ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందుకున్న వారికి అత్యంత పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి.. అయితే.. నోబల్ గ్రహీతలు ఒక డిసీస్ కు గురవుతున్నారని విమర్శలు ఉన్నాయి.. ఇంతకూ నోబల్ గ్రహీతలకు అవార్డు రావడం వరమా…? శాపమా..? నోబల్ డిసీస్ వచ్చేందుకు ఆలస్యంగా గుర్తింపు రావడమే కారణమా..?
నోబల్ డిసీస్ అంటే ఏంటి…? ఇది మేధావులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది..?
ప్రపంచ ప్రఖ్యాతి నోబెల్ బహుమతి అందుకోవడం ఎంతో మంది కల.. అది కొందరికి సాకారం అవుతుండగా, మరికొందరికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.. నోబల్ బహుమతి అందుకున్న వారిలో కొందరు ఓ కొత్త వ్యాధికి గురవుతున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది.. స్వీడిష్ అకాడమీ నుంచి నోబెల్ ను తీసుకున్న తర్వాత, చాలా మంది ఈ వ్యాధికి గురయ్యారు. కొంతమంది దీన్ని నోబెల్డి సీజ్ అని పిలుస్తారు. మరికొందరు నోబెల్ ఎఫెక్ట్ అంటారు. ఇంకొందరు నోబెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. నోబెలైటిస్ అని కూడా అంటారు
నోబెల్ బహుమతి తీసుకున్న అందరికీ ఇది వస్తుందని చెప్పలేం.. కానీ,పియరె క్యూరీ, శాంటియాగో ఆర్‌వై కజల్ నుంచి రిచర్డ్ స్మాలే, ల్యూక్ మాంటేనియర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దగానే ఉంటుంది.
ఒక రంగంలో మేధావులు ఇతర రంగాల్లోనూ మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉంటారని మనం భావించకూడదు.‘‘మేధావులు కూడా కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తారని ఎవరూ ఊహించరు. కానీ, కొందరు నోబెల్ బహుమతి గ్రహీతలు కొన్ని వింత ఐడియాలను, నమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఇక్కడ సైన్స్, వివేచన మధ్య సన్నని గీత ఉంటుంది’’అని స్విట్జర్లాండ్‌లోని ఫ్రిబార్గ్ యూనివర్సిటీలో ల్యాబొరేటరీ ఆఫ్ కాగ్నిటివ్ అండ్ న్యూరోలాజికల్ సైన్సెస్ పరిశోధకుడు సెబాస్టియన్ డీక్రూజ్ అభిప్రాయం..
ఇలా అసలు వివేచన అనేదే కనిపించని సిద్ధాంతాలను నమ్మే నోబెల్ గ్రహీతల సంఖ్య ఎక్కువే ఉంటుందని ఎమొరీ యూనివర్సిటీ పరిశోధకుడు షాన బోవెస్ భావన.. ‘ఇక్కడ వీరి మేధస్సు ఒక రంగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. దీన్ని అన్నింటికీ వర్తించే మేధస్సుగా మనం చూడలేమని బోవెన్
అభిప్రాయపడ్డారు..
అంటే.. ఒక వ్యక్తికి జీవశాస్త్రం, చరిత్ర, సైకాలజీ ఇలా ఏదో ఒక రంగంలో అద్భుతమైన మేధస్సు ఉండొచ్చు. కానీ, ఖగోళ శాస్త్రం, అంతరిక్షం లాంటి ఇతర రంగాల్లోనూ వీరికి మేధస్సు ఉంటుందని మనం భావించకూడదు. అంటే తమ పరిధికి అవతల ఉండే అంశాలపై వీరిలో కొన్ని వివక్షలు లేదా అభ్యంతరకరమైన ఆలోచనలూ ఉండొచ్చు. ఇక్కడ ప్రతిదాన్ని విమర్శనాత్మక ధోరణిలో చూడటానికి చాలా శ్రమ అవసరం. అందుకే కొన్నింటిని ఉన్నది ఉన్నట్లుగానే నమ్మాల్సి రావొచ్చు.
