‘వాల్తేరు వీరయ్య’..’వీరసింహారెడ్డి’ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ కి సిద్దమైన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవి-బాలయ్య మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది సహజమే. ఇలా స్టార్ హీరోల మధ్య ఇలాంటి వార్ కొత్తేం కాదు. అందులోనూ చిరు-బాలయ్య ఇలా పోటీ పడి అలసిసొలసిన వాళ్లు కూడా. దీన్ని పోటీగానూ భావించడం లేదు. ఒకవేళ అలా భావించినా అంతకు మించిన వార్ ఇప్పుడు థమన్-డీఎస్పీల మధ్య కనిపిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది.
అలవైకుంఠపురంతో థమన్ లైన్లోకి రావడంతో దేవి శ్రీ ప్రసాద్ అవకాశాలు అన్నింటిని థమన్ తన్నుకుపోతున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. డీఎస్పీ కంటే థమన్ బెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్పీకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు వినిపిస్తుంది. వీరయ్య సినిమా..బాలయ్య సినిమా ఆ పోటీకి మరింత ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్యకి డీఎస్పీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే
వీరసింహారెడ్డి కి థమన్ బాణీలు సమకూర్చు తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల పాటలు లిరికల్ సింగిల్స్ ని నిర్మాణ సంస్థ పోటీపోటాగా రిలీజ్ చేస్తుంది.
ఇప్పటికే రెండు సినిమాల నుంచి రెండేసి పాటలు చొప్పున మొత్తం నాలుగు పాటలు రిలీజ్ చేసారు. అన్నింటికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ రెండు చిత్రాల నుంచి మరిన్ని పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. వాటిలో ఆ ఇద్దరు సంగీత దర్శకులు ఎలాంటి ఔట్ ఫుట్ ఇచ్చారన్నది చూడాలి. చివరిగా రెండు సినిమాల సంగీతాల్నిపరిశీలించి ఎవరు ఎక్కువ సాంగ్స్ కి బెస్ట్ ఇచ్చారన్నది చెక్ చేస్తే.. సంగతేంటి? అన్నది తేలిపోతుంది.
ఈ రిపోర్ట్ కూడా తదుపరి కీలకంగా మారే అవకాశం ఉంది. థమన్ కన్నా…డీఎస్పీ కాస్త వెనుకబడి ఉన్నాడు. స్టార్ హీరోలంతా థమన్ ని కోరుకుంటున్నారు. ఇప్పటికే డీఎస్పీ ఆ హీరోలందరికీ పనిచేయడంతోనూ థమన్ రూపంలో ఇలా
కొత్త దనం ఆశిస్తున్నారు. దీన్నీ మాత్రం పోటీగా భావించాల్సిన పనిలేదు. వీరయ్య..బాలయ్య చిత్రాల్ని నిర్మిస్తుంది ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విధమైన స్ర్టాటజీతో సినిమాల్ని పబ్లిసిటీ చేస్తోంది.
