Homeసినిమాగాసిప్స్ఇంగ్లీష్‌ టైటిల్‌తో బాలకృష్ణ సినిమా?

ఇంగ్లీష్‌ టైటిల్‌తో బాలకృష్ణ సినిమా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన జోరును కొనసాగిస్తూ నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు.

అఖండ సక్సెస్‌తో నందమూరి బాలకృష్ణ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను సెట్స్‌ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన వీర సింహా రెడ్డి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుంది. అవుట్‌ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య, అనిల్‌ రావిపూడితో సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ సినిమాను ఇటివల అధికారికంగా ప్రారంభించారు. డిసెంబర్ 8న ఈ సినిమాను ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది. చెప్పినట్లుగానే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ హాజరయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నవీన్, శిరీష్‌లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు.

ఇక తొలి షాట్‌ను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా, శిరీష్-నవీన్‌లు స్క్రిప్టును దర్శకుడు అనిల్ రావిపూడికి అందించారు. అనిల్-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను ఓ సరికొత్త లుక్‌లో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడని ఇప్పటికే తెలపడంతో, బాలయ్యను ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాకు బ్రో ఐ డోంట్‌ కేర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య 45ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్య కూతురుగా పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. మరి ఈ కాంబో బాక్సాఫీస్‌పై ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Must Read

spot_img