HomePoliticsఎన్నికలు రాకముందే ఆ నియోజకవర్గ అధికార పార్టీలో ముసలం ప్రారంభమైందా…

ఎన్నికలు రాకముందే ఆ నియోజకవర్గ అధికార పార్టీలో ముసలం ప్రారంభమైందా…

ఇన్ని రోజులు తెర వెనుక ఉండి కథ నడిపించిన ఓ సీనియర్ నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో సిట్టింగ్ కు ఆందోళన తప్పడం లేదా.. భవిష్యత్ లో ఆ నేత ఆశీస్సులు ఎవరిపై ఉంటాయోనన్న ఉత్కంఠలో నేతలున్నారా.. ఇంతకీ ఎవరా నేత.. ఏదా నియోజకవర్గం..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అందరి దృష్టి ఇప్పుడు అలంపూర్ నియోజకవర్గంపై పడింది. నియోజకవర్గంలో గెలుపోటములను శాసించే మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో అలంపూర్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్‌‌ఎస్‌ పార్టీలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొన్ని చోట్ల ఆ హామీ అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలంపూర్‌‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి ఆ పార్టీలో చేరడంతో సమీకరణాలు మారనున్నాయి. నియోజకవర్గంలో చల్లా బలమైన లీడర్‌‌ కావడంతో బీఆర్ఎస్‌ హైకమాండ్ వ్యూహాత్మకంగానే గులాబీ కండువా కప్పింది. అయితే ఆయన అలంపూర్ టికెట్ తానుచెప్పిన వారికి ఇవ్వడంతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ సీటు గానీ, కొల్లాపూర్ ఎమ్మెల్యే సీటు గానీ తనకు ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది…

ఇదిలా ఉంటే, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హైదరాబాదులోనే ఉన్నా.. ఆయనకు సమాచారం ఇవ్వకుండా చల్లాను సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేర్పించడం చర్చనీయాంశంగా మారింది.దీంతో సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించినా, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఅర్ఎస్ టికెట్లపై రసవత్తర చర్చ సాగుతోంది. ఈ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు లభిస్తాయా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీఎం ఇచ్చిన మాట తప్పరని, ఆలంపూర్ టిక్కెట్ తిరిగి డాక్టర్ అబ్రహంకే లభిస్తుందని ఆయన వర్గీయులు భరోసాలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా అబ్రహమే ఉంటారని ఆయన వర్గీయులు విశ్వసిస్తున్నారు.

వైద్యునిగా చేసిన సేవలతో పాటు ఎమ్మెల్యే గా ఆయన చేసిన సేవలు ప్రజలలో మంచి గుర్తింపును తెచ్చాయని వీరంతా అంటున్నారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రాంరెడ్డి లాంటి ఉద్దండులు పార్టీలో చేరినప్పటికీ పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

చల్లా వెంకటరామిరెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరడంపై అటు అధికార పార్టీలో, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది.

గతంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు చల్ల వెంకట్రామిరెడ్డి మద్దతు ఉందని ప్రచారం సైతం సాగింది. ఆయన అండదండలతోనే 2014 ఎన్నికల్లో సంపత్ కుమార్ ఆలంపూర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన గెలుపులో చల్లా వెంకటరమణ రెడ్డి మార్కు ఉందని ఆయన మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారని అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. కానీ ప్రస్తుతం చల్లా వెంకటరామిరెడ్డి నేరుగా బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై ఆలంపూర్ నియోజకవర్గంలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇటు తాజా ఎమ్మెల్యే అబ్రహంతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు కూడా ఉత్కంఠలో ఉన్నారట.

భవిష్యత్ లో చల్లా ఆశీస్సులు ఎవరిపై ఉంటాయన్నదే వారి ఆందోళనకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు చల్లా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించే హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు కొల్లాపూర్ సీటు గానీ, ఇతర కార్పొరేట్ స్థాయి హోదా గానీ ఇస్తారన్న ప్రచారం సర్వత్రా వెల్లువెత్తుతోంది. కానీ ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెబుతున్నారు. ఏది ఏమైనా చల్లా రాకతో ఆలంపూర్ నియోజకవర్గంలో రాజకీయం గా అనూహ్యమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

చల్లా వెంకట్రాంరెడ్డి అలంపూర్‌‌ నియోజవర్గంలో బలమైన నేత.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన భంగపడ్డ ఆయన ఇండిపెండెంట్‌గానే బరిలో నిలిచి గెలుపొందారు. 2009లో సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడ్ అయ్యాక కాంగ్రెస్ భీ పామ్‌ ముందు సంపత్ కుమార్‌‌కు కన్ఫాం అయ్యింది. కానీ, చల్లా దాన్ని క్యాన్సల్ చేయించి డాక్టర్ అబ్రహంకు టికెట్ ఇప్పించి గెలిపించారు.

2014 ఎన్నికల్లో సంపత్ కుమార్‌‌ చల్లా మద్దతుతోనే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సంపత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం గెలిచారు. అప్పటి నుంచి చల్లా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. క్యాడర్ కు మాత్రం అందుబాటులోనే ఉండేవారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయనకు కార్యకర్తలు ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత చల్ల వెంకట్రామిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నా..

పార్టీ మారుతారని చాలా సందర్భాల్లో ప్రచారం జరిగింది. కానీ, ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. ఒక సందర్భంలో అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరిగినా.. ఆయన చేరలేదు. కానీ, సడన్‌గా రెండు రోజుల కింద బీఆర్‌‌ఎస్‌లో చేరడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీక్రెట్‌గా క్యాడర్‌‌తో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చల్లా వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి కొలుకోలేని దెబ్బేనని నాయకులు అంటున్నారు.

ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారనుంది. చల్లా వెంకట్రాం రెడ్డి బీజేపీ చేరి వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్ అయిన మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్‌‌ఎస్‌లో చేరాలని చల్లాతో మూడు నెలలుగా చర్చలు జరుపుతున్నారు. ఆయన పెట్టిన కండీషన్లపై సీఎం కేసీఆర్‌‌తో చర్చించి హామీ ఇచ్చాకే పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. ఇలా తన రూటును క్లియర్ చేసుకోవడంతో పాటు నడిగడ్డలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

మరి సిట్టింగ్ ల పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు సెగ్మెంట్లలో హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img