Homeఅంతర్జాతీయంబ్రెజిల్ నిరసనలు..!

బ్రెజిల్ నిరసనలు..!

ఎన్నికలలో పాల్గొనడం తమకు నచ్చినవారిని గెలిపించుకునేందుకు ఓటు వేయడం ఓడిపోతే నిరసన ప్రదర్శనలు చేయడం ఓ ట్రెండ్ గా మారుతోంది. ఇజ్రాయెల్ మాదిరగానే అటు బ్రెజిల్ లోనూ అదే సమయంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా ఇలాగే అధ్యక్షుడు లూలా చేతిలో ఓడిపోయిన బొల్సోనారో మద్దతుదారులు బీభత్సం స్రుష్టించారు. ఏకంగా పార్లమెంటు సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్ష భవనంపై దాడికి దిగారు.

శ్రీలంకలో అధ్యక్ష భవనంపై దాడి గుర్తింది కదా..సరిగ్గా అందరూ అదే ఫాలో అవుతున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడుగా లూలా ప్రమాణ స్వీకారంతో మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు రణరంగం స్రుష్టించారు. బ్రెజిల్ వ్యాప్తంగా అల్లర్లు రేపడానికి ప్రయత్నించారు. అచ్చం శ్రీలంకలో మాదిరిగానే మూడు వేల మంది ప్రదర్శకులు సుప్రీంకోర్టు, అధ్యక్షభవనం, పార్లమెంటుపై దాడులకు దిగారు.

దీంతో రంగంలోకి దిగిన బధ్రతా బలగాలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.

అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు.

రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు.

గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు.

ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు. ఇది గతంలో అమెరికా క్యాపిటల్ విధ్వంసం తరహాలోని ఘటనను కూడా గుర్తు చేసింది. బ్రెజిల్ దేశంలో అమెరికాలో ఆనాడు ట్రంప్ రెచ్చగొట్టడంతో జరిగినట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.

  • ఆ దేశ రాజధాని బ్రెసీలియాలో మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు మద్దతుగా 3 వేల మందికి పైగా నిరసనకారులు బీభత్సం సృష్టించారు.

గ్రీన్, ఎల్లో దుస్తులు ధరించి రోడ్లపైకి దూసుకొచ్చిన వందలాది నిరసనకారులు.. నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని నినాదాలు చేశారు. అధ్యక్షుడు లూలా పదవి నుంచి దిగిపోయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో నేషనల్ కాంగ్రెస్ భవనాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇంటర్​వెన్షన్ అంటూ సైన్యాన్ని ఉద్దేశించి బ్యానర్లు ఎగరేశారు. పార్లమెంట్ కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.

అంతేకాకుండా, అధ్యక్ష భవనం మీదకు ఎక్కి నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు హెడ్‌క్వార్టర్‌లోనూ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు… కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు జర్నలిస్టులు గాయపడగా…మరికొందరు నిరసనకారులకు గాయాలయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనారోకు 49.1శాతం వచ్చాయి.

ఎన్నికల ఫలితాలను అంగీకరించాడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా, బ్రెజిల్ రాజధానిలో సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడిఘటనపై ప్రపంచ దేశాల అధ్యక్ష, మాజీ అధ్యక్షులు తీవ్రంగా ఖండిచారు.

Must Read

spot_img