Homeసినిమాగాసిప్స్బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ కు అటుపై బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్

బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ కు అటుపై బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్

సాహో’ రూపంలో సుజిత్ ఇచ్చిన ఫెయిల్యూర్..అటుపై ‘రాధేశ్యామ్’ రాధాకృష్ణ కుమార్ అందించిన పరజాయాలు డార్లింగ్అ భిమానులు ఇప్పట్లో మర్చిపోలేనివి. దీంతో ఆ ఇద్దరు డైరెక్టర్స్ తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కోంటున్నాడు. అయితే ప్రభాస్ తరుపది దర్శకులు మాత్ర అచీ తుచీ అడుగులు వేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

‘సాహో’ వైఫల్యంతో యంగ్ మేకర్ సుజిత్ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఇప్పటివరకూ అతను కొత్త చిత్రాన్నిప్రకటించలేదు? అంటే ఆ వైఫల్యం ఎంతగా ప్రభావం చూపిందన్నది అద్దం పడుతుంది. ఈ విషయాన్ని సుజిత్ ముందుగానే గమనించాడు.

అందుకే సోషల్ మీడియా కు దూరంగా ఉన్నాడు.ప్రభాస్ కి ప్లాప్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ లు పెడితే సన్నివేశం ఎలా ఉంటుందో గెస్ చేసి కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు.

ఆ రకంగా ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నాడు. అన్ని రకాలుగా సైలెంట్ గా ఉంటూ తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటు న్నాడు. కానీ రాధాకృష్ణ – సుజీత్ లో సోషల్ మీడియాకి దూరంగా కాలేదు. అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు. కాకపోతే ప్రత్యుత్తరాలను నిలిపివేసాడు.

అలా లాక్ చేయకపోతే ట్రోలింగ్ బారిన పడే అవకాశం ఉంటుందని ముందుగానే ఊహించి ట్విటర్ ని బ్లాక్ చేసాడు. ఆ రకంగా డార్లింగ్ ఇద్దరు దర్శకులు అభిమానుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని రకాల జిమ్మిక్కులైతే ప్లే చేసారు. తదుపరి ఈ రేసులో ఇంకెంత మంది దర్శకులు నిలుస్తారో చూడాలి.

ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమాపై నెగిటివ్ టాక్ ఉంది. సినిమా హిట్ అయితే పర్వాలేదు. లేదంటే? ఓం రౌత్ కి విమర్శలు తప్పవు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ‘సలార్’ చేస్తున్నాడు. భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతుంది.

కేజీఎఫ్ని మించి గొప్ప హిట్ ఇస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్-కె’ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇంకోవైపు మారుతి సైతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వీళ్లంతా హిట్ అందుకుని నెటి జనులతో నీరాజనాలు అందుకుంటారా? రాధాకృష్ణ…సుజిత్ లా విమర్శకుల జాబితాలా నిలుస్తారా? అన్నది చూడాలి.

Must Read

spot_img