Homeఅంతర్జాతీయంబాబా వంగ ప్రవచనం..ప్రజలనుభయపెడుతోంది..!

బాబా వంగ ప్రవచనం..ప్రజలనుభయపెడుతోంది..!

ప్రపంచంలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలలో బల్గేరియాకు చెందిన బాబా వంగా ఒకరు.. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి 1996లో ఆమె మరణం వరకు కూడా బాబా వంగా భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేశారు. అందుకే ఆమెను నోస్ట్రాడామస్ తో పోల్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను బాబా వంగా భవిష్యవాణి భయపెడుతోంది. ఈ ఏడాది జ్యోతిష్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎందుకంటే బాబావంగా చెప్పిన జ్యోతిష్యాలు ఇప్పటి వరకు 90 శాతం వరకు నిజమయ్యాయి.. ఈ ఏడాది బాబా వంగా ఊహించిన పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

ప్రపంచంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు భవిష్యవాణి చెప్పారు. అలాంటి వారిలో బల్గేరియా ఆధ్యాత్మికవేత్త బాబా వంగా ఒకరు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి 1996లో ఆమె మరణం వరకు కూడా బాబా వంగా భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేశారు. అందుకే ఆమెను నోస్ట్రాడామస్ తో పోల్చారు.

కమ్యూనికేషన్ వ్యవస్థ మీద సౌరతుఫాన్ ప్రభావం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది 1859 నాటి సంఘటన ఒక ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక వేళ సౌరతుఫాను కనుక వస్తే అది సంవత్సరాల పాటు కొనసాగే అతి పెద్ద బ్లాకవుట్లకు కారణం కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బాబా వంగా భవిష్యవాణి భయపెడుతోంది. ఈ ఏడాది జ్యోతిష్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎందుకంటే బాబావంగా చెప్పిన జ్యోతిష్యాలు ఇప్పటి వరకు నిజమైన దాఖలాలు వున్నాయి. ఇందులో ఒకటి అమెరికాకు నల్లజాతీయుడు అధ్యక్షుడు అవుతాడనేది. తాజాగా 2023 ప్రపంచానికి డెడ్ లైన్ అని బాబా వంగా భవిష్యవాణి చెప్తోంది. ఇప్పటికే 90 శాతం బాబా వంగా జ్యోతిష్యం నిజమైంది. అలాగే బాబా వంగా చెప్పిందే నిజం అవుతుందని ఆమె శిష్యులు అంటున్నారు.

బాబా వంగాను దైవదూతగా బల్గేరియా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని బాబా వంగా అంచానా.. ప్రపంచ వ్యాప్తంగా జీవ ఆయుధాల శకం నెలకొంటుందని… ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని ఆమె చెప్పారు. బాబా వంగా చెప్పినట్లే ఆస్ట్రేలియాలో గతే ఏడాది భారీ వరదలు ఏర్పడ్డాయి.

2023లో ఏం జరుగబోతుందో నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. 1996లో మరణించిన బాబా వంగా.. 2023లో ఐదు భయానక అంశాలు జరుగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు. సహజ జననాల ముగింపు వుంటుందని సౌర సునామీ తప్పదని ఆమె చెప్పారు.

బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం ప్రపంచ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి..!

బాబా వంగాను అధికారికంగా వంగేలియా పాండేవా గుష్టెరోవా అని పిలుస్తారు. బల్గేరియాకు చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త. మూలికా శాస్త్రవేత్త కూడా. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియన్ కోజుహ్ హైలాండ్స్‌లోని రూపైట్ ప్రాంతంలో నివసించింది.

బాబా వంగా 2023కు సంబంధించి ఇలాంటి అనేక విషయాలను తన భవిష్యవాణిలో ప్రస్తావించారని చెబుతున్నారు. బాబా వంగా అభిప్రాయం ప్రకారం.. 2023 సంవత్సరంలోని కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని అంచనా వేశారు. భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని చెప్పారు.

మానవ జీవితం, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఆమె అంచనా వేశారు. 5079 నాటికి భవిష్యత్తు వరకూ బాబా వంగా అంచనా వేశారని నమ్మకం. సౌర తుఫానుతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడనున్నాయని చెప్పారు. అధిక రేడియేషన్ స్థాయిలు ఏర్పడనున్నాయి.

ప్రస్తుతం సూర్యుని చుట్టూ తిరుగుతున్న కక్ష్య నుంచి 2023లో భూమి మారుతుందని బాబా వంగా ప్రిడిక్ట్ చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఇది భూమి మీద నివసిస్తున్న ప్రాణుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ప్రతి ఏడాది 582 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇది ఒక దీర్ఘవృత్తాకార కక్ష్య.

ఇలా కక్ష్య ఆకారం ఏర్పడడానికి సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల బలాబలాల మీద ఆదారపడి ఏర్పడింది. ప్రస్తుతం ఆ గ్రహబలాల కారణంగానే భూకక్ష్య మారవచ్చు. మార్పులు ఎలాంటివైనా సక్రీయ పద్ధతిలో మాత్రమే జరుగుతాయి. అతి చిన్న మార్పులు కూడా మన భూవాతావరణం మీద పెను మార్పులకు కారణం కావచ్చు.

