Homeజాతీయంబీజేపీ సీనియర్ నేత కన్నా .. ఆ పార్టీకి రాజీనామా చేశారు ఎందుకు ?

బీజేపీ సీనియర్ నేత కన్నా .. ఆ పార్టీకి రాజీనామా చేశారు ఎందుకు ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. తాజాగా తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే బీజేపీ కి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కార్యకర్తల సూచనలు.. సలహాలు తీసుకున్న తరువాత.. పూర్తిగా వారితో చర్చించే .. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరాలి అన్నదానిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీ, జనసేన నేతలతో పూర్తి చర్చల తరువాత.. ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీకి దూరంగానే ఉంటున్నారు కన్నా లక్ష్మీ నారాయణ..

ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎంపీ జీవీఎల్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ మధ్య ఆయన నేరుగా బీజేపీ ఎంపీ.. కీలక నేత జీవీఎల్ నరసింహంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఏం చేశారని.. జీవీఎల్ కు సన్మానం చేశారని ప్రశ్నించారు. చాలాకాలంగా కన్నా.. పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. అప్పుడే ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అయితే ఎన్నికలకు అప్పటికీ ఇంకా సమయం ఉండడం.. టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో అప్పటికి నిర్ణయం వాయిదా వేసుకున్నారని అనుచరులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి పెంచుతోంది. ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. మరింతగా బలం పెంచుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాంతాలు – సామాజిక సమీకరణాల వారీగా కొత్త స్కెచ్ అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు కోసం వేచి చూసే ధోరణితో కనిపించిన టీడీపీ..ఇప్పుడు వ్యూహం మార్చినట్లు స్పష్టం అవుతోంది.

తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో బీజేపీతో పొటీగా పవన పైనా ఒత్తడి పెంచుతోంది. వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏ అవకాశాన్ని వదులు కోవటానికి సిద్దంగా లేరు. అందులో భాగంగానే తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కన్నా .. దారెటు అన్నది సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే బాబు వెంట నడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

2019 ఎన్నికల వేళ బీజేపీకి చంద్రబాబు దూరం అయ్యారు. ఆ ఎన్నికల్లో ఫలితాల తరువాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీ – కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా చంద్రబాబు వ్యవహరించలేదు. రెండు సందర్భాల్లో ఢిల్లీలో ప్రధాని నిర్వహించిన సమావేశాలకు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ రెండు సమావేశాలను చంద్రబాబు సద్వినియోగం చేసుకున్నారు. ఇక, వచ్చే ఎన్నికల పైన చంద్రబాబు సీరియస్ గా ఫోకస్ చేసారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జనసేనతో పొత్తుకు సిద్దమయ్యారు.

అటు బీజేపీతోనూ మైత్రికి సంకేతాలు ఇచ్చారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. అటు పవన్ కల్యాణ్ పైన టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నుంచి ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో, తాజాగా చంద్రబాబు బీజేపీకి తొలి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసారు. తొలుత కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ఆయనకు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

బీజేపీతో పొత్తు కారణంగా జనసేనలో చేరేందుకు కన్నా ఆసక్తి చూపినా, జనసేన నేతల నుంచి సరైన స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో.. టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. అయితే, అటు బీజేపీ – జనసేన తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసిన నేతను తన పార్టీలో చేర్చుకోవటం కొత్త ఎత్తుగడగా కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా తమ పార్టీలో చేరటం ద్వారా గుంటూరు జిల్లాలో బలం పెరుగుతుందని టీడీపీ అంచనాగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామనే హామీతో పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

ఇప్పుడు కన్నా టీడీపీ వైపు వెళ్తున్నారనే సమాచారం బీజేపీలో చర్చకు కారణమవుతోంది. టీడీపీతో కలిసి పవన్ జత కడుతున్న వేళ..బీజేపీ నుంచి పరోక్షంగా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న వేళ..ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న వారికి టీడీపీ వేదికగా మారటం ఆసక్తి కరంగా మారుతోంది. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత గతంలో టీడీపీలో పని చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి ఆ నేత సైతం టీడీపీలో రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకీ రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అనుచరులతో సమావేశం తర్వాత నిర్ణయాన్ని ప్రకటించారు.. అయితే కన్నా ఏ పార్టీలో చేరతారనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైంది. పార్టీకి రాజీనామా ప్రకటించిన కొద్దిసేపటికే.. కన్నా ఈ నెల 24న టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కన్నా గురించి మరో రూమర్ కూడా మొదలైంది. కన్నా పది రోజుల క్రితం టీడీపీ పెద్దలతో హైదరాబాద్‌లో సమావేశం అయ్యారని.. స్వయంగా అధినేతే టీడీపీలోకి ఆహ్వానించడంతో ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల్లో కన్నా అధికారికంగా టీడీపీలో చేరికపై ప్రకటన చేస్తారని అంటున్నారు.

Kanna press meet

కన్నా మాత్రం తన భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారు. కాగా కన్నా టీడీపీలో చేరితే ఎక్కడ సీట్
ఇస్తారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని కొంతమంది ట్వీట్‌లు చేశారు. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి బరిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కొద్దిరోజుల క్రితం లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి.

సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో తెలుగు దేశం పార్టీలో చేరతారని అంటున్నారు. కన్నా బీజేపీకి రాజీనామా
చేయడం ఖాయమని చాలా రోజుల క్రితమే ప్రచారం జరిగింది. 2014లో మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీలోకి వచ్చానని.. తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారని గుర్తు చేశారు. మొత్తం మీద మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కన్నా లక్ష్మీనారాయణ..

గుంటూరులోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సీనియర్ నేత, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి జాబితాలో కూడా కన్నా పేరు వినిపించింది. అంతటి సీనియర్ నేత పరిస్థితులు, మారిన రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వచ్చారు. వచ్చీరాగానే ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీకి కూడా రాజీనామా చేసి తర్వాత ఏ పార్టీలో చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై కన్నా ప్రకటన కోసం సర్వత్రా ఆసక్తి వెల్లువెత్తుతోంది.

Must Read

spot_img