Homeసినిమాసలార్ పూర్తయిన వెంటనే కేజీఎఫ్-3 స్క్రిప్ట్ వర్క్...

సలార్ పూర్తయిన వెంటనే కేజీఎఫ్-3 స్క్రిప్ట్ వర్క్…

శాండిల్ వుడ్ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కేజిఎఫ్-1. ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన కే జి ఎఫ్ -2 సినిమా కూడా ఘనవిజయాలను అందుకున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే ఇప్పుడు తాజాగా కేజిఎఫ్-3 సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలు కలెక్షన్ల సునామి సృష్టించాయి. ఈ రెండు సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సౌత్‌ ఇండియాలోని పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అలానే ‘కాంతార’ సినిమా హిట్‌తో ఊహించని విధంగా డబ్బుతో పాటు హోంబలే ఫిల్మ్స్‌కి మంచి పేరు కూడా వచ్చింది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కేజీఎఫ్-3 గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో అతను మాట్లాడుతూ ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వద్ద కేజీఎఫ్-3కి సంబంధించి స్టోరీ లైన్ ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాబోవు 5 ఏళ్లలో హోంబలే ఫిల్మ్స్ 3 వేల కోట్లు చిత్ర నిర్మాణంలో పెట్టబోతున్నట్లు కూడా స్పష్టం చేశాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇదే దర్శకుడు కేజీఎఫ్-1ని 2018లో, కేజీఎఫ్-2ని 2022లో థియేటర్లలోకి తీసుకొచ్చాడు. దాంతో ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఎదిగిపోయిన ప్రభాస్‌ సలార్ కోసం కూడా చాలా టైమ్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ కూడా కేజీఎఫ్-3 ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే.. ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్పాడు. సలార్ పూర్తయిన వెంటనే కేజీఎఫ్-3 స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమవుతుందన్నాడు.

అయితే.. 2024కి సలార్ థియేటర్లలోకి రాబోతున్నట్లు మాత్రం హింట్ ఇచ్చాడు. హోంబలే ఫిల్మ్స్ ప్రస్తుతం కన్నడలోనే కాదు.. తమిళ్‌, తెలుగులోనూ సినిమాల్ని నిర్మిస్తోంది. రఘుతాత అనే తమిళ చిత్రం ఇప్పటికే సెట్స్‌పై ఉండగా.. భగీర మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. అలానే రాజ్‌కుమార్‌ మనవడు యువ రాజ్‌కుమార్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. ఓవరాల్‌గా 2023లో ఓ 4-5 సినిమాలు నిర్మిస్తున్నామని.. ఆ తర్వాత ఏడాదికి ఆ సంఖ్య రెట్టింపుకానున్నట్లు కూడా విజయ్ కిరంగదూర్ స్పష్టం చేశాడు.

Must Read

spot_img