Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది..!

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది..!

భారత్ పొరుగుదేశం బంగ్లాదేశ్ పరిస్థితి మరింతగా దిగజారుతోంది.. గతరెండు దశాబ్ధాలుగా వేగంగా పురుగమిస్తోన్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి.. ముఖ్యంగా 2017 తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది..

బంగ్లాదేశ్ పై ఉక్రెయిన్, రష్యా యుద్దం తీవ్ర ప్రభావం చూపిందా..? కరెంట్ ఖాతా లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి..? ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మనుగడ ఎలా సాగిస్తుంది..?

క‌రోనా మ‌హ‌మ్మారితో పాటు రాజ‌కీయ అనిశ్చితి, పాల‌కుల‌ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో భార‌త్ ఇరుగు పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఇప్ప‌టికే శ్రీ‌లంక పూర్తి ఆర్థికంగా దివాళా తీసింది. ఇక భార‌త్ దాయాది దేశం పాకిస్థాన్ దివాళా అంచుల‌కు చేరుకున్న‌ది. ఆ బాట‌లో మ‌రో దేశం.. బంగ్లాదేశ్ ప‌య‌నిస్తున్న‌ది. దిగుమ‌తుల‌కు చెల్లింపుల కోసం విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు నిండుకుంటున్నాయి.

వ‌చ్చే మూడేండ్ల‌లో 450 కోట్ల డాల‌ర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంత‌ర్జాతీయ‌ ద్ర‌వ్య‌నిధి సంస్థ త‌లుపు త‌ట్టింది. ప్ర‌పంచంలోనే వేగంగా అభివృద్ధి ప‌థంలో ప్ర‌యాణిస్తున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో బంగ్లాదేశ్ ఒక‌టి. 416 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీతో అంత‌ర్జాతీయంగా 33వ స్థానంలో కొన‌సాగుతున్న‌ది. కానీ, బెయిలవుట్ ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్ వద్దకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది..

బంగ్లాదేశ్‌ లో పరిస్థితి మరింత దిగజారుతోంది. గత రెండు దశాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ముఖ్యంగా 2017 తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతిందో తెలిసిపోతుంది. బంగ్లాదేశ్ ఈ పరిస్థితి జీర్ణించుకోలేనిది. ఎందుకంటే 2020లో ఈ దేశం తలసరి ఆదాయంలో భారతదేశం కంటే వెనుకబడిపోయింది. ఇప్పుడు సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి నెలకొంది. ఐఎంఎఫ్ కూడా 4.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది.

మరోవైపు దేశంలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నిరంతరం నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ విషయంపై పార్టీ అవామీ లీగ్ ప్రభుత్వం, దాని అధినేత్రి ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నిరంతరం దాడి చేస్తోంది.


బంగ్లాదేశ్ జీడీపీ 2020లో 3.4%గా ఉంది. ఇది 2021లో 6.9కి పెరిగింది. 2022లో కూడా 7.2%గా అంచనా వేయబడింది. ఐఎంఎఫ్‌ ప్రకారం.. మహమ్మారి తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్ చేయడంలో ఉక్రెయిన్ యుద్ధం అతిపెద్ద అడ్డంకిగా మారింది. దీంతో కరెంట్ ఖాతా లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు తగ్గింది.

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముడి చమురు ధరను ప్రభావితం చేసింది…!

దీని కారణంగా అన్ని రకాల వస్తువులు ఖరీదైనవిగా మారాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసింది. ఇండియన్
ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. నవంబర్ 2021లో 5.98% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్‌లో 8.85%కి చేరుకుంది. గత 12 నెలల్లో, ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 7.48%. ఇది గత సంవత్సరం 5.48% మాత్రమే. దీంతో పాటు బంగ్లాదేశ్ కరెంట్ ఖాతా కూడా లోటులోకి వెళ్లింది.

ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ ఖాతా బ్యాలెన్స్ లోటులోకి వెళుతుంది. బంగ్లాదేశ్ ఇప్పటి వరకు దాని ఎగుమతి ఆదాయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ కరెన్సీ కూడా డాలర్‌ తో పోలిస్తే నిరంతరం పడిపోతోంది. డిసెంబర్ 2021లో బంగ్లాదేశ్ కరెన్సీ విలువ ఒక యూఎస్‌ డాలర్‌ తో పోలిస్తే 86 ఉండగా, ప్రస్తుతం అది 105కి పెరిగింది. ఇది కాకుండా విదేశీ మారక నిల్వలు కూడా క్షీణించాయి. గత సంవత్సరం $ 46,154 మిలియన్లు ఉన్న కరెన్సీ నిల్వలు ఇప్పుడు $ 33,790 మిలియన్లకు తగ్గాయి.

బంగ్లాదేశ్ ఐఎంఎఫ్‌ నుండి అభ్యర్థించిన ఆర్థిక సహాయం ఆర్థిక ప్రమాదాన్ని నివారించడానికి ఒక చర్యగా మారుతుంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం..ఈ సహాయంతో బంగ్లాదేశ్ తక్షణ సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా 2031 నాటికి బంగ్లాదేశ్ కూడా అభివృద్ధి చెందిన దేశాలలో చేరాలంటే, అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడి కోసం ప్రజలను ఆకర్షించి, ఉత్పాదకతను పెంచాలి. ఇది కాకుండా బంగ్లాదేశ్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆదాయ సేకరణను పెంచుకోవాలి. తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇది కాకుండా, పెరిగిన మారకపు రేటును నియంత్రించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఆర్థిక
రంగాన్ని బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులను విస్తరించడం.

