Homeఅంతర్జాతీయంనల్లధనం నుంచి మనీ లాండరింగ్

నల్లధనం నుంచి మనీ లాండరింగ్

మనీ లాండరింగ్ జరిగిందంటూ తరచుగా వింటుంటాం.. ఇంతకూ మనీ లాండరింగ్ అంటే ఏంటి…? మనీ లాండరింగ్..? హవాలా.? అంటే ఒక్కటేనా..?హవాలా అంటే ఏంటి…? ఈ నెట్‌వర్క్‌ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది..?

మనీ లాండరింగ్ ఎప్పటి నుంచి జరుగుతోంది…?ఈ బిజినెస్ ఎంత పెద్దది…? మనీ లాండరింగ్ జరిగినట్లు బ్యాంకులు ఎలా తెలుసుకుంటాయి…? మనీ లాండరింగ్ నేరం రుజువైతే శిక్ష ఏంటి..? ఏయే దేశాలలో ఎలాంటి శిక్షలు అమలులో ఉన్నాయి..?

మనీ లాండరింగ్..? హవాలా.? అంటే ఒక్కటేనా..?

అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన లేదా ఆదాయానికి మించి సమకూరిన సంపాదనను బ్లాక్ మనీ అని అంటారు.. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియనే మనీ లాండరింగ్ అని అంటారు. అయితే… మొన్నటి మొన్న మహారాష్ట్రలో ఫేక్‌ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. థానే క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నకిలీ కరెన్సీని సీజ్‌ చేశారు. 8 కోట్ల విలువజేసే 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. వారు పాల్ఘర్‌కు చెందినవారుగా గుర్తించారు. అంతేకాదు.. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో హైదరాబాద్‌లో కూడా భారీ మొత్తంలో బ్లాక్‌ మనీ బయటపడింది. సుమారు 10.50 కోట్లకు పైగా నగదు పోలీసులు స్వాధీనం చేసుకోవటం చర్చనీయాంశం అయింది. అయితే ఈ మనీల్యాండరింగ్‌ అనేది మూడు దశలో జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ప్లేస్‌మెంట్‌, లేయరింగ్‌, ఇంటిగ్రేషన్‌.

ఉన్నపళంగా అక్రమంగా వచ్చిన భారీ డబ్బు లేదా ఆదాయాన్ని డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేయ్యాలి. కానీ అలా చేయకుండా ఆ డబ్బును చిన్న మొత్తాలుగా విడదీసి, వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లలో జమ చేస్తారు. అయితే ఇలా చట్టవ్యతిరేకంగా సంపాదించిన డబ్బును మాత్రమే ఇలా చేస్తారు. దీనినే ప్లేస్‌మెంట్‌ అని అంటారు. లేయరింగ్‌ అనగా.. చిరునామా అక్కర్లేని, విదేశీ బ్యాంకులలోనూ, దేశంలోని బాండ్లు, స్టాక్స్‌, ట్రావెలర్స్‌ చెక్కుల రూపంలోకి మార్చుతారు. ఇది మనీ లాండరింగ్ ప్రక్రియలో కీలకమైన దశ అనే చెప్పాలి.

అంతేకాదు..లెక్కలేనన్ని లావాదేవీలను నిర్వహించి, డబ్బు మూలాలను, అసలు యజమానిని ఎవరన్న విషయం తెలియకుండా చేస్తారు. అంతేకాదు.. ఈ దశలో డబ్బును పూర్తిగా ఆర్ధిక వ్యవస్థలోకి తెచ్చేందుకు సంక్లిష్టమైన లావా దేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలను కనిపెట్టడం అధికారులకు చాలా కష్టంగా మారుతుంది. ఈ పనిని చాలా వ్యూహాత్మకంగా, తప్పుడు లెక్కల ద్వారా చేస్తారు.

ఇక.. ఇంటెగ్రేషన్‌లో అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటారు. ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రాపర్టీ కొనడం లేదా మార్కెట్, ఖరీదైన కార్లు, నగలు, లేదా ఖరీదైన వస్తువులను కొనుక్కునేందుకు వాడతారు. ఎవరూ తమను పట్టుకోలేరనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో లాండరర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. దీంతో చట్టవ్యతిరేకంగా సంపాదించిన నల్లధనం అంతా ఇప్పుడు వైట్ మనీగా మారిపోతుంది. దీనినే ఇంటెగ్రేషన్ అని అంటారు. ఇక… హవాలా అంటే బదిలీ లేదా హండి అని కూడా అంటారు.

స్థానికంగా, అంతర్జాతీయంగా అనేక ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగించే అనధికారిక నిధుల బదిలీ వ్యవస్థలలో ఒకటి ఇది. డబ్బును ఒక దేశంలో నుంచి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్‌వర్‌ చేసేందుకు హవాలాదార్లు ప్రపంచమంతటా చాలా మంది ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా ప్రజలు ఈ అనధికార, సంప్రదాయ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలోని మధ్యవర్తులను హవాలాదార్‌లని పిలుస్తారు. వీరిపై ఉండే నమ్మకంపై ఆధారపడి ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుంది.

