Homeఅంతర్జాతీయంఅమెజాన్ అడవుల్లో సలసలా మరిగే నది.. 

అమెజాన్ అడవుల్లో సలసలా మరిగే నది.. 

అది దట్టమైన అడవులుండే అమెజాన్..ఆ అడవుల్లో నిత్యం పొగలు గక్కే ఓ నదిలో ఏ జీవి పడినా అంతే బాయిల్ అవుతూ ప్రాణాలు గాల్లో కలసిపోతాయి. నిజానికి అదో మరుగుతున్న లావా లాంటిది. అగ్నిపర్వతం నుంచి జాలువారే ద్రవంలా ఆ స్వచ్చమైన నది నీరు అడవిలోప్రవహిస్తోంది. అది ప్రయాణించే దూరం మొత్తం అటూ ఇటూ వ్రుక్ష జాతులు కూడా ఉండవు.

జలచరాలు అసలే ఉండవు. పొగలు కక్కుతూ సాగే నది మాత్రమే కనిపిస్తుంది. అంతే కాదు..దీనికో అరుదైన రికార్డు కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేడినీటి నది ఏదంటే ఇదే. దానికి ఓ పేరంటూ లేదు. సింపుల్‌గా బాయిలింగ్ రివర్ అంటారు..అంటే..ఉడికే నది అని అర్థం..200 డిగ్రీ సెల్సియస్ వేడితో ఎప్పుడూ కుతకుతా ఉడుకుతూనే ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులూ వేడి సెగలు కక్కుతూనే ఉంటుంది. సాధారణంగా ఏ నది దగ్గరకైనా మనం వెళ్తే… ఆ నీటిపై నుంచి… చల్లటి గాలులు పలకరిస్తాయి. కానీ ఆ నది దగ్గరకు వెళ్తే మాత్రం ఉక్కపోతే ఉంటుంది.

ఈ నదిని పవిత్రమైన నది అంటారు..ఈ నీటితో స్నానం చేస్తే శరీరంలోని రుగ్మతలు నయమవుతాయని నమ్ముతారు.దక్షిణ అమెరికాలోని… పెరూ దేశంలో. అత్యంత దట్టమైన అమెజాన్ అడవిలో ఉండే ఈ బాయిలింగ్ రివర్ రహస్యంగా ఉన్నట్టే ఉంటుంది. బయటకు పెద్దగా కనిపించదు. ఇలాంటి ఓ నది అక్కడ ఉందని పూర్వీకులు చెప్పుకునే వారు. కానీ ఎక్కడుందో మ్యాప్ పాయింటింగ్ ఉండేది కాదు. దీని కోసం చాలా మంది వెతికారు. అయితే కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవిగా చెప్పుకునే అమెజాన్‌ అడవిలో వెతుకులాట అంటే… ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆ అడవి ఎంత మంచిదో… అంత ప్రమాదకరమైనది. ఈ నది పై నుంచి చూస్తే బాయిలింగ్ అవుతున్నట్టు కనిపించదు. చూడటానికి ప్రశాంతంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది.

కానీ లోపల మాత్రం కుతకుతా ఉడుకుతూ ఉంటుంది. నది ప్రారంభంలో నీటి ప్రవాహం చిన్నగానే ఉంది… రానురానూ అది పెద్దగా ఉంటుంది. పైగా నదిలో వేడి అన్ని చోట్లా ఒకేలా లేదు. నది ప్రారంభంలో నీటి వేడి 91 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. గరిష్టంగా 200 డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ఉంటుంది. అక్కడ ఉండే నీటిలో తేయాకు వేసుకుని ఇన్ స్టాంట్ గ్రీన్ టీ తాగేయడం చాలా ఈజీ.. అంతే కాదు..ఒక్క నిముషంలో గుడ్డు ఉడకిపోతుంది. పొరబాటున చేతిని నది నీటిలోకి పెడితే ప్రమాదం.. అర సెకండ్‌లో చెయ్యి కాలిపోతుంది. ధర్డ్ డిగ్రీ గాయాలవడం గ్యారంటీగా జరిగిపోతుంది.

ఎక్కడైనా కాలుజారి అందులో పడితే ఎవరికైనా చావు తప్పదు. అందుకే ఇందులో జలచరాలు ఉండవు..బయటి నుంచి నీరు తాగేందుకు జంతువులు రావు. ఒకవేళ పడిపోతే ఉడికిపోతాయి. ఇంతకీ ఆ నీరు ఎందుకు వేడిగా ఉంది అంటే… దాని వెనక ఏ మంత్రమూ లేదు. ఈ అనుమానానికి సైన్సే స్పష్టమైన సమాధానం చెబుతోంది. ఆ నీరు భూమి లోపలి నుంచి పైకి వస్తోంది. భూమి లోపలి పొరల్లో కేంద్రకం వద్ద ఏదైనా సరే కరిగిపోయేంత స్థాయిలో ఉష్ణోగ్రతలుంటాయి. అక్కడి నుంచి కనెక్టయ్యే నీరే ఇక్కడ బయటకు వస్తోంది.

