Homeసినిమా‘బిచ్చగాడు 2’ రిలీజ్ డేట్ లాక్....

‘బిచ్చగాడు 2’ రిలీజ్ డేట్ లాక్….

విజయ్ ఆంటోని ఆరేళ్ల క్రితం నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో గుర్తుందా? 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అదే సంవత్సరం నోట్ల రద్దు జరగడం.. ఈ సినిమాలో బిచ్చగాడు.. 500, 1000 నోట్లను రద్దు చేయమని సూచించడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నోట్ల రద్దును బిచ్చగాడు ముందుగానే అంచనా వేశాడంటూ మీమ్స్ హల్చల్ చేశాయి. సీన్ కట్ చేస్తే.. బిచ్చగాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అప్పట్లో బిచ్చగాడు టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంటను తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ చేసిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అయిన బిచ్చగాడు-2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విజయ్ ఆంటోనీ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై కోలీవుడ్ వర్గాలతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. బిచ్చగాడు-2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈమేరకు వారు సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్, ఎడిటింగ్ వర్క్ కూడా విజయ్ ఆంటోనీయే చేస్తున్నాడు.

బిచ్చగాడు 2 డిజిటల్‌, శాటిలైట్ హక్కులకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్ ను స్టార్ నెట్‌వర్క్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్‌. సీక్వెల్ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ఆంటోనీయే స్వయంగా డైరెక్ట్‌ చేస్తూ.. సంగీతమందిస్తుండటం విశేషం. కొన్ని నెలల క్రితం విడుదలైన బిచ్చగాడు 2 థీమ్‌ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. 2023 సమ్మర్‌ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు,తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Must Read

spot_img