భారత్ వంటి దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతూ.. ఏకంగా అత్యధిక జనాభా కలిగిన చైనాను కొద్దిరోజుల్లో అధిగమించనుంది.. ఇండియాకు అధిక జనాభా సమస్యగా మారే అవకాశం ఉంటే.. ఆ దేశంలో మాత్రం అసలు జనాభా పెరగకపోగా.. తగ్గుముఖం పడుతోందని అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది..
పిల్లలను కనండి.. లక్షల రూపాయల నజరానా పొందండి.. ఇదీ.. తమ ప్రజలకు జపాన్ ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్.. ఆ దేశంలో జననాల రేటు పూర్తిగా తగ్గిపోవడంతో.. జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం గతంలో ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచింది..
పిల్లలను కంటే రూ.3లక్షలు నజరానా.. ఆఫర్ అదిరిపోయింది కదూ. పిల్లలను కనే తల్లిదండ్రులకు రూ.3లక్షలు నజరానాగా ఇస్తామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది.. అయితే, ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ పనిలో ఉంటాం అని తొందర పడొద్దు. ఎందుకంటే ఈ ఆఫర్ ఇచ్చింది మన ప్రభుత్వం కాదు.. జపాన్ ప్రభుత్వం.
జపాన్ లో యువత జనాభా బాగా తగ్గిపోయింది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారింది. నానాటికి తగ్గిపోతున్న యువత జనాభా వ్యవహారం జపాన్ ప్రభుత్వాన్ని చాలా కాలంగా ఆందోళనకు గురి చేస్తోంది. తగ్గిపోతున్న జననాల రేటు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇంకా ఊరుకుంటే లాభం లేదని నిర్ణయించిన జపాన్ ప్రభుత్వం.. జనాభాను పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగా పిల్లలను కనేలా ప్రజలను ప్రేరేపించడానికి చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది.
భారత్ లాంటి దేశాలు అత్యధిక జనాభాతో సతమతమవుతుంటే జపాన్ లాంటి దేశాల్లో జననాల రేటు బాగా తగ్గిపోతోందని వాపోతోంది.
ప్రస్తుతం శిశుజననాల రేటు వందేళ్ల కనిష్ఠానికి దిగివచ్చింది. దీంతో ప్రభుత్వం తమ పౌరులను పెద్ద ఎత్తున పిల్లలను కనండి బాబు అంటూ బుజ్జిగిస్తోంది. కావాలంటే మీకు డబ్బు కూడా ఇస్తామంటూ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జపాన్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దేశంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో దానికి తగ్గట్టు కొత్తగా జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో బ్యాలెన్స్ కుదరడం లేదు. దేశంలో పనిచేసే యువత లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. దీంతో జనాభా పెంచుకోవడానికి జపాన్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అంశాలను పరిశీలిస్తోంది.
ప్రజలకు ప్రోత్సాహాకాలు ఇస్తే జనాభా పెరిగే అవకాశం ఉందని జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వశాఖ భావిస్తోందని తాజాగా నివేదికలో వెల్లడించింది.
జపాన్‌లో పెళ్లి చేసుకొని పిల్లలు కంటే చైల్డ్‌కేర్ లంప్సమ్ గ్రాంట్ కింద 2,52,338 రూపాయల ఆఫర్ చేస్తోంది. అయినా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జపాన్ ప్రభుత్వం ఏకంగా 5 లక్షల యెన్‌లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 3,00,402 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జపాన్‌కు చెందిన హెల్త్ మినిస్టర్ప్ర ధానమంత్రి ఫుమియో కిషిడాతో గత వారం చర్చలు జరిపారు. జనాభా పెంచడానికి ప్రోత్సహకాలను కాస్తా పెంచుదామని ప్రధానమంత్రి దృష్టి తీసుకువచ్చారు. కాగా ప్రధానమంత్రి కూడా దీనికి అనుకూలంగా స్పందించారని చెబుతున్నారు. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తజంటలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రోత్సహకాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున పిల్లలు కనే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గతంతో పోల్చుకుంటే భారతీయ కరెన్సీ ప్రకారం కేవలం 48వేల రూపాయాలు మాత్రమే ప్రభుత్వం పెంచింది.
జపాన్‌లో ఒక్కో కాన్పుకు ప్రజలు సొంతంగా డబ్బు చెల్లించుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రకటించిన చైల్డ్ బర్త్ అండ్ చైల్డ్‌కేర్ లంప్స్‌మ్ గ్రాంట్ విషయానికి వస్తే జపాన్ పబ్లిక్ మెడికల్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్ భరిస్తుంది. సాధారణంగా జపాన్‌లో ఒక డెలివరీ లేదా కాన్పుకు 4లక్షల73వేల యన్‌లు ఖర్చవుతుంది. ప్రభుత్వం తాజాగా ఆఫర్ చేస్తున్న ప్రోత్సాహకాల తర్వాత కాన్పు అయిన తర్వాత ఆస్పత్రి బిల్లు చెల్లించిన తర్వాత జంటకు మిగిలేది కేవలం 30వేల యూవాన్‌లు మాత్రమే. ప్రస్తుతం ప్రభుత్వ గ్రాంట్ పెంచిన తర్వాత కూడా పేరంట్స్ చేతికి పెద్దగా డబ్బు రాదు.
