గతేడాది బాలీవుడ్ పరిశ్రమ ఎలాంటి ఫేజ్ ని ఎదుర్కుంది. 2022 బాలీవుడ్ కి చీకటి సంవత్సరంగా మిగిలిపోయింది. రెండు..మూడు దశాబ్దాలుగా లేనటివంటి పరిస్థితులు పరిశ్రమలో కనిపించాయి. వరుస పరాజయాలతో సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు..స్టార్స్ సినిమాలు అన్నీ అత్యంత దారుణమైన ఫలితాలు సాధించాయి. అయితే బాలీవుడ్ మొత్తం ఈ ఏడాదిపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ మధ్య బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైంది. హీరోలు..దర్శక.నిర్మాతలు అంతా మొట్టికాలు భరించాల్సి వచ్చింది. పాన్ ఇండియన్ సినిమాలో బాలీవుడ్ పరిశ్రమని ఓ చేతగాని పరిశ్రమగా జత కట్టారు. నేరుగా బాలీవుడ్ ఉద్దండులే తమ పనితనం గురించి విమర్శించుకుని తలలు దించుకున్నారు. ఇదంతా గతం. గతాన్ని ఎవరూ మార్చలేరు. భవిష్యత్ ని ఎవరూ ఊహించలేరు.
కానీ వీలైనంత వరకూ సక్సెస్ దిశగా మలుచుకునే అవకాశం మాత్రం చేతుల్లో పనే.బాలీవుడ్ సైతం కొత్త ఏడాదిలోకి కోటి ఆశలతో అడుగు పెట్టింది. ఈ ఏడాది మాత్రం గతేడాది పరాజయాలన్నింటి లెక్క సరిచేయాల్సి ఉంది. ఆబాధ్యతలు ప్రధానంగా షారుక్ ఖాన్…సల్మాన్ ఖాన్..రణబీర్ కపూర్.. అక్షయ్ కుమార్..కంగనా రనౌత్ లపై పడింది.
షారుక్ ఖాన్ ఇదే ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంచలనాల పఠాన్
ఏడాది ఆరంభమైన జనవరి 25న భారీ అంచనా లమధ్య రిలీజ్ అవుతుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. అలాగే జూన్ 2న యాక్షన్ ఎంటర్ టైనర్ జవాన్
రిలీజ్ అవుతుంది. అటుపై రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న డంకీ
డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఇలా ఏడాదంతా షారుక్ సందడి థియేటర్లో కనిపిస్తుంది.
ఇక సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కీసికా భాయ్..కీసికా జాన్
సందడి చేయబోతుంది. ఈద్ పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా నటించారు. అలాగే దీపావళి కానుకగా టైగర్ -3
రిలీజ్ అవుతుంది. ఏక్ దా టైగర్
సిరిస్ లో రిలీజ్ అవుతోన్న చిత్రమిది. దీంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మూడవ భాగంలోనూ సల్లూ భాయ్ కి జోడీగా కత్రినా కైప్ నటిస్తోంది. ఇక గతేడాది వరుసగా నాలుగు పరాజయాలు చవి చూసిన అక్షయ్ కుమార్ లో బాక్సాఫీస్ని షేక్ చేయాలి అన్న కసి పట్టుదల కనిపిస్తుంది. ఆయన నటిస్తోన్న సెల్పీ
ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతుంది. అలేగే బడేమియా చోటేమియా
కూడా ఇదే ఏడాది సందడి చేయనుంది. ఇక రాక్ స్టార్ రణబీర్ కపూర్ ఆగస్టులో యానిమల్
సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అలాగే మరో సినిమా తూ ఝాటీ మై మక్కర్
హోళీ కానుకగా మార్చిలో రిలీజ్ అవుతుంది. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీఇదే ఏడాది రిలీజ్ కానుంది. ఇంకా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోన్న
ఎమర్జెన్సీ` కూడా భారీ అంచనాల మధ్య ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇంకా కొంత మంది యంగ్ హీరోలు నటిస్తోన్నచిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ లెక్కలు మార్చి సరికొత్త సంచలనాలు నమోదు చేస్తాయో చూడాలి.