HomeEntertainmentపంచ్ ఫలక్ నామాలకు పంచ్ ఇచ్చిన ఆటో రాంప్రసాద్….

పంచ్ ఫలక్ నామాలకు పంచ్ ఇచ్చిన ఆటో రాంప్రసాద్….

ఆటో రాంప్రసాద్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని బుల్లితెరపై, వెండి తెరపై మెరుస్తూ…అందరికి దగ్గరైయ్యాడు రాంప్రసాద్. ఇప్పటికే ఆ కామోడి షోలో సుధీర్, గెటప్ శ్రీను లతో కలిసి ఎన్నో స్కిట్లు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు వీరిద్దరూ లేకపోవడంతో ఒంటరిగానే జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ టీంను ముందుకు నడిపిస్తున్నాడు. స్రీన్ మీదనే కాకుండా నిజ జీవితంలో కూడా వీరి ముగ్గురి స్నేహం బాగుంటుంది. కలిసి కట్టుగా టీం వర్క్ చేసుకుంటూ తమ టాలెంట్ ను బయటకు తెచ్చిన వీరు గత కొంత కాలంగా కలిసి స్కిట్లు చేయలేకపోతున్నారు.

సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను సినిమాలలో అవకాశాలు దక్కించుకొని బిజీగా ఉంటే ఈయన మాత్రం జబర్దస్త్ కి పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా ఇటీవల తలపై ఒక క్యాప్ పెట్టుకొని కనిపించడంతో
అందరికి అనుమానులు వచ్చాయి. అసలు రాంప్రసాద్ కు ఏమైంది. ఎందుకు తలకు క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడు. అంటూ నెట్లో సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఆటో రాంప్రసాద్ కు క్యాన్సర్ ఉందని, అందుకే గత కొంత కాలంగా బయటకు రాకుండా చికిత్స చేయించుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇటీవల ఆటో రాంప్రసాద్ బయటకు వచ్చారు. తనకు ఏం జరిగిందో ఆయనే క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కమెడియన్ ఆర్ పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ ను మణికొండలో ఏర్పాటు చేయగా.. బ్రాంచ్ ఓపెనింగ్ కి జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది వచ్చారు. వారిలో రాంప్రసాద్ కూడా ఉన్నారు. అక్కడికి కూడా రాంప్రసాద్ క్యాప్ పెట్టుకుని రావడంతో అక్కడకు వచ్చిన ఓ యూటూబ్ చానల్ ప్రతినిధి రాంప్రసాద్ ను ప్రశ్నించాడు. తలకు ఎందుకు క్యాప్ పెట్టుకున్నారని, తనకు క్యాన్సర్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిజమోనా అని అడిగారు. దీనికి స్పంధించిన రాంప్రసాద్ నా ఆరోగ్యం బాగా లేదంటూ.. నాకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. మరీ క్యాప్ ఎందుకు పెట్టుకున్నారని అడగ్గా…. దానికి రాంప్రసాద్ అందరిమీద పంచ్ వేశారు. తనకు జుట్టు రాలిపోయి బట్టతల వచ్చిందని దానిని కవర్ చేసుకోవడానికి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాను అని చెప్పారు.. ఆ కారణంగానే తలపై కాప్ పెట్టుకున్నాను అంటూ రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చారు..దీంతో అందరూ నవ్వుకోని తనమీద సోషల్ మీడియాలో పంచ్ లు ఇచ్చిన వారందరికి రీవర్స్ పంచ్ ఇచ్చారు.

Must Read

spot_img