మొట్టమొదటిసారి జపాన్‌లో చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్ కింద 2009లో ప్రభుత్వం 80వేల యెన్‌లు పెంచింది.
కాగా జపాన్ ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన జనాభా గణాంకాల వివరాల ప్రకారం వందేళ్లలో ఈ స్థాయిలో జననాల రేటు పడిపోవడం ఇదే మొదటిసారని పేర్కొంది. గత ఏడాది దేశంలో 8,11,604 మంది శిశువులు పుడితే.. అదే సమయంలో 14,39,809 మంది చనిపోయారు.ఈ లెక్కన చూస్తే జనాభా 6,28,205 తగ్గినట్లు లెక్క.
తాజాగా జనాభా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది జపాన్ ప్రభుత్వం. పిల్లలను కనాలనుకునే దంపతులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న నజరానా మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. పిల్లలను కనే దంపతులకు గతంలో రూ.2.50లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు దాన్ని రూ.3లక్షలకు పెంచారు. నిజానికి.. పిల్లలను కనాలనుకునే జంటకు ఆర్థిక సాయాన్ని గతంలోనే జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ.. ప్రజల ఆలోచనా తీరులో మార్పు రాకపోవడంతో గతంలో ప్రకటించిన మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచింది.
ప్రస్తుతం జపాన్‌లో బిడ్డ పుడితే రూ.2.50 లక్షలకు పైగా ఆర్థిక సాయం బిడ్డ తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఇప్పుడు దాన్ని రూ.3 లక్షలకు పెంచారు. ఇది 2023 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. జపాన్ లో డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒక్కో డెలివరీకి రూ.2.60 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
గతేడాది జపాన్ లో మొత్తం 8లక్షల 11వేల 604 మంది పిల్లలు పుట్టగా, ఆ ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 14 లక్షలకు పైగా ఉంది. ఇక జపాన్‌లో 100ఏళ్లు దాటిన వారి సంఖ్య 86 వేలు దాటింది. వీరిలో 88 శాతం మంది మహిళలు ఉన్నారు. జపాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 లో జపాన్‌లో అత్యల్ప సంఖ్యలో పిల్లలు పుట్టారు. దాంతో ప్రభుత్వం యువత జనాభా పెరుగుదల కోసం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. జనాభా పెరుగుదల ఆవశ్యకతపై పెళ్లైన జంటలకు అవగాహన కల్పించింది ప్రభుత్వం. అయినప్పటికీ జనాభా పెరుగుదలలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పిల్లలను
కనే తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఆ మొత్తాన్ని పెంచింది.
దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే మొదటిసారి అని జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.. జపాన్‌తో పాటు దక్షిణ కొరియాలో కూడా యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి పెద్ద ఇష్టపడ్డం లేదు. సింగిల్ గానే జీవితం గడపాలనే ఆలోచనకు వచ్చారు. పెళ్లి చేసుకొంటే అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది.. పిల్లల సంరక్షణ అత్యంత ఖరీదైన విషయం కాబట్టి.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే కాలం గడపాలనుకుంటున్నారు. అదనపు బాధ్యతలను తాము మోయలేమని స్థాయికి యువత వచ్చారు. యువతలో వస్తున్న మార్పుల కారణంగా దాని ప్రభావం దేశ జనాభాపై పడుతోంది. ప్రస్తుతం జపాన్ కూడా జనాభా కొరతతో సతమతమవుతోంది.
చూడాలి మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలితం ఇస్తుందో. పాపం జపాన్ ప్రభుత్వం.. జననాల రేటు పెంచేందుకు నానా తంటాలు పడుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. నగదు ప్రోత్సాహకం పెంపుతో జంటల్లో మార్పు వస్తుందని, ఎక్కువ మంది పిల్లలను కంటారని ఎన్నో ఆశలు పెట్టుకుంది.
జననాల రేటు పడిపోవడంతో.. ఎలాగైనా సరే దేశ జనాభాను పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది జపాన్ ప్రభుత్వం.. గతంలో ఇచ్చే ప్రోత్సహక మొత్తాన్ని మరింతగా పెంచింది.. ఇప్పటికైనా.. అక్కడి జనాభా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపిస్తారా..? లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది.. ………………………………..