ఉదాహరణకు.. అమెరికాలో ఉన్న వ్యక్తికి చైనా నుంచి పంపించాలంటే.. ముందుగా మనం చైనాలో ఉండే హవాలాదార్‌ను కలుస్తారు… ఇందులో గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎలాంటి బ్యాంక్ ఖాతా అవసరం లేకుండానే ఈ విధానంలో డబ్బులు పంపొచ్చు. ఇందుకు చైనాలోని హవాలాదార్‌ కొంత కమిషన్‌ తీసుకుని ఈ పనిని చేస్తాడు. చైనాలోని ఉన్న హవాలాదార్‌కు డబ్బులు ఇచ్చిన వెంబడే అతడు.. ఓ పాస్‌వర్డ్‌ ను చెబుతాడు. ఇప్పుడు ఆ డబ్బును తీసుకోవాలని అనుకునేవారు అదే పాస్‌వర్డ్‌ను రెండో హవాలాదార్‌కు చెప్పాలి. డబ్బులు తీసుకునే వ్యక్తి చెబుతున్న పాస్‌వర్డ్ సరైనదో కాదో రెండో
హవాలాదార్ పక్కాగా చూసుకుంటాడు. అన్నీ సవ్యంగా ఉంటే, గంటల్లోనే రెండో వ్యక్తి చేతిలోకి డబ్బులు వెళ్లిపోతాయి. డబ్బులు చేతులు మార్చినందుకు ఇద్దరు హవాలాదార్‌లు స్పల్ప మొత్తంలో కమీషన్ తీసుకుంటారు.

నిజానికి, మనీ లాండరింగ్ 2000 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతోందని ఇండియా ఫోరెన్సిక్ వెబ్ సైటు పేర్కొంది. చైనాలో వ్యాపారులు డబ్బును రకరకాల వ్యాపారాలు, సంక్లిష్టమైన లావాదేవీల ద్వారా నిర్వహించి సంపాదనను ప్రభుత్వ అధికారుల నుంచి దాచిపెట్టేవారని చెబుతారు. కానీ, ఇటాలియన్ మాఫియా అల్ కాపోన్ అకౌంటంట్ చట్టవ్యతిరేకంగా సంపాదించిన డబ్బుకు లెక్కలు చెప్పలేకపోవడంతో ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలో 1920లు, 30లలో నగదు లావాదేవీలను మాత్రమే ఆమోదించే లాండ్రీలను మాఫియా నిర్వహించేది.

దోపిడీలు, వ్యభిచార ర్యాకెట్లు, జూదం లాంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా సంపాదించిన డబ్బును చట్టబద్ధం చేసేందుకు ఈ లాండ్రీలను కేంద్రంగా చేసుకుని లావాదేవీలు నిర్వహించేవారు. కాపోన్ మాఫియాకు లాండ్రీల ద్వారా నల్ల ధనాన్ని వైట్ మనీగా మార్చడానికి వాడటం వల్ల ఈ ప్రక్రియకు మనీ లాండరింగ్ అనే గ్లామర్‌తో కూడిన పేరు వచ్చిందని చెబుతారు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ప్రతి ఏటా మనీ లాండరింగ్ చేసిన సొమ్ము 5% 2019 వరకు ఉంటోందని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ తెలిపింది.

లాండరింగ్ నేరం రుజువైతే శిక్ష ఏంటి..? ఏయే దేశాలలో ఎలాంటి శిక్షలు అమలులో ఉన్నాయి..?

ఖనానీ.. దావూద్ ఇబ్రహీం నుంచి అల్ ఖైదా, జైషే మహమ్మద్‌ వరకు అందరి లావాదేవీలు నడిపిన పాకిస్తానీ 9/11 ఘటన అమెరికాలో సెప్టెంబరు 2001లో జరిగిన ట్విన్ టవర్స్ పేలుళ్లను చేపట్టేందుకు హైజాకర్లకు అవసరమైన డబ్బెలా వచ్చింది..? అంటే.. ఈ ఘటనకు అల్ ఖైదాకు 400,000 – 500,000 డాలర్ల ఖర్చు అయినట్లు అమెరికన్ అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 300,000 డాలర్లు హైజాకర్ల బ్యాంకు అకౌంట్ల ద్వారా పంపిణీ జరిగింది.ఈ 9/11 ఘటన మనీ లాండరింగ్ ప్రక్రియకు ఒక ప్రముఖ ఉదాహరణగా నిలుస్తుంది. యూఎస్ నేషనల్ కమీషన్ ఆన్ టెర్రరిస్ట్ ఎటాక్స్ సమర్పించిన నివేదికలో ఈ ప్రక్రియను వివరించారు.