ఇలా నీరు వేడిగా ప్రవహించదాన్నే శాస్త్రజ్నులు జియోథెర్మల్ హీటింగ్ అంటారు. ఈ నది మామూలుగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పుట్టే ఉష్ణోగ్రతల వల్ల పుట్టిందని అనుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు చమురు తవ్వకాలు జరిగాయి. అయితే చమురు నిల్వలు తగ్గిపోవడం లేదా నిలిచిపోవడం కారణంగా వాటిని అలాగే వదిలేసి ఉండొచ్చని అనుమానాలున్నాయి. మరో అంచనా మేరకు చమురు కంపెనీ వాళ్లు ప్రమాదవశాత్తు అంటుకున్న చమురు బావిని అదుపు చేయలేక వదిలేసి వెళ్లిపోవచ్చన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చమురు తవ్వకాలు జరిపినట్టు గూగుల్ లో వెతికితే వస్తుందని పరిశోధకులు గుర్తించారు.

పెరూవియన్ ప్రాంతానికి చెందిన పరిశ్రమలు ఇక్కడి భారీ చమురు నిల్వలపై కన్నేసాయని, అయితే బ్లో అవుట్ కంట్రోల్ కాకపోవడంతో వదిలేసినట్టు అనుమానం. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో జియో థెర్మల్ సిస్టం ఏర్పడి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. అయితే భూగర్భంలో మండే చమురు, గ్యాస్ వల్ల కూడా ఇలా నీరు వేడెక్కే అవకాశం లేకపోలేదు. అయితే ఈ నీరు వంద శాతం సహజమైనది.

కాలుష్యం లేనిదని పరిశోధనల్లో తేలింది. ఆమెజాన్ అడవులకు దగ్గరలో రెండు గిరిజన తెగలు జీవిస్తున్నాయి. వారికి అమెజాన్ అడవుల గురించి బాగా తెలుసు. వారికి ఈ నది గురించి కూడా తెలుసు. అయితే నది అలా పొగలు కక్కడం ఆత్మల వల్లే జరుగుతుందని నమ్ముతుంటారు. వీళ్లు నిత్యం పూజించే యాకుమామా స్పిరిట్స్ వల్లే నది వేడెక్కుతోందని నమ్ముతారు. వీరు ఆత్మలకు భయపడతారు. చనిపోయిన వారంతా అక్కడే అడవుల్లోనే తిరుగుతారని చెబుతున్నారు.

అడవుల్లో వేడి నీరు చల్లని నీటికి కారణం యాకుమామా అనే పాము ఆకారపు స్పిరిట్ వల్లే జరుగుతోందని కథలు కథలుగా చెబుతుంటారు. అందుకే ఈ బాయిలింగ్ రివర్ ను పవిత్ర నదిగా భావిస్తారు. ఈ నీటిని వాడితే రోగాలు నయం అవుతాయని వారి నమ్మకం. ప్రకృతి వింతల్లో ఈ నది కూడా ఒకటిగా ఉంది. కొన్ని చోట్ల చల్లగా కొన్ని చోట్ల చాలా వేడిగా ఉండటానికి కారణం అక్కడి వారు తప్పులు చేయడం వల్లేనంటారు ఇక్కడి గిరిజన ప్రజలు. జంతువులు సైతం తప్పు చేయడం వల్ల అందులో పడి మరణిస్తున్నాయంటారు.

ఇలా వింత వింత కథలకు పుట్టినిల్లుగా మారింది అమెజాన్ బాయిలింగ్ రివర్. మొత్తం నది 9 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. పూర్తి డ్రై సీజన్ లోనూ నిండుగా ప్రవహిస్తుంటుంది. అయితే ఎండాకాలంలో ఈ నీరు మరింత వేడెక్కుతుంది. నది వద్దకు వచ్చేవారు పూర్తి జాగ్రత్తలు తీసుకుని వస్తారు. నీటితో ఏ మాత్రం అలసత్వం చూపించరు.

ఎందుకంటే నదితో జోక్స్ సీరియస్ కాన్ సీక్వెన్స్ లకు దారి తీస్తుందని వారికి తెలుసు. ఇప్పుడు ఈ నది గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. గూగుల్ మ్యాపుల్లోకి కూడా చేరిపోయింది. ఆ ప్రాంతానికి చేరేందుకు, పర్యాటకాన్ని పెంచేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

అయితే ఈ బాయిలింగ్ రివర్ వద్దకు వెళ్లడం ప్రమాదం..పైగా అది చాలా మారుమూల అడవుల్లో ఉంది. అక్కడ ఏ సౌకర్యాలు కల్పించాలన్నా చాలా కష్టం.

video link

https://youtu.be/ImZMY41RAOY

Must Read

spot_img