Homeతెలంగాణబిజెపి అమలు చేయనున్న వ్యూహమేంటి ?

బిజెపి అమలు చేయనున్న వ్యూహమేంటి ?

తెలంగాణలో పాగా వేయాలని చూస్తోన్న కమలనాథులకు .. నల్గొండ జిల్లా కొరుకుడు పడడం లేదు. దీంతో ఈ జిల్లాలో గనుక పాగా వేయగలిగితే, పీఠం చేరుకోవడం సులువేనని కాషాయ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే నల్గొండ జిల్లాలో బిజెపి చాప కింద నీరులా పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరిని అక్కున చేర్చుకోగలిగింది. అదే ఊపుతో బైపోల్ కు తెర తీసింది. అయితే ఓటమి పాలైనా, గట్టి పోటీ ఇచ్చింది. ఓ విధంగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అసలు ఊసే లేని మునుగోడు లో సత్తా చాటి, బీజెపి ఉనికి ఉందని నిరూపించింది. ఓటమి పాలైనా, రెండో ప్లేస్ లో నిలవడం ఓరకంగా పార్టీలో జోష్ తెచ్చింది. దీంతో ఇదే జోష్ ను జిల్లా వ్యాప్తంగా కంటిన్యూ చేయాలనే ప్లాన్ తో ఉంది కమల దళం. అందుకు అర్బన్ ప్రాంతాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎలాగైనా జెండా పాతాలనే కసితో ఉంది. దాంతో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నవేళ ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలెట్టే కార్యక్రమాలు షురూ చేసింది బిజెపి.

ఇందులో భాగంగానే నల్గొండ సెగ్మెంట్ పై కాస్త గట్టిగానే గురి పెట్టింది. దీనిలో భాగంగా ఆశావహులే టార్గెట్ గా వ్యూహాలు పన్నుతోంది.అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికైతే ఎవరికి టికెట్ హామీ ఇవ్వలేదు కానీ పోటీకి సిద్దమవుతున్న వారి లిస్ట్ మాత్రం బాగానే ఉందట. దీంతో ఆశావాహుల సంఖ్య ఓ విధంగా హై కమాండ్ కు ఆందోళన కలిగిస్తోందని టాక్ వినిపిస్తోంది. వైద్య, విద్యా, న్యాయ నిపుణులు కూడా నల్గొండలో సమరానికి సై అంటున్నారు. అవకాశమొస్తే కాలు దువ్వేందుకు రెడీ అవుతున్నారు.అయితే ఈ లిస్ట్ లో ముగ్గురి పేర్లు .. కీలకంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి నల్గొండ అర్బన్ ప్రాంతంలో బిజెపికి మంచి పట్టే ఉండేది. ఒకప్పుడు అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలిచి ఛైర్మెన్ పీఠం కూడా దక్కించుకుంది బిజెపి,ఇక నల్గొండ సెగ్మెంట్ పై కన్నేసిన వారిలో ముందు వరసలో ఉన్నారు మాదగోని శ్రీనివాస్ గౌడ్. కాకతీయ విద్యా సంస్థల అధినేత అయిన శ్రీనివాస్ గౌడ్ టీడీపి లో చాలా కాలం పాటు పనిచేశారు. 2018 ఎన్నికల తర్వాత ఆయన బిజెపిలో చేరారు. ఆయన బిజెపిలో చేరారు.

బీఅర్ఎస్ ను
ఎదుర్కొనేందుకు బిజెపి అమలు చేయనున్న వ్యూహమేంటి ?

