Homeఅంతర్జాతీయంఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు..

ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది.. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ట్విటర్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగాలను తొలగించగా.. తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమైంది మైక్రోసాఫ్ట్..

ఈ – కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ దాదాపు 2,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ లో కొనసాగుతున్న తొలగింపులతో అమెజాన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ.. యాజమాన్యం ఉద్యోగుల తొలగింపులను సమర్ధించుకుంటోంది.

ఈ – కామర్స్ దిగ్గ‌జం అమెజాన్ 2,300 మంది ఉద్యోగులను తొలగించి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే మైక్రోసాఫ్ట్ 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన తరుణంలో, అమెజాన్ కూడా తన ఉద్యోగులను తొలగించ‌డం ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీల ఉద్యోగులలో ఒక రకమైన ఉద్యోగ అభద్రతను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ముఖ్యంగా 2023 నాటికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ముందే అంచనా వేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు లేఆఫ్ ల‌ను ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ దాదాపు 2,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ – కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ దాదాపు 2,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ లో కొనసాగుతున్న తొలగింపులతో అమెజాన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సియాటెల్ లో 1,852, వాషింగ్టన్ లోని బెల్లౌలో 448 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

అమెజాన్ 2,300 మంది ఉద్యోగులను తొలగించగా, మైక్రోసాఫ్ట్ సహా ప‌లు అంత‌ర్జాతీయ ప్ర‌ముఖ కంపెనీలు ఇప్పటికే వరుసగా తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్ప‌టికే మైక్రోసాఫ్ట్ 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన తరుణంలో, అమెజాన్ కూడా తన ఉద్యోగులను తొలగించ‌డం ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీల ఉద్యోగులలో ఒక రకమైన ఉద్యోగ అభద్రతను సృష్టించింది. అమెజాన్ తన ఉద్యోగులకు రెండు నెలల సమయం ఇచ్చింది.

అమెజాన్ నిరంతర తొలగింపులు ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సమయంలో, అమెజాన్ తన ఉద్యోగులను తొలగించడం ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులలో ఒక రకమైన ఉద్యోగ అభద్రతను సృష్టించింది.

గత ఏడాది నవంబరులో అమెజాన్ ఉద్యోగుల తొలగింపు కోసం లేఆఫ్ విధానాన్ని ప్రారంభించింది. అమెజాన్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత వారిని హార్డ్వేర్, మానవ వనరులు, వివిధ రంగాల నుంచి తొలగించారు.

  • 18,000 మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం..

అమెజాన్ మాత్రమే కాకుండా దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ వంటి సంస్థల్లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీకి ఫ్లాగ్ బేరర్ గా ఉన్న మైక్రోసాఫ్ట్ అమెరికాలోని తన కార్యాలయానికి లీజు ఒప్పందాన్ని పొడిగించబోమని ప్రకటించింది. అదే విధంగా మెటా కూడా తన అపార్ట్ మెంట్ కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించడం ద్వారా కార్పొరేషన్లు వివిధ పొదుపు చర్యలలో నిమగ్నమయ్యాయి.గత ఏడాది అతిపెద్ద టెక్ కంపెనీలతో సహా 60,000 మందిని తొలగించారు. అంతేకాకుండా, గత సంవత్సరం నుండి కొనసాగుతున్న తొలగింపుల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల్లో ఇప్పటి వరకు 3 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయి.

గత ఏడాది ప్రారంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం వెబ్ ఆధారిత కంపెనీలపై
ఎక్కువగా పడింది. ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి పెద్ద కంపెనీలు మొద‌లుకుని, చిన్న కంపెనీలు, వివిధ ప్రముఖ యాప్‌లు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల‌ను తొల‌గింపు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన కంపెనీల‌లో షేర్ చాట్ కూడా చేరింది. సోషల్ మీడియా దిగ్గజం షేర్‌చాట్ తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగించింది.

కేవలం అమెజాన్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు గడ్డు కాలం కొనసాగుతోంది. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇప్పటికే అమెజాన్, ట్విటర్, మెటా తదితర దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఈ జాబితాలో చేరింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది.

10వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కావడం షాకింగ్ విషయమే.. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య
నాదెళ్ల ఉద్యోగులకు మెయిల్ చేశారు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అవకాశాలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తప్పలేదని సత్య నాదెళ్ల అన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తులో కొత్త అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

10వేల మందిలో కొందరు వెంటనే ఇంటికి పోవాల్సి ఉంటుంది. మిగతా ఉద్యోగుల తొలగింపు రానున్న కొన్ని రోజులు, నెలల్లో ఉంటుంది. టెక్ పరిశ్రమలో స్లో
డౌన్ ఉండటమే ఉద్యోగుల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది.భవిష్యత్తులో ఎదురు కానున్న భయాలను దృష్టిలో పెట్టుకుని పలు దిగ్గజ కంపెనీలు.. లాభాల్లో ఉన్నప్పటికి.. ముందు జాగ్రత్తగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడీ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ కూడా చేరింది.

టెక్ పరిశ్రమలో కొంత అస్థిరత కొనసాగుతుండటం, భవిష్యత్ లో ఎదురుకానున్న భయాలను దృష్టిలో పెట్టుకుని పలు దిగ్గజ కంపెనీలు.. ముందు జాగ్రత్తగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగిస్తోంది..

Must Read

spot_img