నందమూరి అస్త్రాన్ని ప్రయోగించనున్నారట.. మరీ ముఖ్యంగా విపక్షంలో ఉంటూ, ఎన్టీఆర్ జపం చేస్తున్న నేతలే టార్గెట్ గా వ్యూహం పన్నుతున్నారట.. అయితే ఇప్పుడీ వ్యూహంపైనే సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం. ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏడు పదుల వయసును లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు ఉబలాట పడుతున్నారు. అంతేగాక గతంలో జరిగిన తప్పిదాలకు తావివ్వకూడదని డిసైడ్ అయ్యారు. అన్నింటికంటే మించి ఈసారి నందమూరి కుటుంబసభ్యులకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబానికి చెందిన కొత్త ముఖాలను తెచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు.
హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అక్కడ నుంచే పోటీకి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతానికి నందమూరి కుటుంబమంతా చంద్రబాబుతోనే ఉంది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప అందరూ సన్నిహితంగానే ఉంటున్నారు. చివరకు హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్, కుమార్తె
సుహాసిని మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం సైతం దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలా దాదాపు నందమూరి కుటుంబాన్నంతటిని ఒకేతాటిపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో గట్టిగానే తలపడాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తద్వారా నందమూరి కుటుంబాన్ని తాను అణగదొక్కానన్న అపవాదునుంచి బయటపడేందుకు చంద్రబాబు డిసైడయ్యారు.
ఎన్టీఆర్ పెద్దకుమారుడి కుమారుడు చైతన్య కృష్ణను గుడివాడ నుంచి బరిలో దించాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అక్కడ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు టీడీపీ నుంచి.. రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అటు ఎన్టీఆర్ అంటే తనకు దైవంతో సమానమని.. తనకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తన వెనుక జూనియర్ ఉన్నారని అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ నందమూరి కుటుంబసభ్యలతో నానికి చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు చైతన్య కృష్ణ కూడా రెడీ అవుతున్నారు.ఇటీవలే సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. మరో వారసుడు తారకరత్న కూడా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడ నుంచైనా పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
నందమూరి కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తేవడానికి మరో రీజన్ ఉంది. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ పక్కలో బల్లెంలా మారారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత జూనియర్ ను పార్టీలోకి తేవాలన్న డిమాండ్ వచ్చింది. ఒకరిద్దరు పెద్ద నాయకులు కూడా ఇదే మాట చెప్పారు. అటు చంద్రబాబు సభల్లో కూడా శ్రేణుల నుంచి అదే మాట వినిపించింది. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీ పేరు మార్పు, నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల కామెంట్స్ పై జూనియర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా జూనియర్ పై ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో మిగతా నందమూరి కుటుంబమంతా ఇష్యూలపై ఎక్కువగా రియాక్టయ్యారు. దీనిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.
జూనియర్ ను సైడ్ చేసి, నందమూరి వారసులను ఎన్నికల్లో పోటీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారిపైనే ప్రయోగించాలని చూస్తున్నారు. దాంతో వారిని చెక్ చెప్పడమే కాదు.. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ను కూడా ముగించాలన్న వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడిదే విషయం ఇటు నందమూరి అభిమానులు అటు నారావారి మద్దతుదారులకు అర్ధంకాని ప్రశ్నగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే తెలంగాణలో లాగే ఏపీలో కూడా పార్టీకి ఎక్సపైరీ డేట్ అయిపోయినట్లే భావించాలి. 2024 ఎన్నికల తర్వాత పార్టీ ఉందంటే ఉందన్నట్లుగా తయారైపోవటం ఖాయం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాధంతా తన గురించి కాదు కేవలం కొడుకు లోకేష్ విషయంలోనే. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఎప్పుడు కష్టాల్లోపడినా చంద్రబాబుకు ముందుగా గుర్తుకొచ్చేది పార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే. అందుకనే వచ్చే ఎన్నికల్లో కూడా నందమూరి కుటుంబాన్ని పూర్తిగా వాడేసుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ పూర్తిగా వాడేసుకోవటం అంటే ఏకంగా కొత్తగా ఇద్దరిని ఎన్నికల్లో దింపాలని అనుకుంటున్నారట.
చంద్రబాబు ఉద్దేశం ఏమిటంటే నందమూరి కుటుంబాన్ని ఎన్నికల్లో దింపితే జనాలు వారిని గెలిపించటమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా టీడీపీని గెలిపిస్తారని .. విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే హిందుపురం నియోజవర్గానికి ఎన్టీయార్ కుమారుడు నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలయ్య కాకుండా రేపటి ఎన్నికల్లో గుడివాడలో ఎన్టీయార్ మనవడు చైతన్య కృష్ణను పోటీ చేయించే అవకాశాలను పరిశీలిస్తున్నారట. జనాలు గుడివాడలో తాతను గెలిపిచింనట్లే మనవడిని కూడా గెలిపిస్తారని చంద్రబాబు అనుకుంటున్నారేమో.
అయితే చైతన్యే కాకుండా నందమూరి తారకరత్న కూడా పోటీకి రెడీ అవుతున్నారట. అయితే తారకరత్న ఎక్కడి నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారో తెలీదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో నందమూరి వారసులు ముగ్గురు పోటీ చేసే అవకాశాలున్నాయి. నందమూరి వారసులు పోటీ చేసినంత మాత్రాన పార్టీకి ప్లస్అవుతుందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఏదేమైనా కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాలంటే తన వల్ల కాదని నందమూరి కుటుంబానికే సాధ్యమవుతుందని చంద్రబాబు అంగీకరించినట్లేనా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. అయితే ఇలా ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు మూడు టికెట్లు ఇవ్వడం ద్వారా.. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని.. ఈ క్రమంలో విపక్షాల విమర్శలకు చెక్ చెప్పినట్టు అవుతుందని టీడీపీ అధినేత యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల రాబోయే రోజుల్లో టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలనే వాదనలు కూడా వచ్చే అవకాశం ఉండదని..
ఒకరకంగా ఈ వాదనకు చెక్ చెప్పినట్టు అవుతుందని చంద్రబాబు ప్లాన్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడినప్పటి నుంచి పార్టీ పగ్గాలజూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్లు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా చెక్ చెప్పినట్టు అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కుటుంబాన్ని కూడా మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అలా చేయడం వల్ల ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తనతోనే ఉందనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ అధినేత ప్లాన్ చేస్తున్నారని విశ్లేషణులు వినిపిస్తున్నాయి. తద్వరా ఎన్టీఆర్ ఓటు బ్యాంక్ తనకే లభిస్తుందని బాబు యోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో బాబు ఒక్కదెబ్బకు రెండు పిట్టలు వ్యూహంలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అటు పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
మరి బాబు నందమూరి వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది.