Homeఅంతర్జాతీయంమోడీపై బీబీసీ డాక్యుమెంటరీ చర్చనీయాంశమవుతోంది..

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ చర్చనీయాంశమవుతోంది..

బీబీసీ డాక్యుమెంటరీపై రష్యా మోడీకి మద్ధతు ప్రకటించింది. భారత్ నిషేధం .. సహేతుకమేనని వ్యాఖ్యానించింది. అయితే దీనిపై కేంద్రంతో పాటు
సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యం దాఖలు కావడం .. చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో ఈ అంశం .. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ దీనిపై రష్యా ఎందుకు మద్ధతు పలికిందన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ.. భారత ప్రధాని మోడీపై తీసిన డాక్యుమెంటరీపై ప్రపంచమంతటా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా
పలు దేశాలు బీబీసీ తీరును గర్హిస్తుంటే, ప్రవాస భారతీయులు సైతం ఆందోళనలకు దిగుతున్నారు.. మరోవైపు దీన్ని నిషేధించడంపైనా దేశవ్యాప్తంగా చర్చలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా పూర్తి మద్దతును ప్రకటించింది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ .. ఆయనపై చిత్రీకరించిన
డాక్యుమెంట్ పై భారత్ లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అండగా నిలిచింది. బీబీసీపై ఘాటు విమర్శలు సంధించింది. భారత్ పై పరోక్షంగా సమాచార యుద్ధానికి పాల్పడినట్లు ఆరోపించింది. బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడాన్ని రష్యా సమర్థించింది.

ఇండియా- ది మోదీ క్వశ్చన్ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీని దేశంలో ఎక్కడ కూడా ప్రదర్శించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
దీని తరువాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల దీన్ని ప్రదర్శించారు.

ఈ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. నిషేధం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్లు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఎంఎల్‌ శర్మ ఈ పిటీషన్ వేశారు.

ఆయనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పరిణామాల మధ్య రష్యా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భారత్ కు వ్యతిరేకంగా బీబీసీ వివిధ రంగాలలో సమాచార యుద్ధం చేస్తోందని ఆరోపించింది. భారత్ లో వివిధ రంగాల్లో బీబీసీ సమాచార యుద్ధానికి పాల్పడుతోందనడానికి బీబీసీ డాక్యుమెంటరీ ఓ సాక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భారత్, ఆ దేశంతో మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న రష్యాపై మాత్రమే కాకుండా, ఇతర ప్రపంచ దేశాల విధానాలనూ బీబీసీ ప్రశ్నించినట్టయిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2002 నాటికి గుజరాత్ అల్లర్లలో అప్పటి సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇప్పటికే బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు పలు యూనివర్శిటీల్లో దీన్ని ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా పట్టించుకోకుండా దీని ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

వీటిని విచారణకు స్వీకరించి, వచ్చే వారం విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో వచ్చేవారం బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం వివాదంలో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు గతంలో క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ల విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం తమ అత్యవసర అధికారాలు ఉపయోగించి నిషేధించడాన్ని పలువురు ఇప్పటికే తప్పుబడుతున్నారు. నరేంద్ర మోడీ పై ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. బీబీసీ తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా UKలోని వందలాది మంది ప్రవాస భారతీయులు తమ గళం విప్పారు. సెంట్రల్ లండన్‌లోని BBC
ఆఫీస్ బయట ప్రదర్శన నిర్వహించారు.

  • మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ..పై ప్రపంచదేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ప్రవాస భారతీయులు మాత్రం మండిపడుతున్నారు..

BBC లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, గ్లాస్గోలోని స్టూడియోల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు భారతీయులు. ఈ నిరసన కార్యక్రమంలో న్యూకాజిల్ గయా .. డియన్ డయాస్పోరా UK, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ UK, ఇన్‌సైట్ UK, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్ వంటి సంస్థలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహించాయి.

బీబీసీని బహిష్కరించు, బ్రిటీష్ బయాస్ కార్పొరేషన్, హిందూ ఫోబిక్ కథనాన్ని ఆపండి, షేమ్ బీబీసీ, భారత మాతకు జై వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ పై రూపొందించిన డాక్యుమెంటరీ అత్యంత పక్షపాతంతో కూడుకున్నదని ఎఫ్‌ఐఎస్ఐ యుకెకు చెందిన జయూ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

వివాదాస్పదమైన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను మనదేశంలో కేంద్రం నిషేధించింది. అయినప్పటికీ కొన్నిచోట్ల బహిరంగంగా దీనిని ప్రదర్శిస్తూ వుండటం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇదిలావుండగా మోడీ డాక్యుమెంటరీ సెగ విదేశాలను తాకుతోంది. దీనికి వ్యతిరేకంగా పలువురు ప్రవాస భారతీయులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికాలోనూ ఎన్ఆర్ఐలు భగ్గుమన్నారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఫ్రీమాంట్‌లో ఇండియన్ కమ్యూనిటీ బీబీసీ డాక్యుమెంటరీపై ఆందోళన నిర్వహించింది. ఫ్లకార్డులు పట్టుకుని బీబీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పక్షపాతంతో, జాత్యహంకారంతో రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. బీబీసీ డాక్యుమెంటరీ నకిలీ ప్రచారాన్ని నిర్వహిస్తోందని, బీబీసీ ఒక ఫేక్ న్యూస్ అని ప్రవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ “India: The Modi Question” పేరుతో డాక్యుమెంటరీని రూపొందించి దానిని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. అయితే జనవరి 19న ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం ఖండించింది. యూకే అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ వలసవాద మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక ఉద్దేశం, దాని వెనుక వున్న అజెండా ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే మోడీ డాక్యుమెంటరీపై యూకేలోని భారతీయ కమ్యూనిటీ సైతం భగ్గుమంది. గడిచిన కొన్ని రోజులుగా లండన్‌లోని ప్రవాస భారతీయులు బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీకి తక్షణం బీబీసీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ పై వివాదం కొనసాగుతోంది. ఆ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది.

అయితే ఈ నిషేధాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఇది మీడియా స్వేచ్చకు సంబంధించిన అంశం అని US స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాలకు అమెరికా మద్దతు ఇస్తుందని అన్నారు. యునైటెడ్ స్టేట్స్, భారతదేశం.. ఈ రెండు అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు. కాగా “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీని BBC గత వారం విడుదల చేసింది. ఇందులో గుజరాత్ అల్లర్ల‌లో అప్పటి ముఖ్యమంత్రి నరేందర్ మోడీ పాత్ర గురించి పేర్కొంది. ఈ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది.

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ .. సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ప్రపంచదేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ప్రవాస భారతీయులు మాత్రం మండిపడుతున్నారు.


Must Read

spot_img