ఒక దేశం 2023లో జీవ ఆయుధాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుందని బాబా వంగా చెప్పారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ సమస్యలకు సంబంధించిన ఈ అంచనా చాలా ఆందోళన కలిగించే విషయమే..ఒక అణు విద్యుత్ ప్లాంట్ లో జరిగే పేలుడు వల్ల విషపూరిత మేఘాలు ఆసియా ఖండాన్ని కప్పేస్తాయని వంగా ప్రిడిక్ట్ చేశారు. ఈ విషపూరిత మేఘాలవల్ల ఆ ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది.

అణువిద్యుత్ ప్లాంట్ లో పేలిన ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యాలు వ్యాపించడమే కాదు, ఇతర దేశాలు కూడా అనారోగ్యాల బారిన పడతారని బాబా వంగా అంచనా వేశారు.. ప్రస్తుతం ఉక్రేయిన్లోని జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా ఆధీనంలోకి తీసుకోవడం గురించి సర్వత్రా చర్చ సాగుతోంది.

2023లో సౌర తుఫాను లేదా సౌర సునామీ..

2023 సంవత్సరంలో భూమిపైకి గ్రహాంతరవాసులు రానున్నారని..మనుషులతో శత్రుత్వం కలిగి ఉంటారని.. దీంతో మిలియన్ల మంది మరణిస్తారని పేర్కొన్నారు. 2023లో సౌర తుఫాను లేదా సౌర సునామీ ఏర్పనుంది. దీని ఫలితంగా భూమి అయస్కాంత పొర తీవ్రంగా నాశనం అయ్యే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేశారు. భూమిపై గ్రహాంతరవాసులు దాడి చేయనున్నారు. ఈ దాడిలో మిలియన్ల మంది మరణిస్తారు.

2023లో భూమి తన కక్ష్య ను మార్చుకుంటుందని చెప్పారు. భూమ కాస్మోస్‌లో అనిశ్చిత బ్యాలెన్స్‌లో ఉంది. దీంతో వాతావరణంలో భారీ మార్పుకు ఏర్పడవచ్చు. అప్పుడు పరిస్థితి నిజంగా ఆందోళనకరంగా ఉంటుంది. మనుషులు 2023 నుంచి ప్రయోగశాలల్లో పుడతారని బాబా వంగా అంచనా వేశారు. ఇలాంటి లాబ్ లలో పుట్టబోయే బిడ్డల చర్మ రంగును, తెలివితేటలను తల్లిదండ్రుల ముందుగానే నిర్ణయించుకోవచ్చు.

అంటే జీవ ప్రక్రియ మొత్తం ముందుగానే నిర్ణయించబడుతుందని అర్థం. అంతా నియంత్రణలోనే ఉంటుందని బాబా వంగా ఊహించారు. వంగ ప్రకారం ప్రయోగశాల శిశువులు రేపటి పౌరులు అవుతారు.

2028లో ఒక వ్యోమగామి వీనస్‌పై దిగుతాడని బాబా వంగా అంచనా వేశారు. ఈ అడుగు 5079ని ప్రపంచం అంతం చేసే దిశగా పడుతుందని.. 5079 సంవత్సరం ప్రపంచం అంతం అవుతుందని బాబా వంగ గుర్తించారు. తాము దైవం కొలిచే బాబా వంగా చెప్పిన భవిష్యత్ వాణి తప్పకుండ జరుగుతుందని ఆమె శిష్యులు ఢంకా భజాయించి చెబుతున్నారు.

2022లో వివిధ దేశాలు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటాయని బాబా వంగా భవిష్యవాణి లో చెప్పారు. కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటాయిని కూడా ఆమె చెప్పారు. ఇటలీ, పోర్చుగల్ లో కరువు కాటకాలు వస్తాయని ఆమె ముందే ఊహించారు.. ఆమె భవిష్యవాణిలో కొన్ని ఫలించినా సరే అవి చాలా ఆందోళనకరంగానూ, భయపెట్టెవిగానూ ఉన్నాయి. మరో వైపు ఆమె భవిష్యవాణి చాలా నిగూఢంగా కూడా ఉంది.

బాబా వంగా 1996 లోనే చనిపోయారు. కంటి చూపు లేని ఆమె రానున్న భవిష్యత్‌ లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వెంగా భవిష్యవాణి ఇప్పటికి పుస్తకరూపంలో ఉంది.

బాబా వంగాను దైవదూతగా బల్గేరియా ప్రజలు భావిస్తున్నారు. ఆమె చెప్పిన భవిష్యవాణి ఇప్పటి వరకు ఎక్కువశాతం జరిగింది.. ఈ ఏడాదిలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని బాబా వంగా అంచానా వేశారు.. ఈ ఏడాది ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

Must Read

spot_img