జైర్ బోల్సొనారో మద్దతుదారులు వేలాది మంది బ్రెజిల్ పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనం మీద దాడిచేయటం చూసి ప్రపంచం నివ్వెరపోయింది.ఈ విధ్వంసం రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంటు భవనం కాపిటల్ మీద జరిగిన దాడులను గుర్తు చేసింది.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ బోల్సొనారో మద్దతుదారులు ప్రభుత్వ భవంతులను ధ్వంసం చేశారు. బోల్సొనారోనే అసలైన విజేత అంటూ చేసిన ఆందోళన చర్చనీయాంశంగా మారింది.
జైర్ బోల్సొనారో మద్దతుదారులు వేలాది మంది బ్రెజిల్ పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనం మీద దాడిచేయటం చూసి ప్రపంచం నివ్వెరపోయింది.ఈ విధ్వంసం రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంటు భవనం కాపిటల్ మీద జరిగిన దాడులను గుర్తు చేసింది. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ బోల్సొనారో మద్దతుదారులు ప్రభుత్వ భవంతులను ధ్వంసం చేశారు. బోల్సొనారోనే అసలైన విజేత అంటూ ఆందోళన చేశారు.
భద్రతా సంస్థలు, సోషల్ మీడియా మోడరేటర్ల కళ్లుగప్పి.. ఈ హింసాత్మక ఆందోళనలను ఎలా నిర్వహించారన్నది చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బోల్సొనారో మద్దతుదారులు కొన్ని కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అసలైన విజేత మాజీ అధ్యక్షుడు బొల్సొనారోనే అన్నది ఆ ప్రచారం సారాంశం.
బ్రెజిల్ పార్లమెంటు మీద దాడికి కొన్ని రోజుల ముందు ఈ ప్రచారం మరింత తీవ్రమైంది. దానితో పాటు ‘సెల్మా పార్టీ’కి హాజరు కావాలంటూ బ్రెజిల్ నిరసన కారులకు కోడ్ భాషలో ఆహ్వానాలు కూడా అందాయి. ‘సెల్మా’ అనే పదం పోర్చుగీస్ భాషలోని ‘సెల్వా’కు నకలు. బ్రెజిల్ సైన్యంలో యుద్ధ నినాదంగా ఈ పదాన్ని వాడుతారు.
ఈ దాడులు జరగడానికి నాలుగు రోజుల ముందు సోషల్ మీడియా టెలిగ్రామ్ గ్రూప్‌లలో ‘సెల్మా పార్టీ’కి చెందిన ఒక వీడియో వైరల్ అయింది. పార్టీకి కావలసిన పదార్థాల గురించి ఈ వీడియోలో ఒక వ్యక్తి వివరించాడు. ‘యూనియన్’ బ్రాండ్ బ్రెజిలియన్ షుగర్, ఐదు పెద్ద మొక్కజొన్న పొత్తులు అవసరమని చెప్పాడు.
బ్రెజిల్‌లో మొక్కజొన్న పొత్తును ‘మిల్హో’ అంటారు. మిల్హావో అంటే ఒక మిలియన్ అని అర్థం. మొత్తంగా ఈ వీడియోలో ఇలాంటి సంకేత పదాలతో చెప్పిన
విషయం ఏమిటంటే.. ఐదు మిలియన్ల మంది ఈ పార్టీకి రావాలని ఆహ్వానించారు.
చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ హింసకు పిలుపునిచ్చే కంటెంట్ ను నిషేధిస్తాయి. కంటెంట్ ను పరిశీలించి, అభ్యంతరకర అంశాలను తొలగించే సోషల్ మీడియా మోడరేటర్ల కళ్లు గప్పటానికి వీరు ఇలాంటి అన్యాపదేశ పదాలను వాడారు. టిక్‌టాక్ వీడియోలో ఒక మహిళ తాను రాజకీయాల నుంచి మాట్లాడనని, అలా మాట్లాడితే తన అకౌంట్‌ను తొలగిస్తారని చెప్పింది. కానీ ఆ వెంటనే ‘సెల్మా పార్టీ’ గురించి మాట్లాడింది. పార్లమెంటుపై దాడి అనంతరం ఆ వీడియోను తొలగించారు.
ఈ సెల్మా పార్టీ గురించి మాత్రమే కాక, బ్రెజిలియన్ ప్రజలు ఇతర పార్టీల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సావో పాలోలో సెల్మా కజిన్ ‘తెల్మా’ పార్టీ అని, ఆమె సోదరి ‘వెల్మా’ పార్టీ రియో డి జెనీరియోలో జరుగుతుందని ఆహ్వానాలు వచ్చాయి. ఇప్పటి వరకైతే, ఈ ఈవెంట్లు పెద్దగా ముందుకు సాగలేదు.
