జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం అవతార్ 2. ఈ సినిమా నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కి ముందే చిత్రయూనిట్‌కు భారీ షాక్ తగిలింది. రిలీజ్‌కు ఒకరోజు ముందే ఆన్‌లైన్‌లో అవతార్ 2 సినిమా ప్రత్యక్షమైంది. కొందరు ఈ సినిమాను పైరసీ చేసి టెలిగ్రామ్‌లోనూ అప్‌లోడ్ చేశారు. ఫ్రీగా సినిమా అందుబాటులోకి రావడంతో చాలామంది నెట్టింట ప్రింట్ డౌన్‌లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. దీంతో ఆవతార్ 2 సినిమాకు బిగ్ షాక్
తగిలింది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవతార్ -2 మూవీ.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. జేమ్స్ కామోరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరుకోగా.. అడ్వాన్స్బు కింగ్స్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఒక్క భారత్‌లోనే ఇప్పటికే సుమారు 6 లక్షల మంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ.. అవతార్-2 మూవీ రిలీజ్‌కి ఒక్కరోజు ముందే టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. ఈ సినిమాకి నష్టాల బారిన పడకుండా ఉండాలంటే కనీసం 16వేల500 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ టెలిగ్రామ్‌లో సినిమా మొత్తం వచ్చేసింది.
వాస్తవానికి ఓవర్సీస్, ఇండియాలో ఇప్పటికే విడుదలైన అవతార్-2 మూవీ మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్-1 కంటే ఈ మూవీ ఏమంత గొప్పగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో తమ ఓపికకి డైరెక్టర్ పరీక్ష పెట్టాడని కొంత మంది నెటిజన్లు చెప్తుండగా.. ఓ కార్టూన్ సినిమా చూసినట్లు ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన అవతార్
2…తాజా గా మరో రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కేజీయఫ్ 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది.
ఈ ఏడాది కేజియఫ్ 2 సినిమాకు మల్టీ ప్లెక్స్‌లలో ఆల్ టైం హైయ్యెస్ట్ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ అయ్యాయి. ఈ సినిమాకు 4 లక్షల 11 వేలకి పైగా టికెట్స్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ అవ్వగా.. ఇక లేటెస్ట్ అవతార్ 2 దీనిని బ్రేక్చేసేసింది. అవతార్ 2కు ఇండియాలో ఏకంగా 6 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 55వేల థియేటర్స్‌లో భారీగా విడుదలవుతోంది. అవేంజర్స్ ఎండ్ గేమ్ గత రికార్డ్‌ను
బద్దలు కొడుతూ కనివిని ఎరుగని స్థాయిలో భారీగా రిలీజ్ అయింది. చూడాలి మరి ఏ రేంజ్‌లో కలెక్షన్స్‌ను రాబట్టనుందో.