నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ అయింది. ఇరు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోను ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ వసూళ్లను సాధించదని వార్తలు విపిస్తోంది.
వీరసింహారెడ్డి మాస్ యాక్షన్ ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగించింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్లకు డోఖా లేదని టాక్ వినిపించింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూసిన సినిమా ఇది. ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే షోతో బాలకృష్ణ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ మారాయి.
వీరసింహారెడ్డి అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ వసూళ్ల దిశగా సాగుతోందని తాజాగా ట్రేడ్ వెల్లడించింది. 1 మిలియన్ డాలర్ల గ్రాస్ అమెరికా నుంచి వసూలైందని చిత్రబృందం ప్రకటించింది. బాలయ్య బాబు కెరీర్ మొత్తంలోనే బెస్ట్ ఓపెనింగులు తేనుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆ మేరకు రిటర్నులు తేవాల్సి ఉంటుంది.
శనివారం, ఆదివారం పండగ సెలవులు కలిసి రానున్నాయి. అయితే శుక్రవారం థియేటర్లలోకి వాల్తేరు వీరయ్య లాంటి భారీ సినిమా విడుదలైంది. ఒక రోజు గ్యాప్ తోనే రెండు పెద్ద సినిమాలు వసూళ్లను షేర్ చేసుకుంటాయి. అయితే ఈ పండగ సెలవులు ఈ సినిమాలకు ఏమేరకు కలిసి రానున్నాయి? అన్నది వేచి చూడాలి. సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. వాస్తవిక టాక్ తో సినిమాలు లాంగ్ రన్ లో రాణించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. బయ్యర్లు పంపిణీవర్గాలు సేవ్ అవ్వాలంటే భారీ గా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.