Homeఅంతర్జాతీయంఏం చేయకుండా ఖాళీగా ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిదేనట..

ఏం చేయకుండా ఖాళీగా ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిదేనట..

ఏమీ చేయకుండా ఉండటం లిటరల్ గా మౌనంగా నిశ్చలంగా ఉండటం అంటే బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం లాంటిదే.. ఎందుకంటే స్వయంచలనంగా పనిచేసే మెదడు ఎవరి ఆధీనంలో ఉండదు..నిరంతరం ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. విపరీతమైన ఆలోచనలు చేయడం ఎంత అవసరమో అప్పుడుప్పుడు ఖాళీగా ఉండటం కూడా బ్రెయిన్‌కి అవసరం. ఎవరైనా ఖాళీగా కూర్చో,.. ఏం చేయకు.. అని చెప్పారంటే చాలు కచ్చితంగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులన్ని గుర్తుకు వస్తాయి.

లేదంటే ఏమైనా మంచి పనులు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి కొందరు ఎంత బిజీగా ఉంటారంటే..లేదా బిజీగా ఉన్నామని అనుకుంటారంటే.. ఈమెయిల్స్ చెక్ చేయడానికి, పెండింగ్‌లో ఉన్న పనులు చేయడానికి, కుటుంబాన్ని సంరక్షించేందుకు రోజులో ఉన్న సమయమే సరిపోదని భావిస్తుంటారు., ఇది సహజం. ఒకవేళ ఈ పనులే కానీ లేకపోతే, వెంటనే ఆన్‌లైన్‌లో ఏదైనా వెతికేందుకు మొబైల్ డివైజ్‌లకు అతుక్కుపోతుండట కూడా జరుగుతుంది.

లేదంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లను వెతికి వెతికి బిజీ అవయిపోతారు. ఇంకా ఖాళీ దొరికితే నచ్చిన సినిమాలు చూసేస్తారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఖాళీగా ఉండడాన్ని విలువైన ఆప్షన్‌గా భావిస్తున్నారు. నిజానికి ఖాళీగా ఉండడం గురించి మంచి అభిప్రాయం ఉండదు. కానీ, ఇలా ఉండటం వలన మనిషిలో సృజనాత్మకతను పెంచుతుందని న్యూరోసైంటిస్టులు చెప్తున్నారు.

ఒక పనికి కట్టుబడి ఉండటాన్ని, పని ఉత్పాదకతను పెంచుతుందని న్యూరోసైంటిస్టులు తెలిపారు. కొంత మంది వ్యక్తులు తమ ఆలోచనలతో ఒంటరిగా ఉండటం కంటే, తమకు తాము చిన్నగా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చుకునేందుకు సైతం మొగ్గు చూపారని చెప్పిన ఈ ప్రయోగం సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ ప్రయోగంలో, కొంత మంది వ్యక్కుల్ని ఒక గదిలో 15 నిమిషాల పాటు ఖాళీగా కూర్చోవాలని ఆదేశించారు.

అలా ఖాళీగా కూర్చోలేకపోతే, వారి ముందున్న ఒకే ఒక్క ఆప్షన్. వారి ముందున్న బటన్ నొక్కడం..అంటే తమకు తాము విద్యుత్ షాక్‌ ఇచ్చుకోవడం అన్నమాట. ఇది కేవలం ప్రయోగం మాత్రమే ఎవరూ అనుకరించాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ ప్రయోగంలో ఏం తేలిందంటే..వీరిలో 42 మంది పార్టిసిపెంట్లు ఉంటే అందులో సుమారు సగం మంది కనీసం ఒక్కసారైనా బటన్ నొక్కి, విద్యుత్ షాక్ ఇచ్చుకున్నారు.

