Homeసినిమాస్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరలేని అనుపమ..!

స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరలేని అనుపమ..!

కొంత మంది కెరీర్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం. వచ్చిన అరుదైన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ తమదైన మార్కుని పలికించగలిగితే.. దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే ఇక కెరీర్ నల్లేరు మీద నడకే అవుతుంది.

కానీ కొంత మందికి అలాంటి అవకాశాలు కెరీర్ తొలి నాళ్లలో వెతుక్కుంటూ…వచ్చినా వాటిని గుర్తించలేరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం అనుపమ పరిస్థితి కూడా అంతే.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ రెండు అడుగులు ముందుకు వెళ్తే… నాలుగు అగుడులు వెనక్కి వెళ్తుంది. అన్ని సక్రమంగా ఉంటే..తను ఎప్పుడో స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయేదే. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలో సమంతకు ముందు అనుకున్నది అనుపమనే.

తను నటించిన ప్రేమమ్ లాంటి క్లాసిక్ మూవీని చూసిన సుకుమార్ రామలక్ష్మీ పాత్ర కోసం తనని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆడిషన్స్ కూడా చేశాడు. కానీ తను అప్పటికి తన క్రేజ్ ని గుర్తించలేకపోవడం ఆడిషన్స్ లోనే భయపడటంతో బ్లాక్ బస్టర్ మూవీలో భాగం అయ్యే గోల్డెన్ ఛాన్స్ ని కోల్పోయింది.

అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే వుంది. కానీ కాలం కలిసి రావడం లేదు. నిఖిల్ తో కలిసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కార్తికేయ 2లో నటించింది. కానీ తన పాత్రకున్న ప్రాముఖ్యత తక్కువ కావడంతో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఆ సినిమాలో ప్రాధాన్యత లేని పాత్రలో నటిస్తే నటించింది.

కానీ తాజాగా మాత్రం నిఖిల్ తో కలిసి 18 పేజెస్లో బంపర్ ఆఫర్ ని దక్కించుకుంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలైంది. సినిమాలో నిఖిల్ హీరో అయినా అతన్ని మించిన ప్రాధాన్యత వున్న పాత్రలో నటించి నందిని పాత్రతో ప్రతీ ఒక్కరి మదిని దోచేస్తోంది.

గజినిలో అసిన్ పాత్ర చనిపోయిన సందర్భంలో బస్ లో తన గురించి హీరోయిన్ కి నిజం చెప్పకుండానే… తాను చనిపోయిందని హీరో పాత్ర ఫీలైన తీరు ప్రతీ ఒక్క ఆడియన్ మదిని మెల్ట్ చేసింది. ఇప్పుడు అలాంటి పాత్రలో నందినిగా 18 పేజెస్లో అనుపమ నటించి ప్రేక్షకుల హృదయాల్ని గొల్లగొట్టేస్తోంది. సినిమాలో తన పాత్ర చనిపోయిన ఫీలింగ్ కలుగుతూ కథ సాగుతుంది.

అయితే ఆ విషయం తెలిసిన ప్రేక్షకుడు హీరోయిన్ చనిపోకుండా వుంటే బాగుండేది కదా? అని ఫీలవుతున్న తరుణంలో తను బ్రతికే వుందన్న నిజం తెలుస్తుంది. ఈ పాయింట్ ప్రేక్షకుల్ని అనుపమని మరింతగా తగ్గరికి చేసింది. ఈ సినిమాలో పోషించిన నందిని పాత్రతో తన సత్తా ఏంటో నిరూపించిన అనుపమ కు ఇకపై టాలీవుడ్ తిరుగులేదని క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరడం కాయమనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ని సాధించిన 18 పేజెస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడం కాయం అని చెబుతున్నారు.

Must Read

spot_img