HomeUncategorizedబాలీవుడ్ లో మరోసారి బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది.....

బాలీవుడ్ లో మరోసారి బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది…..

బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ .. చెమటలు పట్టిస్తోంది.. ఇప్పటివరకు అక్షయ్, అమీర్, రణబీర్ చిత్రాలకే ట్రోల్స్ చేసిన నెటిజన్లు.. ఇప్పుడు
షారూక్ మూవీని ట్రోల్ చేయడం .. చర్చనీయాంశంగా మారింది. దీనికి దీపికా డ్రెస్ సెన్స్ తో పాటు పలు అంశాలే కారణమని తెలుస్తోంది.
బాయ్ కాట్ .. ఈ పేరు వింటేనే, బాలీవుడ్ గజగజలాడుతోంది. తాజాగా షారూక్ మూమీ పఠాన్ కు బాయ్ కాట్ దెబ్బ గట్టిగానే తగులుతోంది. దీనిలో
దీపికా బోల్డ్ యాక్షన్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్ లో మరోసారి బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా స్టార్ హీరోస్ చిత్రాలు.. భారీ బడ్జెట్ సినిమాలకు ఈ బాయ్ కాట్ సెగ
తగులుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి మొదలైన ఈ ట్రెండ్, పెద్ద సినిమా రిలీజైన ప్రతిసారి తెరపైకి వస్తోంది. తాజాగా షారూక్
ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలైందో లేదో అలా బాయ్ కాట్ పఠాన్ అనే ట్రెండ్ షురూ
అయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైంది. అందులో హీరోయిన్ దీపికా పదుకోన్ అందాలు ఆరబోసింది. ఆ క్లిప్స్ ను సోషల్
మీడియాలో వైరల్ చేస్తూ, మరోవైపు సౌతిండియా సినిమాల్లో పద్ధతిగా కనిపించే హీరోయిన్ల క్లిప్స్ ను ట్యాగ్ చేస్తూ.. ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్
చేస్తున్నారు బాలీవుడ్ జనం.

ఇక్కడితో ఆగకుండా షారూక్ ఖాన్ గతంలో చేసిన పొరపాట్లు, వివాదాస్పద అంశాల్ని మరోసారి తెరపైకి తెస్తూ బాయ్కా ట్ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. వీటికి తోడు సుశాంత్ సింగ్ ఉదంతాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. పఠాన్ సినిమా చుట్టూ ఎంత నెగెటివిటీ క్రియేట్ చేయాలో అంతా చేస్తున్నారు. దీంతో గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతోందని టాక్ వెల్లువెత్తుతోంది. నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపించనుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలకు ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టు ముడుతూనే ఉంది. ఇటీవల బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం.. బాయ్ కాట్ సెగ తగలడం కామన్ అయ్యింది. ఈ ట్రెండ్ వల్ల చాలా సినిమాలు కోట్లకు కోట్లు నష్టపోతున్నాయి. నవంబర్ 2న షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పఠాన్ టీజర్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే మంచి స్పందనతో దూసుకుపోతున్న ఈ టీజర్‏కు.. ఇప్పుడు బాయ్ కాట్ వివాదం చుట్టుముట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే బాయ్ కాట్ దెబ్బకు ఎన్నో బాలీవుడ్ సినిమాలు వసూళ్లు లేక చతికిల పడ్డాయి. ఇప్పుడు షారుఖ్ వంతు వచ్చింది. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన ‘పఠాన్’ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘బేషరమ్ రంగ్’ పాటలో హీరోయిన్ మోతాదుకు మించి అందాలను ఆరబోయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్రా ష్ట్రంలో చాలా చోట్ల పఠాన్ సినిమాను నిషేధించాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ‘వీర్ శివాజీ గ్రూప్’ కార్యకర్తలు ఇండోర్ నగరంలో నిరసనలు
చేపట్టారు. ఈ సందర్బంగా షారుక్, దీపిక దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అశ్లీలతను ప్రోత్సహిస్తున్న ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా స్పందించారు.

