Homeఅంతర్జాతీయంకరోనా కారణంగా మరో ఇన్ఫెక్షన్…

కరోనా కారణంగా మరో ఇన్ఫెక్షన్…

కోవిడ్ దెబ్బకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా చైనాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజలు జాంబీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారని అంటున్నారు. జాంబీ ఇన్‌ఫెక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియా నిండా చైనాలో కొనసాగుతున్న బీభత్సపు ద్రుశ్యాలే కనిపిస్తున్నాయి. వార్డుల్లో విచ్చలవిడిగా పడిఉన్న మ్రుతదేహాలు, వార్డుల్లో క్రిక్కిరిసిపోయి కనిపిస్తున్న కరోనా రోగులు అంతా గందరగోళంగా ఉంది. రాబోయే మూడు నెలల్లో ఇది మరింత దారుణంగా మారిపోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్లలు మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పి బయపెడుతున్నారు.

కోవిడ్ కారణంగా ఎవరైనా మరణిస్తే.. ఆ ఇన్ఫెక్షన్ మృతదేహం ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనినే జాంబీ ఇన్ ఫెక్షన్ అని అంటున్నారు. కొత్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మృతదేహాలను ఖననం చేసే వ్యక్తులు జాంబీ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంది.

అటు పాథాలజిస్ట్‌లు, మెడికల్ ఎగ్జామినర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, కోవిడ్ మరణాలు సంభవించే ఆసుపత్రులు లేదా నర్సింగ్ హోమ్‌లలో పనిచేసే సిబ్బంది కూడా ఈ ప్రమాదం బారిన పడనున్నారు. ఈ పరిస్థితిలో వ్యాధి సంక్రమణ వ్యాప్తి కారణంగా కేసులు మరింత ఎక్కువగా పెరుగుతాయి. కోవిడ్ సోకి చనిపోయిన కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌లోని చిబా యూనివర్శిటీ పరిశోధకుడు హిసాకో సైతో కీలక సూచనలు చేశారు. కొన్ని దేశాల్లో కోవిడ్‌తో మరణించిన వ్యక్తుల మృతదేహాలను నేరుగా ఖననం చేయకుండా ఇంటికి తీసుకువెళుతున్నారని..ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. జాంబీ ఇన్ఫెక్షన్ గురించి సాధారణ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు

2020 సంవత్సరంలో జపాన్ ప్రభుత్వం కరోనా సోకి చనిపోయిన మృతదేహానికి దూరంగా ఉండాలని అలాగే దానిని తాకవద్దని కోరింది. మృతదేహాలను సంచుల్లో మూసి ఉంచి 24 గంటల్లో వీలైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు సూచించారు. మరణం తర్వాత 17 రోజుల వరకు శవాలలో అంటు వైరస్‌లను అనేక అధ్యయాల్లో గుర్తించారు.

డాక్టర్ సైతో, అతని సహచరులు కలసి కోవిడ్‌తో మరణించిన 11 మంది ముక్కు, ఊపిరితిత్తుల నమూనాలను పరిశీలించారు. మరణించిన 13 రోజుల తర్వాత కూడా 11 మృతదేహాలలో ఆరింటిలో కరోనా వైరస్‌ను వారు గుర్తించారు. కోవిడ్‌ సోకి రోగి వెంటనే మరణించినప్పుడు.. శరీరంలో వైరస్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇది చాలా భయపడాల్సిన సమాచారం. ఎందుకంటే చనిపోయినవారిని తీసుకుపోవడం పెద్ద తతంగంగా ఉంటుంది. మ్రుతదేహాలను సీల్డ్ కవర్ లో ప్యాక్ చేయడం, వాటిని క్రెమెటోరియం తరలించడం, అక్కడ క్యూ లైన్లలో నిలబడటం పెద్ద ప్రహసనంగా ఉంటుంది. ప్రస్తుతం చైనాలో అంత్యక్రియలు జరపడం చాలా కష్టంగా ఉంది. ఎడతెగకుండా వస్తున్న డెడ్ బాడీలను 24 గంటలు తగలబెడుతున్నా క్యూ లైన్లు తగ్గడం లేదు.

ఒక దశలో ఈ క్యూలైన్ లో తమ వారి నెంబరు వచ్చేందుకు 20 రోజులు కూడా పడుతోందని బంధువులు వాపోతున్నారు. అందుకే మ్రుతదేహాలను అక్కడే ఉంచేసి దూరంగా ఉంటున్నారు. అంతకన్నా విషాధకరమైన విషయం మరొకటి ఉండదు. అయితే స్మశానంలో పనిచేసే సిబ్బందికి ఈ జాంబీ వైరస్ అంటుకునే అవకాశం ఉంది.

ఒకవేళ వారు తమ విధులు నిలిపివేస్తే ఎలా అన్న అనుమానం స్థానిక ప్రభుత్వాలను వేదిస్తోంది. ఎందుకంటే అలాంటి పనులు చేయడానికి అందరూ ముందుకు రారు. ఆ వచ్చినవారు ఏకధాటిగా రాత్రింబవళ్లూ శవాలను కాలబెట్టే పనులు చేస్తున్నారు. ఏదో సమయంలో వారికి విసుగు పుడితే ఆ పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే మాత్రం అదో పెద్ద సమస్యగానే ఉండబోతోంది. ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యమ్నాయ మార్గాలను యోచిస్తున్నట్టు సమాచారం. అయితే చైనాలో ఏం జరిగినా ఆ విషయాలు చాలా ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలుస్తుంటాయి.

గతంలో ఇలా సామూహిక ఖననాల విషయంలో రిస్క్ తీసుకోకుండా యంత్రాల సహాయంతో అంత్యక్రియలు జరిపారు. ఏకంగా పెద్ద గొయ్యి తవ్వేసి డోజర్లతో పూడ్చేయడం చేసారు.

Must Read

spot_img