Homeజాతీయంబంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం..!

బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం..!

ప్రస్తుతం చాలా దేశాలలో ఆర్థిక సంక్షోభాల సమయం నడుస్తోంది. ముందు శ్రీలంక, ఆపై పాకిస్తాన్ ఆ వెంటే బంగ్లాదేశ్..నిజానికి బంగ్లాదేశ్ పరిస్థితి గతంలో బాగానే ఉండేది. ఏం జరిగిందో ఏమో కానీ అంతా యూటర్న్ తీసుకున్నట్టుగా అయిపోయింది. ఆర్థిక వ్యవస్థలో భారత్ పై అగ్రగామిగా నిలిచిన పొరుగుదేశం బంగ్లాదేశ్ పరిస్థిి ఇప్పుడు ఇంతగా ఎందుకు దిగజారింది..అదేంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిన తర్వాత ఇప్పుడు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పరిస్థితి కూడా మరింత దిగజారుతోంది. గత రెండు దశాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ముఖ్యంగా 2017 తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతిందో తెలిసిపోతుంది.

బంగ్లాదేశ్ ఈ పరిస్థితి జీర్ణించుకోలేనిది. ఎందుకంటే 2020లో ఈ దేశం తలసరి ఆదాయంలో భారతదేశం కంటే వెనుకబడిపోయింది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి నెలకొంది. ఐఎంఎఫ్ కూడా 4.5 బిలియన్ డాలర్లు..అంటే..మన కరెన్సీలో అయితే 37 వేల కోట్ల రూ.ల ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఇది ఏ మూలకూ సరిపోదు.

మరోవైపు దేశంలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నిరంతరం నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ విషయంపై పార్టీ అవామీ లీగ్ ప్రభుత్వం, దాని అధినేత్రి ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నిరంతరం దాడి చేస్తోంది. ఆమె రాజీనామా కోరుతూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. విశేషమేమిటంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వల్ల ఈసారి స్థూల దేశీయోత్పత్తి లేదు.

అంటే జీడీపీ అన్నది లెక్కలోకి రాదన్నమాట. జీడీపీ పరంగా బంగ్లాదేశ్ నిలకడగా మంచి పనితీరును కనబరుస్తోంది. గణాంకాల ప్రకారం.., బంగ్లాదేశ్ జీడీపీ 2020లో 3.4%గా ఉంది. ఇది 2021లో 6.9కి పెరిగింది. 2022లో కూడా 7.2%గా అంచనా వేయబడింది.

ఎంఎఫ్‌ ప్రకారం.. మహమ్మారి తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్ చేయడంలో ఉక్రెయిన్ యుద్ధం అతిపెద్ద అడ్డంకిగా మారింది. దీంతో కరెంట్ ఖాతా లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు తగ్గింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముడి చమురు ధరను ప్రభావితం చేసింది. దీని కారణంగా అన్ని రకాల వస్తువులు ఖరీదైనవిగా మారాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసింది.

నవంబర్ 2021లో 5.98% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్‌లో 8.85%కి చేరుకుంది. గత 12 నెలల్లో, ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 7.48%. ఇది గత సంవత్సరం 5.48% మాత్రమే. దీంతో పాటు బంగ్లాదేశ్ కరెంట్ ఖాతా కూడా లోటులోకి వెళ్లింది. నిజానికి ఇది ఎవరూ ఊహించనిదిగా నిపుణులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్ కరెన్సీ కూడా డాలర్‌తో పోలిస్తే నిరంతరం పడిపోతోంది..!

ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ ఖాతా బ్యాలెన్స్ లోటులోకి వెళుతుంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు దాని ఎగుమతి ఆదాయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ కరెన్సీ కూడా డాలర్‌తో పోలిస్తే నిరంతరం పడిపోతోంది. డిసెంబర్ 2021లో బంగ్లాదేశ్ కరెన్సీ విలువ ఒక యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే 86 ఉండగా, ప్రస్తుతం అది 105కి పెరిగింది. ఇది కాకుండా విదేశీ మారక నిల్వలు కూడా క్షీణించాయి.

గత సంవత్సరం $ 46,154 మిలియన్లు ఉన్న కరెన్సీ నిల్వలు ఇప్పుడు $ 33,790 మిలియన్లకు తగ్గాయి. బంగ్లాదేశ్ ఐఎంఎఫ్‌ నుండి అభ్యర్థించిన ఆర్థిక సహాయం ఆర్థిక ప్రమాదాన్ని నివారించడానికి ఒక చర్యగా మారుతుంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి ‘ఐఎంఎఫ్‌’ వివరాల ప్రకారం..ఈ సహాయంతో బంగ్లాదేశ్ తక్షణ సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 2031 నాటికి బంగ్లాదేశ్ కూడా అభివృద్ధి చెందిన దేశాలలో చేరాలంటే, అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడి కోసం ప్రజలను ఆకర్షించి, ఉత్పాదకతను పెంచాలి. ఇది కాకుండా బంగ్లాదేశ్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆదాయ సేకరణను పెంచుకోవాలి.

తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇది కాకుండా, పెరిగిన మారకపు రేటును నియంత్రించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం మరియు విదేశీ పెట్టుబడులను విస్తరించడం చేయాల్సి ఉంటుంది.

Must Read

spot_img