ఈ పాటలో దీపిక ధరించిన దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సీన్లను సరిచేయకపోతే రాష్ట్రంలో పటాన్ చిత్రాన్ని ప్రదర్శించాలా? వద్దా? అనేదానిపై ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు, జేఎన్‌యూ కేసులో తుక్గే తుక్గే గ్యాంగ్‌కు దీపిక మద్దతుగా కనిపించారని ఆయన మండిపడ్డారు. ఇది ఇలావుండగా, ట్విట్టర్‌లోనూ ‘బాయ్‌కాట్ పఠాన్’ హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం గమనార్హం. దీపిక ధరించిన దుస్తులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ సినిమాను అమ్ముకోవడం కోసం ఇంతగా దిగజారాలా? అని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో చిత్ర బృందం చిక్కుల్లో పడినట్లయింది. ఇప్పటికేపలు చిత్రాలు బాయ్‌కాట్ చేయడం వల్ల భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే.

కాగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం.. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది
జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. చాలా గ్యాప్
తర్వాత షారుక్ చిత్రం వస్తుండటంతో ఆయన అభిమానులు సినిమాను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కి
చెందిన బీజేపీ నాయకుడు రాజేశ్‌ కసర్‌వానీ కూడా పఠాన్ సినిమా పాటపై ఘాటుగా స్పందించారు. పఠాన్ సినిమాలోని బేషరమ్‌ రంగ్‌ సాంగ్‌లో
హీరోయిన్ వాడిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలో హీరోయిన్ కాషాయ రంగు దుస్తులు అసభ్యకరంగా ధరించిందని, అది హిందూ
సమాజాన్ని అవమానించడమేనని అన్నారు.

మన సనాతన సంస్కృతిని అగౌరవపరిచే విధంగా ఉన్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని సినిమా విడుదల ఆపుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు గోవింద్ సింగ్‌ కూడా పఠాన్ సినిమాలోని బేషరమ్‌ రంగ్‌ సాంగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలో హీరోయిన్ ధరించిన దుస్తులు అభ్యంతర కరంగా ఉన్నాయని అన్నారు. మన సంస్కృతిలో ఇటువంటి వాటిని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. ట్విట్టర్‌లో కూడా బేషరమ్‌ సాంగ్‌పై దారుణంగా ట్రోలింగ్ జరగుతోంది. బాయ్‌కాట్ పఠాన్‌ అనే పేరుతో అనేక మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పఠాన్ సినిమా 8 దేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన బేషరమ్‌ రంగ్ సాంగ్‌ను స్పెయిన్‌లో పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు.

ఈ సినిమాను హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పఠాన్ సినిమాలో షారుఖ్ఖా న్, దీపికా పదుకొనేల బేషరమ్ రంగ్ సాంగ్ చర్చనీయాంశమైంది. ఒక వర్గం నెటిజన్లు SRK,దీపికల కెమిస్ట్రీని ప్రశంసించగా, మరొకరు సినిమాను బహిష్కరించారు. ట్విటర్‌లో Boycott Pathaan ట్రెండ్ అవుతోంది, బాలీవుడ్ ఆలోచనలు ఇంత దారుణంగా ఉన్నాయేంటని కొందరు విమర్శిస్తున్నారు.

పఠాన్ మూవీ నుంచి బేషరమ్ రంగ్ విడుదలైన వెంటనే, నెటిజన్లలో కొందరు ట్విట్టర్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇది కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. కొందరు దీపిక కుంకుమపువ్వు దుస్తులను ధరించి, SRK ఆమెను వెనుక నుండి పట్టుకున్న పాటలోని ఒక నిర్దిష్ట సన్నివేశ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. మరికొందరు పఠాన్‌ను కాంతారావుతో పోల్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పై నెగిటివిని పెంచేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే అమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‏గా నిలిచాయి. భారీ అంచనాలతో ఎక్కువ బడ్జెట్‏తో నిర్మించిన సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరించడం లేదు.

షారుఖ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో అనేక ట్వీట్స్ వైరలవుతున్నాయి. కేవలం పఠాన్చి త్రమే కాకుండా.. బాద్ షా గతంలో నటించిన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ బాయ్ కాట్ పఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ మరణం అనంతరం బీటౌన్ స్టార్స్ పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోస్ చిత్రాలను బాయ్ కాట్చే యాలని.. సుశాంత్ మరణానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు అభిమానులు.

బాయ్ కాట్ పఠాన్ .. ఇప్పుడీ మాట ట్విట్టర్ లో హ్యాహ్ టాగ్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా షారూక్ మూవీపై సాగుతోన్న వివాదం..
బాలీవుడ్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img