ చిన్నతనంలో ఎదుర్కొన్న అవమానాలపై ప్రపంచవ్యాప్తంగా మీడియాలో చర్చ నడుస్తుంది. హ్యారీని చిన్నప్పటినుంచి విలియమ్స్ తో సమానంగా రాజకుటుంబం చూసేది కాదంటూ పాల్ వ్యాఖ్యలు హ్యారీ పట్ల సానుభూతిని పెంచుతున్నాయి.

చాలా సార్లు హ్యారీ తనకు భోజనం తక్కువగా ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించేవాడని అన్నారు పాల్.

ఇంట్లో పనిచేసే వారుకూడా విలియమ్స్ ఎప్పటికైనా రాజవుతాడని హ్యారీ తనను అనుసరించడం తప్ప వేరే దారి లేదన్నట్లుగా మాట్లాడేవారని పాల్ చెప్పారు. రాజ భవనం మొత్తం హ్యారీకి తగినంత గౌరవం ఇవ్వలేదనితెలిపారు. రాజకుటుంబం నిర్ధేశించనట్లు విలియమ్స్ నడుచుకునేవాడని అలాంటి ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడం హ్యారీకి కష్టమని పాల్ అభిప్రాయపడ్డాడు. రాజకుటుంబంలో హ్యారీని ‘స్పేర్’ లా చూసిన మాట నిజమేనని తెలిపారు పాల్. ఇప్పటికీ, అతను స్పేర్ కావడం పట్ల బాధపడుతున్నాడని అందుకే హ్యారీ రాసిన పుస్తకానికి కూడా ‘స్పేర్’ అని పేరు పెట్టుకున్నట్లు పాల్ అభిప్రాయపడ్డాడు.

హ్యారీ రాజకుటుంబంలోని ఒత్తిడులను భరించలేక ఒక సారి డ్రగ్స్ తీసుకున్నాడని… విషయం తెలిసిన ప్రిన్సెస్ డయానా ఆందోళన చెందారని తెలిపాడు పాల్. ప్లోరిడాలో మాట్లాడిన పాల్… రాజకుటుంబంపై హ్యారీ దాడులు భవిష్యత్తులో మరింత ఉధృతం కానున్నాయని అభిప్రాయపడ్డాడు. 2003లో బట్లర్ పాల్, రాసిన ‘ఎ రాయల్ డ్యూటీ’ అనే పుస్తకంలో రాజకుటుంబం గురించి పలు విషయాలు ప్రస్తావించినప్పటికి, హ్యరీ రాసిన ‘స్పేర్’ పుస్తకం రిలీజ్ అవడంతో తనలో నిక్షిప్తమైన అభిప్రాయాలను, నిజాలను బయటపెట్టినట్లుగా తెలిపాడు. రాజకుటుంబంలోకి ప్రిన్స్ భార్యగా వచ్చిన అమెరికా నటి మెఘెన్ మార్కెల్ కూడా అనేక అవమానాలను ఎదుర్కుంది. ఒకప్పుడు డయానా ఎదుర్కున్న ఇబ్బందులనే ఆమె కూడా మౌనంగా సహించింది.

అయితే ప్రిన్స్ హ్యారీ పట్ల కొనసాగుతున్న వివక్షను సహించలేక తనకు దైర్యం చెప్పి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేలా చేసింది.

ప్రస్తుతం అమెరికాలో వేరు కాపురం పెట్టి భర్తకు అనుక్షణం అండగా ఉంటోంది. అయితే బుక్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు హ్యారీ ఓ డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ రాజకుటుంబం తన భార్యను మానసికంగా వేదింపులకు గురి చేసినందుకు గాను సారీ చెప్పాలని కోరుతున్నారు. ఆ క్షమాపణకు తన భార్య మెఘెన్ మార్కెల్ అర్హురాలని తేల్చి చెబుతున్నారు. ఈ మధ్య డెయిలీ టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్ ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్షించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే అక్కడి మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రిన్స్ హ్యారీ.

Must Read

spot_img