బంగ్లాదేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ్య‌వ‌సాయం, స‌ర్వీస్ సెక్టార్‌లు జీవ నాడి వంటివి. కానీ, క‌రోనా మ‌హ‌మ్మారి వేళ స‌ర్వీస్ రంగం దెబ్బ‌తిన‌డంతో 11 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 56 శాతం జీడీపీ ప‌డిపోయింది. ఇక బంగ్లాదేశ్ ఎగుమ‌తుల్లో రెడీమేడ్ దుస్తులు 84 శాతం వాటా క‌లిగి ఉంటాయి. క‌రోనా టైంలో ఆర్డ‌ర్లు రాక‌పోవ‌డంతో గిరాకీ ప‌డిపోయింది. ఆర్డ‌ర్లు త‌గ్గిపోగా.. వ‌చ్చిన ఆర్డ‌ర్లు ఒక్కోసారి ర‌ద్దు కావ‌డం, చెల్లింపుల్లో జాప్యం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి.. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం వ‌ల్ల గ‌ణ‌నీయంగా ముడి చ‌మురు రేట్లు పెర‌గ‌డం బంగ్లాదేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు శాపంగా ప‌రిణ‌మించింది.

దీంతో వాణిజ్య లోటు 33 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగిపోగా, విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు 40 బిలియ‌న్ల డాల‌ర్ల కంటే త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ వ‌ద్ద ఉన్న విదేశీ మార‌క ద్ర‌వ్యం రిజ‌ర్వులు కొన్ని నెల‌లపాటు విదేశీ చెల్లింపుల‌కే స‌రిపోతాయి.. దీనికితోడు ఇటీవ‌ల అమెరికా ఫెడ్ రిజ‌ర్వు కీల‌క వ‌డ్డీరేట్లు పెంచ‌డంతో బంగ్లాదేశ్ క‌రెన్సీ ట‌కా కూడా ప‌త‌న‌మైంది. గ‌త మే నెల‌లో 86 టకాలు ప‌లికిన డాల‌ర్.. తాజాగా 94 టకాలకు చేరుకున్న‌ది.

ఈ ప‌రిస్థితుల్లో ఎగుమ‌తులు పుంజుకుని, విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు పెరిగితేనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ నిల‌దొక్కుకోగ‌ల‌ద‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు..

బంగ్లాదేశ్ స‌ర్కార్‌ తీసుకున్న నిర్ణయం..!

అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో దేశీయ మార్కెట్‌లో ఈ నెల ఐదో తేదీన పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌, ఆక్టేన్ ధ‌ర‌లు భారీగా పెంచింది బంగ్లాదేశ్ స‌ర్కార్‌. డీజిల్‌-కిరోసిన్‌ల‌పై 42.5 శాతం, పెట్రోల్‌పై 51.1 శాతం, అక్టేన్‌పై 51.7 శాతం ధ‌ర పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.130 ట‌కాలు, డీజిల్‌-కిరోసిన్ ధ‌ర రూ.114 ట‌కాలు, అక్టేన్ రూ.135ల‌కు పెర‌గ‌డంతో దేశ ప్ర‌జ‌లంతా ఆందోళ‌న చేస్తున్నారు.

మ‌రోవైపు, విదేశాల్లో నివ‌సించే బంగ్లాదేశీయులు.. స్వ‌దేశానికి పంపుతున్న నిధులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. విదేశాల్లోని బంగ్లాదేశీయుల నుంచి స్వ‌దేశానికి
2020-21లో 24.77 బిలియ‌న్ డాల‌ర్ల నిధులు వ‌స్తే, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో 21.03 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ప‌డిపోయాయి.

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచ బ్యాంకు త‌దిత‌ర ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకుల వ‌ద్ద రుణాల కోసం బంగ్లాదేశ్ స‌ర్కార్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. ఐఎంఎఫ్ వ‌ద్ద 450 కోట్ల డాల‌ర్ల‌తోపాటు ప్ర‌పంచ బ్యాంక్ వ‌ద్ద 100 కోట్ల డాల‌ర్ల రుణాల‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. జ‌పాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ కోఆప‌రేష‌న్ ఏజెన్సీ వ‌ద్ద కూడా రుణం కోసం య‌త్నిస్తున్న‌ది. క‌రోనా వ్యాక్సినేష‌న్ కోసం ప్ర‌పంచ బ్యాంకు వ‌ద్ద 140 కోట్ల డాల‌ర్ల రుణం తీసుకున్న‌ది.

ఇవి కాక దాదాపు 407 కోట్ల డాల‌ర్ల రుణాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. దీనికి తోడు దేశీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ కూడా ఇబ్బందుల్లో
ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా బ్యాంకుల‌కు 1,111 కోట్ల డాల‌ర్ల రుణాలు ఎగ‌వేసిన‌ట్లు ప్ర‌భుత్వ‌మే చెబుతున్న‌ది. కానీ, ఇది రెట్టింపు ఉండొచ్చున‌ని ఐఎంఎఫ్ అనుమానిస్తున్న‌ది.

బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచ బ్యాంకు త‌దిత‌ర ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకుల వ‌ద్ద రుణాల కోసం బంగ్లాదేశ్ స‌ర్కార్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది..

Must Read

spot_img