టీఆర్ఎఎస్ ప్రభుత్వంపై పోరాటంలో బాగంగా ఆయన చేసిన కార్యక్రమాలు హై కమాండ్ ను ఆకర్షించాయి. అప్పటి నుంచి టికెట్ తనదేనన్నధీమాతో పని చేస్తూ వస్తున్నారు శ్రీనివాస్ గౌడ్. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. హై కమాండ్ఆదేశిస్తే నల్గొండ సెగ్మెంట్ లో బరిలో దిగడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

టీడీపీలో ఉన్నప్పుడే నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ .. బిజెపిలోనూ అదే ఫాలోయింగ్ మెయింటైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నల్గొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఓసి సామాజిక వర్గ నేతలను గనుక బరిలోకి దింపితే, బీసీ ఈక్వేషన్ లో బిజెపి నుంచి శ్రీనివాస్ గౌడ్ టికెట్ కు ఎదురుండక పోవచ్చనే అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. నల్గొండలో అత్యధిక ప్రభావం చూపే బీసీ ఓటర్లు, బిజెపి అనుబంధ సంఘాలు, పార్టీ కేడర్ శ్రీనివాస్ గౌడ్ కు అదనపు బలంగా వీరంతా భావిస్తున్నారు. ఈ ఈక్వేషన్లు గనుక కలిసొస్తే శ్రీనివాస్ గౌడ్ గెలుపు ఖాయమనే లెక్కలేసుకుంటున్నారు ఆయన అనుచరులు.

ఇక ఇదే సెగ్మెంట్ పై గురి పెట్టిన వారిలో ఒకరు నూకల నర్సింహ రెడ్డి. ప్రముఖ న్యాయవాది అయిన ఈయన బిజెపిలో చాలా కాలం నుంచే పనిచేస్తున్నారు. నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షునిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం నర్సింహ్మారెడ్డి కూడా పార్టీలో యాక్టీవ్ గా ఉన్నారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నల్గొండ అసెంబ్లీ టికెట్ కోసం నర్సింహ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఆ మేరకు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల వద్ద పైరవీలు కూడా షురూ చేశారని టాక్. అగ్ర నాయకులపై గల నమ్మకంతో గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకుంటున్నారని కేడర్ సైతం చెబుతోంది. పరిస్థితులు సానుకూలంగా కలిసి వస్తే, వ్యక్తిగత చరిష్మాకి తోడు, పార్టీ బలం తనకు అడ్వాంటేజ్ అని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలంగా మారితే, గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారట నూకల నర్సింహ రెడ్డి. అందుకే అందిన అవకాశాన్ని వదులు కోకుండా…టికెట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారట.

ఇక టికెట్ రేసులో నేనున్నానంటూ అనూహ్యంగా తెరపైకి వచ్చారు డాక్టర్ వర్షిత్ రెడ్డి. నాగం ఆస్పత్రి ఛైర్మెన్ గా ఉన్న వర్శిత్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. అందుకే జనంలో గుర్తుండి పోయేలా ఈ మధ్య సేవా కార్యక్రమాలు సైతం మొదలెట్టారు. నియోజక వర్గ వ్యాప్తంగా హెల్త్ క్యాంపుల పేరుతో ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి అత్యంత సన్నిహితులు అయిన వర్షిత్ రెడ్డి జాతీయ అధినాయకత్వం తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే నల్గొండ అసెంబ్లీ టికెట్ కోసం హై కమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టారట వర్షిత్ రెడ్డి. ప్రస్తుతం హై కమాండ్ పరిశీలనలో వర్షిత్ రెడ్డి పేరున్నా, సీనియర్ లను కాదని వర్షిత్ రెడ్డికి అవకాశం వస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ టికెట్ రేసులో పోటీకి వస్తున్న శ్రీనివాస్ గౌడ్, నూకల నర్సింహ రెడ్డిల్లో ఒకర్ని లోక్ సభ స్థానానికి పంపించే ప్రతిపాదన పెడితే, తనకు అవకాశం రాకపోదా అనే చిన్న ఆశతో ఉన్నారట వర్షిత్ రెడ్డి.

అందుకే ఆయన టికెట్ కోసం పైరవీలు, ప్రయత్నాలు ఆపడం లేదట. ఆర్ధిక బలానికి తోడు సామాజిక సేవలు కలిసొచ్చే అంశాలుగా వర్షిత్ రెడ్డి భావిస్తున్నారట.మొత్తానికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో కూడా టిక్కెట్ రేసు బాగానే ఉందన్న టాక్ వెల్లువెత్తుతోంది. పర్సనల్ ఈక్వేషన్స్ తో హై కమాండ్ వద్ద ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారట.

Must Read

spot_img