ట్విటర్ లో గత వారమంతా #festadaselma వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి.పార్లమెంటు వెలుపల త్రీ పవర్స్ స్క్వేర్‌గా పిలిచే ప్రభుత్వ భవంతుల వద్ద ప్రజలు ఆందోళన చేసేందుకు, పిలుపునిచ్చేందుకు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు..
- బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్లా ప్రమాణస్వీకారం జరిగిన వారం రోజుల తర్వాత ఈ ముట్టడి జరిగింది..
నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల కిటికీలు, ఫర్నీచర్ సహా విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. బోల్సెనారో ఓటమిని అంగీకరించడానికి వారు నిరాకరిస్తూ మూడుగంటలకు పైగా కొనసాగిన ముట్టడిలో విధ్వంసానికి పాల్పడ్డారు. సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడం గానీ లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ భవనం పై కప్పుపైకి ఎక్కడంతో పాటు బ్రెజిల్ సెనెట్, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే కాంగ్రెస్ భవనంపై కప్పుపైకి ఎక్కి.. బ్యానర్లు ప్రదర్శించారు. బ్రెజిలియన్ జెండాలు ధరించిన బోల్సెనారో మద్దతుదారులు అధ్యక్షభవనంలో తిరుగుతున్నట్లు టివి ఛానల్ గ్లోబో ప్రత్యక్ష ప్రసారం చేసింది. మద్దతుదారులు ఒక పోలీసుపై దాడి చేసిన దృశ్యాలు కనిపించాయి.. రోడ్లను దిగ్బంధించడంతో పాటువాహనాలకు నిప్పు పెట్టారు. సైనిక భవనాల వెలుపల ఆందోళన చేపడుతూ .. భద్రతా దళాలు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన ర్యాలీలో సుమారు 3,000 మంది పాల్గొన్నట్లు స్థానిక మీడియా అంచనావేసింది. ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించాయి.
ఈ ముట్టడిని లూలా ఖండించారు. ఫాసిస్టులు, మతోన్మాదులు రాజకీయ కక్షతో రాజధానిలో విధ్వంసం సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా దళాలు ఈ అల్లర్లను అణచివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ‘వారు చేసిన పని వర్ణించలేము.. దోషులు శిక్ష అనుభవించాల్సిందే’ అని సావో పాలో రాష్ట్ర అధికార పర్యటనలో ఉన్న లూలా పేర్కొన్నారు.
గతేడాది అక్టోబర్ 30న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని బల్సెనారో ఈ నిరసనలకు ఆజ్యం పోశారు. ప్రస్తుతం అమెరికాలోని ఫ్లొరిడాలో ఉన్న బల్సెనారో సోషల్‌మీడియా ద్వారా మద్దతుదారులను రెచ్చగొట్టి ఈ మారణహోమాన్ని ప్రోత్సహిస్తున్నారని లూలా మండిపడ్డారు. లూలా ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు బోల్సెనారో ట్విటర్‌లో పేర్కొన్నారు. శాంతియుత ప్రదర్శనలు ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ.. ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడం రేఖను దాటడమే అని పేర్కొన్నారు.
ట్విటర్ ను ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. బ్రెజిల్‌తో పాటు ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ ఉద్యోగులపై వేటు వేశారు. ఎన్నికల సమయంలో ట్విటర్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా చూసే ఉద్యోగులు కూడా అలా ఉద్వాసనకు గురయ్యారు.
ట్విటర్ వెబ్‌సైట్ లో అత్యంత ప్రమాదకరమైన కంటెంట్ ను తొలగించేందుకే కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ, ఎలాన్ మస్క్ గట్టిగా చెబుతున్నారు. ఆన్‌లైన్ లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందటం వల్ల ప్రజాస్వామ్యంపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. 2021లో అమెరికా పార్లమెంటు మీద జరిగిన దాడులలో కూడా
సోషల్ సైట్లలో వ్యాప్తి చెందిన తప్పుడు సమాచారం పాత్ర ఉందని ట్విటర్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ఒక విచారణలో అంగీకరించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్లా ప్రమాణస్వీకారం జరిగిన వారం రోజుల తర్వాత బ్రెజిల్ పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనం మీద ముట్టడి జరిగింది. బోల్సెనారో ఓటమిని అంగీకరించడానికి వారు నిరాకరిస్తూ మూడుగంటలకు పైగా కొనసాగిన ముట్టడిలో విధ్వంసానికి పాల్పడ్డారు.