Homeసినిమాబన్నీతో మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్…

బన్నీతో మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. పాన్ ఇండియా స్టాయిలో నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తికావచ్చింది. పూజా హగ్దే కథనాయికగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కింస్తున్నారు. ఓ పక్క డైరెక్టర్ గా వర్క్ చేస్తూనే మరోపక్క పవన్ సినిమాలకు మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నా ఆయన మహేష్ మూవీ తర్వాత పుష్పరాజ్ అల్లుఅర్జున్ తో అని గుసగుసలు వినిసిస్తున్నాయి.

వైజాగ్ లో బన్నీకి ఘన స్వాగతం పలికిన అభిమానులు

ప్రస్తుతం త్రివిక్రమ్ .. మహేశ్ బాబు సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లిందనే విషయం తెలిసిందే. అయితే ఓ పక్క మహేష్ తో మూవీ కంప్లీట్ కాకముందే స్టైలిష్ స్టార్ బన్నీతో ప్లాన్ చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ మూవీలో బన్నీని కొత్తగా చూపించబోతున్నట్లు సమాచారం. మాస్ యాక్షన్, ఎమోషన్ తో సాగే ఈ సినిమాలో కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథను పుష్పరాజ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ వినిసించాడని కథ నచ్చడంతో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో జులాయి .. సన్నాఫ్ సత్యమూర్తి.. అల వైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ మూడూ కూడా ఒకదానికి మించి హిట్ అయ్యాయి. వచ్చేవేసవిలో పూజా కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు.

వైజాగ్ షూటింగ్ పూర్తి చేసుకుని బ్యాంకాక్ వెళ్లనున్న బన్నీ…

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నా తర్వాత పుష్ప-2 స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగు జరువుకుంటోంది. వైజాగ్ లో పలు కీలక సన్నివేశాలను సుకుమార్ చిత్రికరించారు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఓ కీలకమైన సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ బ్యాంకాక్ వెళ్లడానికి సిద్దమౌతున్నారు. నెల రోజుల పాటు బ్యాంకాక్ ఫారెస్టులో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొదటి సారి బన్నీ సింహంతో ఫైట్ సీన్ ను ఎంతో హైలెట్ గా డీజైన్ చేసినట్లు చెబుతున్నారు.

Must Read

spot_img