అంతకుముందు ఒకసారి వారికి విద్యుత్ షాక్ అనుభవం ఉన్నప్పటికీ, ఖాళీగా కూర్చోలేక ఆ బాధనే భరించేందుకు మొగ్గు చూపారు. వీరిలో ఒకరు 190 సార్ల వరకు విద్యుత్ షాక్‌ ఇచ్చుకున్నారు. నిజానికి మెదడు ఒక రోజులో 24 గంటల పాటు, వారంలో 7 రోజుల పాటు పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ నిద్రపోయినా, మెదడు మెలకువతోనే ఉంటుంది. మనిషిని సురక్షితంగా ఉంచేందుకు బయట శబ్దాలను వింటుంది. విషయాలను గుర్తిస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనాన్నిస్తుంది. తెలియని విషయాల్లో కూడా సరేన పరిష్కారాలు కనుక్కునేలా, నిర్ణయాలు తీసుకునేలా మెదడు సహకరిస్తుంది.
శరీరంలో మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే అవయవం. ఈ అవయవం అసలు ఆగిపోవడం కానీ లేదా బ్రేక్ తీసుకోవడం కానీ ఉండదు. ఒకవేళ అదే జరిగితే అంటే బ్రెయిన్ ఆగిపోతే బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే మనిషి చనిపోయినట్టుగా డిక్లరేషన్ అన్నమాట.

అయితే దీనికి కూడా పరిమితులుంటాయని న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు. రోజంతా పనిచేసిన తర్వాత మెదడు తనను తాను శుభ్రపరుచుకునేందుకు నిద్రను ఆలంభనగా చేసుకుంటుంది. ఇది మెదడు చేసే అతి ముఖ్యమైన దానిలో ఒకటిగా చెబుతున్నారు నిపుణులు. నిజానికి నిద్రలో కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. కానీ, ఒంటరిగా, ఖాళీగా ఉండటం బ్రెయిన్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

ఇటలీలో దీని గురించి మరింత స్పష్టత ఉంది. ఇటలీలో ఏ పనిచేయకపోవడాన్ని తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు. ఏం చేయకుండా ఉండటం అదృష్టంగా భావిస్తారు. వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.

ఆత్మపరిశీలనకు, స్వాంతనకు జీవితంలో కొంత భాగాన్ని కేటాయించాలి.

అయితే ఇది.. కేవలం ఒక కునుకు వేసినట్టు కాదు, ఏదో తెలియని లోతైన ఫీలింగ్. ఆత్మపరిశీలనకు, స్వాంతనకు జీవితంలో కొంత భాగాన్ని కేటాయించాలి. రోజూ చేసే పనుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, ఖాళీగా ఉంటూ మెదళ్లకు సహకరించాలి. ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుకోవడం, బ్రెయిన్ ఆరోగ్యానికి ఎంతో అవసరమని అమెరికాలోని రెన్సీలార్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ కాగ్నిటివ్ సైన్సస్ డిపార్ట్‌మెంట్ రీసెర్చర్, న్యూరోసైంటిస్టు అలిసియా వాల్ఫ్ చెబుతున్నారు.

”ఎప్పుడైతే పనిచేయడం ఆపివేస్తారో అప్పుడు మెదడు డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్‌లోకి వెళ్తుందని సోషల్ న్యూరోసైంటిస్టులు కనుగొన్నారు. అంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరిలోనైనా సృజనాత్మకతను తట్టిలేపే ఆలోచనలు బయటకు వస్తాయి. సరికొత్త ఆలోచనలు పుట్టేందుకు ఇది ఇంక్యుబేషన్ సమయాన్ని అందిస్తుంది. మనం అత్యధికంగా పనిచేయలేనప్పుడు మెదడుకి అత్యంత ఎక్కువగా రెస్ట్ అవసరం పడుతుంది.

అయితే, కొంతమంది ప్రముఖ రచయితలు తమకు ఫర్నీచర్‌ను ఇటుఇటూ జరిపే సమయంలో, స్నానం చేసేటప్పుడు.. లేదంటే గార్డెన్‌లో పిచ్చి మొక్కలు పీకే సమయంలో సృజనాత్మక ఆలోచనలు వచ్చాయని చెబుతుంటారు. ప్రేరణగా నిలిచే ఈ మూమెంట్లను ఇన్‌సైట్‌గా అభివర్ణిస్తారు. అందుకే ఏమీ చేయకుండా ఏ ఆలోచనలు లేకుండా కొంత సమయం కేటాయించుకోవడం ధ్యానం అని కూడా అంటారు.

