ఆస్ట్రేలియాను వారం రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టిన రేడియో యాక్టివ్ గుళికను అధికారులు గుర్తించారు. చూడ్డానికి ఓ బఠాని గింజంత ఉండే ఈ గుళిక ఓ అణుబాంబు లెవెల్లో ప్రమాదాన్ని కలుగజేస్తుందని ప్రచారం జరిగింది. అంత చిన్న గుళికను పూర్తి జాగ్రత్తల నడుమ చాలా జాగ్రత్తగా లారీలో తీసుకువచ్చారు. కానీ గమ్యస్థానం చేరాక చూసుకుంటే గుళక మాయమైంది. అచ్చం సినిమాలో చూపించే సస్పెన్స్ ఈ వారం రోజులు అక్కడి జనం అనుభవించారు
మొత్తానికి ఆస్ట్రేలియాలో పెను ప్రమాదమే తప్పింది. సీసియం 137 రేడియోయాక్టివ్ గుళిక దొరికింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతంలో ఈ క్యాప్సూల్ మిస్సైంది.దీని నుంచి అత్యంత ప్రమాదకరమైన అణు ధార్మికత విడుదలవుతుందని ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఈ గోరం గుళిక ఓ ట్రక్కు నుంచి మిస్సైంది. రియో టింటో మైనింగ్ క్షేత్రం నుంచి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న సమయంలో చిన్నపాటి క్యాప్సూల్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించకుండాపోయింది. దీంతో ఆస్ట్రేలియాలో తీవ్ర కలవరం మొదలైంది. ఒకవేళ ఆ గుళిక ఓపెన్ అయి ఉంటే… దాని వల్ల పెను ప్రమాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. 6ఎంఎం చుట్టుకొలత.. 8ఎంఎం పొడుగు ఉన్న ఆ క్యాప్సూల్ లో సీసియం-137 రేడియోయాక్టివ్ పదార్ధం ఉంది.
ఆ రేడియోయాక్టివ్ పదార్థం వల్ల చర్మం డ్యామేజ్ కావడం, మండిపోవడం, రేడియేషన్ రుగ్మతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రేడియేషన్ డిటెక్టార్ల ద్వారా ఆ గుళికను గుర్తించినట్లు ఎమర్జెన్సీ సర్వీసు పేర్కొన్నది. రోడ్డుకు రెండు మీటర్ల దూరంలో ఆ క్యాపూల్స్ ఉన్నట్లు పసికట్టారు. ఒకవేళ సీసియం క్యాప్సూల్‌కు ఎక్స్‌పోజ్ అయితే.. అది గంటలో 10 ఎక్సరేలకు సమానమైన రేడియేషన్ విడుదల చేస్తుందని హెల్త్ ఆఫీసర్ ఆండ్రూ రాబర్ట్‌సన్ తెలిపారు. ట్రక్కులో తీసుకువెళ్తున్న సమయంలో.. ఆ ట్రక్కు బోట్లు ఊడిపోవడం వల్ల.. క్యాప్సూల్ ఉన్న పరికరం కింద పడినట్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో తలెత్తిన ఈ విచిత్రమైన సమస్య పలు ప్రాంతాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. అంత పెద్ద దేశంలో ఓ చిన్న క్యాప్సూల్ కనిపించకుండా పోవడం మళ్లీదొరకడం అంటే అదో విచిత్రమే..
దీంతో అధికారులు దానిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలు దాని జోలికి వెళ్లొద్దని, సమాచారం తెలిస్తే మాకు తెలపాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇంతగా ఆందోళన చెందడానికి కారణం.. కనిపించకుండా పోయిన రేడియో ధార్మికత పదార్థంలో సీజీయం-137 ఉండటమే. దీనిని మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. దీనిని తాకిన వారికి కాలిన గాయాలు కావటంతో పాటు, దీర్ఘకాలిక క్యాన్సర్ వంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో పెద్ద మైనింగ్ కార్యకలాపాలను కలిగిఉన్న రియో టింటో ఇటీవలి కాలంలో వరుస వివాదాలకు కారణమవుతోంది. రిమోట్ కింబర్లీ ప్రాంతంలోని ఆ సంస్థకు చెందిన ఓ గనిలో ఈ రేడియో ధార్మిక క్యాప్సూల్ ను వినియోగిస్తుంటారు. ఇక్కడి నుంచే సదరు గుళికను తెస్తున్న లారీ బయలుదేరింది.
అయితే గని స్థలం నుంచి జనవరి 12న ప్రత్యేక వాహనంలో పెర్త్‌లోని ఈశాన్య శివారులోని నిల్వ కేంద్రానికి ఈ క్యాప్సూల్ ను తరలిస్తున్నారు. రవాణా సమయంలో ఈ క్యాప్సూల్ మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు. అంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా అంత చిన్న వస్తువు ఎలా మిస్ అయిందన్న విషయం ఎవరికీ అంతుపట్టలేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరిగింది. ఈ రేడియో ధార్మిక క్యాప్సూల్ 6 మి.మీల వ్యాసం, 8 మి.మీల పొడవు మాత్రమే కలిగి ఉంటుంది. అంటే కచ్చితంగా ఇది గోరంతే ఉంటుంది. జనవరి 25న దీనిని గమ్యస్థానానికి చేర్చాల్సి ఉంది. ప్రమాదకరమైన రేడియో ధార్మిక క్యాప్సూల్ మిస్ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 14వేల కి.మీల మేర వెతుకులాట కొనసాగించారు.
గత ఆరు రోజులుగా ఇది కనిపించక పోవటంతో ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాప్సూల్ చిత్రాలను విడుదల చేశారు.రోడ్డుకు ఇరువైపులా అత్యాధునిక పరికరాలతోజల్లెడ పట్టారు. ఈ రేడియో ధార్మిక క్యాప్సూల్ ను ఎట్టిపరిస్థితుల్లో తాకొద్దని, దానిని గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. క్యాప్సూల్ కు సంబంధించిన ఫొటోలనుసైతం అధికారులు విడుదల చేశారు. ఎవరికైన కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఒకవేళ ఎవరైనా వాటిని తాకినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. కానీ ఒక చోట రేడియేషన్ ను గుర్తించే పరికరాలు స్పంధించడంతో అక్కడ క్షుణ్ణంగా వెతకడంతో గుళిక దొరికిపోయింది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కనిపించినంత టెన్షన్ ఈ ఘటనలో కనిపించడం విశేషం.