“అల్ ఖైదా సభ్యులు డబ్బును భద్రపరచడం, బదిలీలు చేయడం కోసం అమెరికన్ బ్యాంకులను, ఆర్ధిక సంస్థలను ఉపయోగించారు. జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో ఉన్న మధ్యవర్తులు ఈ అకౌంట్లలోకి డబ్బును పంపించారు.”.. క్యాష్ డిపాజిట్లు, వైర్ ట్రాన్స్ఫర్స్, ట్రావెలర్ చెక్స్ మార్పిడి ద్వారా డబ్బును అకౌంట్లలోకి జమ చేశారు. వీటిని ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న మొత్తాల్లో నిర్వహించారు. విదేశీ అకౌంట్లలో ఉన్న డబ్బును ఏటీఎంలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా బయటకు తీశారు.”

“ఈ డబ్బును అమెరికాలో ఫ్లైట్ శిక్షణకు, రవాణా ఖర్చులు, గృహ, నిత్యావసరాలు, ఇతర రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించారు.

అయితే, ఈ లావాదేవీలు నిర్వహించిన వారికెవరికీ అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ గురించి అవగాహన లేదు. దీంతో, ఈ లావాదేవీల గురించి పేపర్ ట్రయిల్ నిర్వహించారు.”ఈ సంఘటన జరిగేటప్పటికి దేశంలో అమలులో ఉన్న మనీ లాండరింగ్ నిరోధించే చట్టాలు డ్రగ్ ట్రాఫికింగ్, భారీ మోసాలపై మాత్రమే దృష్టి పెట్టేవి. దీంతో, ఈ లావాదేవీలను కనిపెట్టలేకపోయారు.
“నిజానికి ఒసామా బిన్ లాడెన్ సొంత డబ్బును అల్ ఖైదాకు నిధులుగా ఇవ్వలేదు. గల్ఫ్ ప్రాంతంలో వివిధ ఇస్లాం స్వచ్చంద సంస్థలు, విరాళాల ద్వారా సేకరించిన డబ్బు అల్ ఖైదాకు నిధులుగా సమకూరేవి.” ఈ ఉదంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే సవాలును విసిరింది.ఈ సంఘటన తర్వాత అమెరికా ప్రభుత్వం టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ పై దృష్టి పెట్టి యూఎస్ పేట్రియాట్ చట్టం-2003ను అమలులోకి తెచ్చింది. చాలా దేశాలు తమ ఆర్ధిక నేరాల నియంత్రణ చట్టాలను కొత్తగా రూపొందించడం లేదా పటిష్ఠపరచడం చేసుకున్నాయి.

ఈ చట్టం ద్వారా ఆర్ధిక వ్యవస్థలు, బ్యాంకులు అమలు చేసే నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం ఆర్ధిక సంస్థలకు సూచించింది. బ్యాంకులో అకౌంట్ తెరిచినప్పుడే సగటు ఆదాయ వర్గాల్లోకి ఖాతాలను వర్గీకరిస్తారు. నిర్ణీత పరిమితి దాటి అకౌంట్లలోకి డబ్బు చేరినప్పుడు, బ్యాంకులో లావాదేవీలను పర్యవేక్షించే ట్రాన్సాక్షన్ మానిటరింగ్ విభాగానికి ఆటోమేటిక్ ట్రిగర్ వెళుతుంది.

ఈ విభాగం నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడకు వెళుతున్నాయనే విషయాలను తమకు అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా సమీక్ష చేస్తుంది. ఈ లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానిస్తే అకౌంట్‌ను బ్లాక్ చేయడం లేదా ఆ వివరాలను ప్రభుత్వ ఆర్ధిక నేరాల పరిశోధన విభాగానికి అందచేస్తుంది. భారతదేశంలో ఈ వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు అందచేస్తుంది. సదరు వ్యక్తులు లేదా సంస్థల అకౌంట్లలోకి జరిగే లావాదేవీలను పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటుంది. చాలా రకాల నేర కార్యకలాపాలను తెలుసుకునేందుకు చట్ట వ్యవస్థలు ఆర్ధిక వ్యవస్థలు అందించే సమాచారం పై ఆధారపడతాయి.

మనీ లాండరింగ్ నిరోధించే వ్యవస్థలు పటిష్టంగా లేకపోవడంతో చాలా అంతర్జాతీయ బ్యాంకులు భారీ మొత్తంలో ఫైన్లను చెల్లించాయి. మనీ లాండరింగ్ కార్యకలాపాలను అడ్డుకోలేకపోయినందుకు నాట్‌వెస్ట్ యూకే రెగ్యులేటర్లకు 265 మిలియన్ పౌండ్ల జరీమానాను చెల్లించింది. హెచ్‌ఎస్‌బీ‌సి హోల్డింగ్స్ సంస్థ కార్యకలాపాల్లో మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 1.92 బిలియన్ డాలర్ల జరిమానాను అమెరికన్ అధికారులకు చెల్లించేందుకు అంగీకరించింది.

భారత్‌ లో మనీ లాండరింగ్ చట్టం 2002ను అనుసరించి మనీ లాండరింగ్ నేరాలకు 3 – 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇది వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. మనీ లాండరింగ్‌తో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసినట్లు కూడా నిరూపణ అయితే, 10సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

Must Read

spot_img