ధ్యానం వల్ల మనసు తనలోని మలినాలను చెడు జ్నాపకాలను తొలగించుకుంటుంది. అందుకే ఖాళీగా ఉండటం శరీరాన్ని మనసును అత్యంత శక్తివంతమైనదిగా మార్చుతుంది.. మనలో ఉన్న నూతనత్వాన్ని, ఆలోచనను పెంచేలా ప్రోత్సహిస్తుంది. మనలో ఉన్న సత్తాను ప్రతిబింబిస్తుంది. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఒంటరితనంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. మరింత సానుకూల దృక్పథం దిశగా మిమ్మల్ని మీరు మలుచుకునేందుకు ఒంటరితనం ఎలా పనిచేస్తుందనే దానిపై పరిశోధన చేస్తున్నారు.

మెదడును స్విచ్చాఫ్ చేసుకోవడం అంటే.. మెదడుకు మేత పెట్టేలా చేయడం లాంటిది.

దేనికోసమైనా చూస్తుంటే, అది దొరకకపోతే, కలిగే నిరాశనే బోర్డమ్ అని పిలుస్తారు. ఖాళీగా ఉండే సమయంలో కలిగే మంచి విషయమేమిటంటే.. ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఖాళీగా ఉండేలా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఖాళీగా ఎలా ఉండాలో వారిని నేర్చుకోనివ్వాలి. ఖాళీగా ఉండేలా ప్రోత్సహించాలి. దీంతో సృజనాత్మక ప్రపంచాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది.

ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం పిల్లలకు ఎంతో మంచి చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో పిల్లలు నేర్చుకున్నప్పుడు, వారిలో మృదుత్వం, ప్రణాళికలు రచించుకునే నైపుణ్యాలు, సమస్యలు పరిష్కరించుకోవడం పెరుగుతాయి. మనిషికి నిద్ర ఎంత అవసరమో అదే మాదిరిగా ఖాళీగా ఉండటం కూడా అత్యంత అవసరం. మన మనస్సు ఉల్లాసానికి, ఉత్సాహానికి ఇదెంతో కీలకం.

ఖాళీగా కూర్చోవడం కేవలం వెకేషన్ మాత్రమే కాదు.శరీరానికి విటమిన్ డీ ఎంత ముఖ్యమో, బ్రెయిన్ కు నిశ్శబ్దం కూడా అంత అవసరం. దీన్ని పొందేందుకు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయకుండా ఉంటే సరిపోతుంది. కళ్లు మూసుకుంటే మెదడు స్విచ్ఛాఫ్ అవుతుంది. దీనినే అమెరికాలో డౌన్ టైమ్ అంటారు. డౌన్‌టైమ్ వల్ల మన మెదడు మరింత శ్రద్ధను, ప్రోత్సాహాన్ని, ఉత్పాదకతను, సృజనాత్మకతను పొందుతుంది.

మన పనితీరులో సరికొత్త ఎత్తులను చేరుకునేందుకు ఇది అత్యంత ముఖ్యంగా నిలుస్తుంది. ప్రతి రోజూ జీవితంలో స్థిరమైన స్మృతులను ఇది అందిస్తుంది.
పనిభారంతో తలమునకలవుతున్న మెదళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇచ్చేందుకు వాటికి కాస్త బ్రేక్ ఇవ్వడం అవసరం.

సోషల్ మీడియా, ఇతర ఒత్తిడికి కారకమయ్యే వాటి నుంచి కాస్త దూరం జరగడం ఎంతో మంచిది. కుప్పలు తెప్పల సమాచారంతో నిండిపోయిన మెదళ్లతో మనం ఈ ప్రపంచంలో నివసిస్తున్నాం. కనీసం వీటి గురించి ఆలోచించకుండా ఉండాలి. వీటి నుంచి మనం ఖాళీ అయితే, జీవితంలో మనకు కావాల్సిన అంశాలపై ఫోకస్ చేసేలా మెదడు సహకరిస్తుంది.

Must Read

spot_img