ఈ వ్యాధితో బాధపడేవారి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. ఒక రంగంలో మేధస్సు ఉన్నంత మాత్రన వారు వింత సిద్ధాంతాలను నమ్మరని అనుకోకూడదు. విమర్శనాత్మక ధోరణి అనేది మేధస్సు కంటే భిన్నమైనదని ఇప్పటికే చాలా పరిశోధనలు నిరూపించాయి.
మేధస్సు అనేది మనం సమస్యలను పరిష్కరించేందుకు, సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది. అదే విమర్శనాత్మక ధోరణి… ఆ సమాచారంతో మనం ఏం చేయబోతున్నామో చెబుతుంది. ఆ సమాచారం నుంచి మనం ఏం అర్థం చేసుకుంటామో వివరిస్తుంది.
మేధస్సు అనేది మనం విమర్శనాత్మక ధోరణితో ఆలోచించేందుకు తోడ్పడుతుంది. అయితే, ఇక్కడ మేధస్సు కలిగిన అందరూ విమర్శనాత్మక ఆలోచనాపరులు అనుకుంటే పొరపాటే. ఇక్కడ భావోద్వేగాలు, మనసులో మాటలు కూడా బయటకు వస్తాయి.. ఒక్కోసారి మన ఊహకు అందని అంశాలపై మాట్లాడేటప్పుడు కూడా మనం గట్టిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటామని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ క్లినికల్ బయోకెమెస్ట్రీ ప్రొఫెసర్ఎ ల్‌ఫేతెరియోస్ డియామెండిస్ అభిప్రాయపడ్డారు..
నోబల్ గ్రహీతలకు అవార్డు రావడం వరమా…? శాపమా..?
నోబెల్ బహుమతి గ్రహీతల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని డియామెండిస్ భావిస్తున్నారు. ‘‘ఇతర అవార్డులతో పోలిస్తే, నోబెల్ చాలా ప్రత్యేకమైది. దీనికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని వల్ల శాశ్వత గుర్తింపు వస్తుంది. ఒకసారి నోబెల్ ప్రైజ్ వస్తే ప్రపంచం మొత్తం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది.
‘‘ఈ గుర్తింపు అనేది అవార్డు గ్రహీతలపై చాలా భిన్నమైన ప్రభావం చూపుతుంది. వారికి సమాజంలో ఒక సెలబ్రిటీ హోదా లభిస్తుంది. దీని వల్ల కొందరికి నోబెల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అందరిపైనా దీని ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, కొందరు మాత్రం తమకు ఏమాత్రం పరిచయంలేని
ప్రాజెక్టులను కూడా చేపడతారు.
దీనికి ఉదాహరణగా మనం ఫ్రెడ్రిక్ బెంటింగ్‌ను చెప్పుకోవచ్చు.. ‘1900ల్లో బెంటింగ్ ఇన్సులిన్‌ను కనుగొన్నారు. మధుమేహ రోగులకు ఆయన దీనితో కొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత క్యాన్సర్‌ను కూడా ఇలానే నయం చేయొచ్చని ఆయన భావించారు.. అందుకు ఆయన చాలా ప్రయత్నించారు. నిజానికి క్యాన్సర్ గురించి ఆయనకు తెలిసినది చాలా తక్కువ. దీంతో బెంటింగ్ విజయం సాధించలేకపోయారు.
నోబెల్ డిసీజ్ అనేది తమను తాము అతిగా నమ్ముడంగా చెప్పుకోవచ్చని డియామెండిస్ అభిప్రాయం.. దీన్ని ఒక మానసిక వ్యాధిగా ఆయన వివరించారు.‘‘విపరీతమైన ఆత్మాభిమానం, అహంకారం,అతి ఆత్మవిశ్వాసం లాంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఫలితంగా వారికి సూపర్‌హ్యూమన్ పవర్‌లు ఉన్నట్లు వారు భావిస్తారు. తమకు ఎదురైన ఎలాంటి సమస్యకైనా తాము పరిష్కారం చూపగలమని వారు భావిస్తారు.. నోబెల్ డిసీజ్‌తో బాధపడిన కొందరు ప్రముఖులులో లీనస్ పౌలింగ్ ఒకరు.
