HomeEntertainmentనోరు జారటం…సారీ చెప్పడం బాలకృష్ణకు అలవాటే…

నోరు జారటం…సారీ చెప్పడం బాలకృష్ణకు అలవాటే…

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నోరు జారటం….తర్వాత సారీ చెప్పటం కొత్తమీ కాదు. ఇటీవల వీరసింహారెడ్డి సక్సస్ మీట్‌లో “అక్కినేని తొక్కినేని” అంటూ నోరుజారి విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. ఇదీ జరిగి పట్టుమని పదిరోజులు కాకముందే బాలయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ షోలో హుషారుగా మాట్లాడుతూ… ఓసారి బాలయ్య బైక్‌పై వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందని… ఓ హాస్పిటల్‌లో చికిత్ప జరుగుతున్న సందర్బంలో జరిగిన ఘటన గురించి వివరిస్తూ, “దానమ్మ… ఆ నర్సు చాలా అందంగా ఉంది…” అంటూ బాలకృష్ణ నోరు జారారు.

బాలయ్య నర్సులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలయ్యకు చికిత్స చేసి ప్రాణం కాపాడిన నర్సు అందాల గురించి బాలయ్య చేసిన కామెంట్స్ తో రాజకీయ వివాదం మొదలైంది. బాలకృష్ణ వంటి పెద్దమనిషి నోటి నుంచి రావాల్సిన మాటలు కావని, నిరంతరం రోగులకి సేవలు అందించే నర్సులపట్ల ఆయన ఇంత చులకనగా మాట్లాడటం సరికాదంటూ…పెద్దఎత్తున నిరసనలు వెళ్లువెత్తాయి. బాలకృష్ణ తక్షణం తన వ్యాఖ్యలని ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నర్సులు డిమాండ్‌ చేశారు. దీంతో బాలయ్య తన మాటలను వెనక్కు తీపుకుని నర్సులకు సారీ చెప్పారు.

బాలయ్య తన ట్వీట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు తెలిపారు. తన ఖాతాలో “అందరికీ నమస్కారం. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది నర్సులు రాత్రనక, పగలనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’’ అని సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలియజేసారు.

Must Read

spot_img