Homeసినిమాబాలీవుడ్ కోసం అమీర్ ఖాన్ భారీ ప్లాన్

బాలీవుడ్ కోసం అమీర్ ఖాన్ భారీ ప్లాన్

ఒక పక్క బాలీవుడ్ సినిమాలు అన్నీ ప్లాప్ అవడం, సౌత్ ఇండియన్ సినిమా బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం వల్ల బాలీవుడ్లో అందరూ దక్షిణాది సినీ పరిశ్రమ ను అసూయగా చూడడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే..బాలీవుడ్ స్టామినా పెంచేందుకు ఆమీర్ ఖాన్ ఓ ప్లాన్ చేసినట్లుత తెలుస్తోంది.

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. వారి కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అలాటి కాంబినేషన్ సెట్ కాబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు మరోసారి సినిమా చేయబోతున్నారు. వారు ఎవరో కాదు.. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్. వీరిద్దరూ కలిసి కెరియర్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమా 90వ దశకంలో చేశారు. ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అయితే తరువాత ఇద్దరూ కూడా స్టార్ హీరోలు కావడంతో కలిసి చేసే ఛాన్స్ అయితే దొరకలేదు. కాని ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. రెగ్యులర్ గా వీరిద్దరూ కలుస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లి కలిసాడు. ఈ న్యూస్ బిటౌన్ లో సంచలనంగా మారింది.

అయితే ఈ సారి వారిద్దరి మధ్య జరిగింది రెగ్యులర్ మీట్ కాదనే మాట వినిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ కోసం ఇద్దరు కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నారు అనే టాక్… టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అమీర్ ఖాన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో హిందీలో శుభ మంగళ సావదాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత మూడు తమిళ సినిమాలు చేసిన టాలెంటెడ్ దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న చెప్పిన కథని అమీర్ ఖాన్ విన్నాడని తెలుస్తుంది. ఆ సినిమాని తన ప్రొడక్షన్ లో నిర్మించేందుకు కమిట్ అవ్వడంతో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా పెర్ఫెక్ట్ గా చేయించినట్లు టాక్.

ఇక ఈ సినిమా కంటెంట్ పరంగా ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా లార్దర్ దెన్ లైఫ్ అనే విధంగా ఉంటుందని టాక్. అయితే ఈ కథకి తనకంటే సల్మాన్ ఖాన్ పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అమీర్ ఖాన్ భావించడంతో అతనికి కథ చెప్పాలని నిర్ణయించుకొని కలవడం జరిగిందని తెలుస్తుంది. ఇక అమీర్ ఖాన్ ఇంటికి వచ్చిన సల్మాన్ ఖాన్ ని ప్రసన్న కథని నేరేట్ చేయడం కూడా జరిగిందని బీ టౌన్ లో వార్తలు విపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కి ఈ కథ నచ్చడంతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బోగట్టా. అమీర్ ఖాన్ ఎంతో ఇష్టపడి ప్రసన్న ఈ కథని సిద్ధం చేయించినట్లు టాక్. ఇక సల్మాన్ ఖాన్ డేట్స్ చూసుకొని ఈ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి అమీర్ ఖాన్ సిద్ధం అవుతున్నట్లుగా బిటౌన్ లో వినిపిస్తున్న మాట.

Must Read

spot_img