Homeసినిమాబిగ్ ట్వీస్ట్ ఇచ్చిన అనుపమ…. డైరేక్షన్ కి వెళ్తుందా ?

బిగ్ ట్వీస్ట్ ఇచ్చిన అనుపమ…. డైరేక్షన్ కి వెళ్తుందా ?

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యింది. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా కార్తికేయ 2తో బిగ్ సక్సెస్ కోట్టింది. ప్రస్తుతం 18 పెజేస్ సినిమా రిలీజ్ కి రేడి అయింది. దీంతో ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రమోషన్ తో తన మనసులోని మాటను బయట పెట్టింది.

సక్సెస్ లో ఏం చెప్పిన బాగుంటుంది. చెవులు పెద్దవి చేసుకోని వినాలి అనిపిస్తోంది. సక్సెస్ కి బ్యూటీ యాడ్ అయితే. అచ్చం మన అనుపమాల ఉంటుంది. మిస్ అనుపమా మాటలు ఇప్పుడు ట్రెండింగ్ మారాయి. రౌడీ బాయ్స్, కార్తికేయ-2 సినిమాలతో మంచి సక్సెస్ లో ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం 18 పెజేస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ కేరళ కుట్టి.

త్వరలోనే తాను కచ్చితంగా దర్శకత్వం చేస్తానని బిగ్ ట్వీస్ట్ ఇచ్చింది. కానీ అది చాలా పెద్ద భాద్యత అంటునే…సరైన కథను రేడీ చేస్తున్నట్లు చెప్పింది. తాను కథానాయికగానే ఇంకా పూర్తిగా నటించలేదు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నాను. డైరెక్షన్ చేసే ముందు కనీసం ఒకరిద్దరు అగ్ర దర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అంతే కాక డైరెక్షన్ చేస్తే ఒక సంవత్సరం ముందే నటనకి బ్రేక్ ఇస్తానని సెట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ నేను సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో మాత్రం నేను నటించను అని తెలిపింది.

ఇక ఇదిలా ఉంటే సుకుమార్ గారి రంగస్థలం సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినపుడు చాలా బాధ పడ్డనని ఫీల్ అయింది ఈ ముద్దుగుమ్మ. మళ్ళీ ఇప్పుడు సుకుమార్ గారి రైటింగ్స్ లో నా క్యారెక్టర్ ను డిజైన్ చేయడం చాలా హ్యాపీ గా ఉందని తెలిపింది. ప్రస్తుతం హీరోయిన్ గా చేతి నిండా సినిమాలు ఉన్న అనుపమ డైరెక్షన్ చేస్తా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మలయాళ కుట్టి ఎప్పుడు డైరెక్షన్ చేస్తుందో చూడాలి.

Must Read

spot_img