Homeఅంతర్జాతీయంబ్రిటన్..ఇజ్రాయెల్ ను ఆనుకున్నట్టుగా ఉండే ఇస్లామిక్ దేశం

బ్రిటన్..ఇజ్రాయెల్ ను ఆనుకున్నట్టుగా ఉండే ఇస్లామిక్ దేశం

తాము పాలించిన దేశాలను వీడిపోతూ, అక్కడి దేశాల మధ్య అంతరంగికంగా చిచ్చు రగిలించడం బ్రిటిష్ వాళ్లకు బాగా అలవాటైన పని. విభజించి పాలించడం అన్నది మన దేశంలో కూడా చేసింది..మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కశ్మీరు సమస్యను తలెత్తేలా చేసి దేశాన్ని వీడివెళ్లిపోయారు. ఈ సమస్య కారణంగా పొరుగుదేశం పాకిస్తాన్ తో మనకు దశాబ్దాలుగా తలనొప్పి తప్పలేదు. సరిగ్గా ఇజ్రాయెల్ దేశాన్నిసైతం సరిగ్గా అలాంటి సంక్షోభంలోనే వదిలేసి వెళ్లిపోయింది ది గ్రేట్ బ్రిటన్..ఇజ్రాయెల్ ను ఆనుకున్నట్టుగా ఉండే ఇస్లామిక్ దేశం పాలస్థినా విషయంలోనూ అదే జరిగింది. దీంతో ఇజ్రాయెల్ కు సైతం 1946 నుంచి దశాబ్దాలుగా గెరిల్లా పోరాటాలు, రాకెట్ దాడులు తప్పడం లేదు. ఇప్పటికీ అక్కడ సరిహద్దు పోరాటాలు తప్పడం లేదు. మధ్యప్రాచ్యపు ఆ సమస్యను బ్రిటన్ తలచుకుంటే క్షణంలో తేల్చేయవచ్చు.

కానీ ఆ సమస్యను వారి మానాన వారికే వదిలేసి వెళ్లిపోయారు బ్రిటిష్ పాలకులు. ఒక విధంగా కావాలనే చిచ్చు రగిల్చి వదలేసి పోయారు. అలా చేయడం వారి ప్లాన్ లో ఓ భాగంగా ఉంటుంది. రెండు వేల సంవత్సరాలకు పూర్వం యూదులకు ఇప్పుడున్న ఇజ్రాయెల్ కన్నా పెద్ద ప్రాంతమే ఉండేది. క్రమంగా ఆక్రమణదారులు యూదుల్నివారి సొంత దేశం నుంచే వెళ్లగొట్టారు. మొదట్లో రోమన్లు, ఆపై 7వ శతాబ్దంలో మదీనా నుంచి యూదుల్ని వెళ్లగొట్టారు. అసలు ఇస్లాం ఆవిర్భావానికి పూర్వమే ఆ ప్రాంతం యూధుల ఆధానంలో ఉండేది.

జీసస్ క్రైస్త్ ను శిలువ చేసారన్న కారణంగా 2 వ శతాబ్దం నుంచి 1948 వరకు..అంటే ఇజ్రాయెల్ ఏర్పడేంత వరకు యూదుల్ని బహిష్కరించడం చంపడం దూషించడం, వాళ్ల ఆస్తులు లాక్కోవడం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వీడి వెళ్లిన బ్రిటిష్ వాళ్లు పాలస్థినా లోని కొంత భాగాన్ని యూదులకు అప్పగించి వెళ్లారు. ఆ చిన్ని ప్రాంతంలో ఏర్పడిందే ఇజ్రాయెల్. ప్రపంచంలో కేవలం యూదులు మాత్రమే ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్. సుమారు 8 కోట్ల మంది జనాభా కలిగిన ఈ చిన్ని దేశం చుట్టూ మిడిల్ ఈస్టుకు చెందిన ఇస్లామిక్ దేశాలుంటాయి.

ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇజ్రాయిల్ కు టెక్నాలజీ కేంద్రంగా ఎదిగిన ‘టెల్ అవివ్’నగరం బాగా అభివ్రుద్ది చెందింది. జెరుసలేం ఇజ్రాయిల్ స్వయంనిర్ణిత రాజధానిగా ఉంది. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు.ఇజ్రాయీల్ దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా జెరుసలేం నగరం స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. జెరుసలేం మీద ఇజ్రాయేల్ స్వాధీకారత అంతర్జాతీయంగా వివాదాస్పదంగా కొనసాగుతోంది.

అదిప్పుడు చిలికి చిలికి గాలివానగా మారి యుద్ధం వైపు దూసుకుపోతోంది. నిజానికి ఇజ్రాయెల్ పాలస్థినాల మధ్య జరుగుతున్న పోరు విషయం చూసినా, అభివ్రుద్ది విషయం చూసినా రెంటికీ పోలికే ఉండదు. ముస్లిం దేశాలన్నీ కలసి పాలస్థినాకు ఆర్థిక సాయం, ఆయుధాలు అందజేసి ఇజ్రాయెల్ తో పోరును పొడిగిస్తూ ఉంటారు. బలయ్యేది మాత్రం పాలస్థనీయులే అంటే అతిశయోక్తి కాదు. నిత్యం అక్కడ హింసాకాండ రావణకాష్టంలా కొనసాగుతూ ఉంటుంది. అయితే అక్కడ కనిపిస్తున్నది వేరు జరుగుతున్నది వేరు అంటారు విశ్లేషకులు.

ఒకవైపు డెడ్ సీ..మరోవైపు ఈజిప్టు జోర్డాన్ సిరియా లెబనన్లతో నిత్యం ఘర్షనలతో కొనసాగుతోంది ఇజ్రాయెల్. తమ దేశ అభివ్రుద్ది విషయంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ కాంప్రొమైజు కాలేదు. చిన్నదేశమే అయినా సగభాగం ఎడారితో కూడుకుని ఉన్నా టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయంలో స్వయం సమ్రుద్ది సాధించింది. కొత్త కొత్త వంగడాలు, కొత్త రకాలైన వ్యవసాయ పద్దతులను ప్రపంచానికి పరిచయం చేసింది ఇజ్రాయెల్. ఒక్క వ్యవసాయమే కాదు..రక్షణ రంగంలో ఉపయోగించే రోబోలు, ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ కు సంబంధించినవి ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. తమ దేశానికి సంబంధించిన అవసరాలను దిగుమతులపై ఆధారపడకుండా తీర్చుకుంటోంది ఇజ్రాయెల్..

అక్కడ నిత్యం జెరూసలెంలో పాలస్థినీయన్లు నిరసన ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఆ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతుంటాయి. చాలా మంది చనిపోవడం, గాయాలపాలవడం సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఓ వివాదంపై ఇజ్రాయెల్ కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే అక్కడ ఘర్షణలు తలెత్తాయి. నలుగురు పాలస్థనీయన్ల ఇళ్లు ఇజ్రాయెల్ వాసులు కొనుక్కున్నవేనని, వాటిలో ఉండే వాళ్లని ఖాళీ చేయించమని ఇజ్రాయెల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఇజ్రాయెల్ కోర్టు. ఇలా నిర్ణయించడం, ఆదేశాలు జారీ చేయడం అక్కడ వివాదాస్పదంగా మారింది. ఇదే అదనుగా ఇజ్రాయెల్ పై దాడికోసం ఎదురు చూస్తున్న పాలస్థినా ఉగ్రవాద సంస్థ హమాస్ లెక్కలేనన్ని రాకెట్లు ప్రయోగించింది. వాటిని ఎదుర్కునేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సహాయం తీసుకుంది.

పాలస్థినీయన్లు పవిత్రంగా భావించే అల్ అక్సా మసీదు ఒకప్పటి తమ టెంపుల్ మౌంట్ అని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అది తమ ప్రార్థనా మందిరంగా చెబుతోంది. తూర్పు జెరూసలెంను తమ రాజధానిగా ప్రకటించిన తరువాత పూర్తి పట్టు కోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ ఉన్న పాలస్థినియన్లు తరచూ ఘర్షణకు దిగుతున్నారు. ఇప్పుడు ఇరాన్ సమకూరుస్తున్న నిధులు ఆయుధాల సహకారంతో రెచ్చిపోతున్న హమాస్ ఉగ్రవాదులు పాలస్థినా జనావాసాల మధ్య ఉండి ఇజ్రాయెల్ పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. అటు ఇజ్రాయెల్ సైతం తమ ఎఫ్ 16 జెట్ విమానాలతో పిన్ పాయంటెడ్ గా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయినా వందలాది మంది పాలస్థినాలోని అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. యుధ్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాన్ కు తోడుగా పాలస్థినాకు లెబనన్ కూడా తోడైంది. క్రమంగా ఇస్లామిక్ దేశాలు పాలస్థినాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. టర్కీ, పాకిస్తాన్ దేశాలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు ఆ రెండు దేశాల మధ్య యుధ్దాన్ని ఎగదోస్తున్నాయి.

చూస్తుండగానే ప్రధాన దేశాలు కూడా ఇందులో వేలు దూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కు మొదటి నుంచి అమెరికాతో మిత్రుత్వం ఉంది. కొత్త కొత్త ఆయుధాలు కనిపెట్టడంలో దిట్ట అయిన ఇజ్రాయెల్ టెక్నాలజీలు అమెరికాకు కూడా అవసరమే.. అంతే కాదు..అక్కడి వ్యవసాయపు టెక్నిక్కులు ప్రపంచం మొత్తాన్నే ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అందుకే మిడిలీస్టు ప్రాంతంలో తనకో శక్తివంతమైన దేశం స్థావరంగా ఉండాలని అమెరికా అనుకుంది. అందుకే ఇజ్రాయెల్ కు అన్ని విషయాలలో మద్దతుగా ఉంటూ తన అవసరాలను తీర్చుకుంటోంది. ప్రస్తుతానికొస్తే ఇజ్రాయెల్ పాలస్థినాల మధ్య వివాదం కేవలం టెంపుల్ మౌంట్ గురించే..

అంటే అల్ అక్సా మసీదు స్థలం విషయంలోనే ఘర్షణలు జరుగుతుంటాయి. దాని విషయంలో ఎవరూ తగ్గడం లేదు. రెండు వేళ ఏళ్లనుంచే యూదులు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారనీ, అరబ్బుల దండయాత్రలో భాగంగా టెంపుల్ ను మసీదుగా మార్చారని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇప్పుడు పాలస్థినాకు వంతపాడుతున్న దేశాలేవీ అది నిజమా కాదా అన్నది తేల్చే విషయంలో ప్రయత్నాలు చేయడం లేదు. కానీ ఇది నిజమేనని చారిత్రిక ఆధారాలు చూపిస్తోంది ఇజ్రాయెల్. ఇది ఇప్పట్లో తేలే సమస్యలా కనిపించడం లేదు. అయితే తమ దేశ అంతర్గత విషయంలో మరోదేశం జోక్యాన్ని సహించకూడదన్నది ఇజ్రాయెల్ నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిన నీతిగా చూపిస్తున్నారు విశ్లేషకులు. చివరికి ఏం జరగనుందన్నది కాలమే తేల్చనుంది.

Must Read

spot_img