అమెరికాకు చెందిన లీనస్ రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. రసాయన శాస్త్రంలో 1954, 1962లో ఈ బహుమతులు పొందారు. కెమికల్ బాండ్స్, మాలిక్యులర్ స్ట్రక్చర్, క్వాంటమ్ మెకానిక్స్‌లపై లీనస్ పరిశోధన చేపట్టారు. అయితే, ఆ తర్వాత తన పరిశోధనలను విటమిన్ సీతో క్యాన్సర్‌ను నయం చేయడం వైపు మళ్లించారు. లీనస్ పరిశోధనల్లో చాలా ఎర్రర్‌లు కనిపించాయని తోటి పరిశోధకులు వెల్లడించారు.
వ్యాధికి గురైన మరొక వ్యక్తి జేమ్స్ వాట్సన్
అమెరికాకు చెందిన జేమ్స్‌కు 1962లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతి వచ్చింది.. డీఎన్‌ఏ నిర్మాణంపై జేమ్స్ చేపట్టిన పరిశోధన ఆధునిక సైన్స్‌లో ఒక
కొత్త ఆలోచనా విధానానికి బాటలు పరిచింది. అయితే, నల్లజాతి ప్రజలు తెలివి తక్కువవారని జేమ్స్ భావించేవారు. ఆ జాతి ప్రజల్లో ఐక్యూ తక్కువని ఆయన అభిప్రాయం.. మరోవైపు భూమధ్య రేఖకు సమీపంలో నేరుగా సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని కూడా జేమ్స్ వివరించేవారు.\
హెచ్ఐవీపై పరిశోధనకు గాను ఫ్రాన్స్‌కు చెందిన ల్యూక్‌కు 2008లో మెడిసిన్‌లో నోబెల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత వైరస్, బ్యాక్టీరియాల నుంచి వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలను గుర్తుపట్టగలిగే సామర్థ్యం మంచి నీటికి ఉంటుందని ఆయన చెప్పారు. మరోవైపు పార్కిన్సన్స్‌కు బొప్పాయితో చికిత్స చేయొచ్చని చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సీన్‌లను కూడా ల్యూక్ విమర్శించారు. 1973లో అమెరికాకు చెందిన ఐవర్ కు భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. అయితే, గ్లోబల్ వార్మింగ్ లాంటిదేమీ లేదని ఆయన అన్నారు. అసలు అది సమస్యే కాదని అబిప్రాయపడ్డారు.
మరోవైపు… నిజానికి ఆ పరిశోధకులు సదరు ఆవిష్కరణను కనుగొన్న దశాబ్దాల తర్వాత సాధారణంగా నోబెల్ బహుమతి ఇస్తారు. అప్పటికి వారి మేధో సామర్థ్యం కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది.. నోబెల్ బహుమతి తీసుకుంటున్న పరిశోధకుల సగటు వయసు 70 ఏళ్లు. అంటే అప్పటికే వారి వయసు చాలా అయిపోతుంది. అదే సమయంలో మనం నోబెల్ బహుమతిని వారి మేధస్సుకు ప్రతీకగా చూడకూడదు.
‘కొన్నిసార్లు అదృష్టం వల్ల మనం కొత్త విషయాలను కనుక్కోవచ్చు. సరైనా మార్గంలో అనుకోకుండా వెళ్లినా కూడా కొత్త అంశాలను కనిపెట్టొచ్చు.. మరోవైపు నోబెల్ బహుమతిని ఒక వ్యక్తికి ఇవ్వడంపైనా విమర్శలు వస్తున్నాయి. నిజానికి పరిశోధనలు అనేవి కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి చేపడతారు. అన్నింటి కంటే పెద్ద సమస్య ఏమిటంటే.. ఈ శాస్త్రవేత్తలు ఒక అంశంపై లోతైన అవగాహన కలిగి ఉంటారు.
అయితే, మిగతా అంశాలపై వీరి అవగాహన అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి.. అయితే, ఒక అంశంపై మనం ఒక కొత్త ఆవిష్కరణను కనుగొనడంతో ఇతర అంశాలపైనా మనకు మెరుగైన అవగాహన ఉంటుందని భావించకూడదు.. అలా చేస్తే, మనం కొన్ని అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.
నోబల్ గ్రహీతలలో కొందరు వ్యక్తులు డిసీజ్ బారినపడుతున్నారు.. ఇందుకు ప్రధానం కారణం వారికి ఆలస్యంగా గుర్తించి అవార్డు ఇవ్వడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఏదేమైనా.. నోబెల్ డిసీజ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి