Homeఅంతర్జాతీయం50+ మగవారిలో కూడా ఆడవారిలోని ఆ సమస్య....

50+ మగవారిలో కూడా ఆడవారిలోని ఆ సమస్య….

స్త్రీలకు ఉన్నట్టే యాబయ్యేళ్ల తరువాత పురుషులూ మెనోపాజ్ ఎదుర్కుంటారని తేలింది. అలాగే మరి మహిళలకు వచ్చినట్టు పురుషులకు పీరియడ్స్ లేకున్నా ఎనీమియా..అంటే రక్తహీనత వస్తుందా..? అంటే అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. అయితే అది రుతుస్రావంలాంటిదేమీ కాదనీ, ఐరన్ లోపం వల్లనే అలా జరుగుతోందని పరిశోధకుల తాజా పరిశోధనలో తేలింది..ఓ రిపోర్ట్..

ఈ మాటలు వింటే..పురుషుల్లో పీరియడ్స్‌ ఉండకున్నా.. ఎనిమియా రావడమేంటి..? అన్న అనుమానాలు అందరికీ కలుగుతాయి. కారణాలేంటంటారా..?

మహిళల్లో మాత్రమే కనిపించే రక్తహీనత సమస్య పురుషుల్లో కూడా వస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఐరన్‌ లోపమే అని అంటున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనాలలో ఆ విషయాన్ని గుర్తించారు. ఇలా జరగడం వలన సంతానలేమికి దారితీసే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో వెల్లడించారు. పురుషుల్లో రక్తహీనత ఉండదని అంతా అనుకుంటారు. నిజానికి ఇది పూర్తిగా తప్పు. రక్తహీనత గురించి మాట్లాడినప్పుడల్లా అందరి దృష్టి మహిళలపైనే ఉంటుంది. రక్తహీనత పురుషుల్లో కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి.

రక్తహీనత కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది. సంతానలేమి సమస్యలు వస్తాయి. ఆడవారిలో మాదిరిగా మగవారిలో పీరియడ్స్ ఉండవు. అయినప్పటికీ మగవారిలో ఎనిమియా కనిపిస్తుంది. ఐరన్‌ లోపం వల్ల వృషణాల కణజాలం దెబ్బతింటుందని ఎపిడెమియాలజిస్టులు చెప్తున్నారు. వృషణాల కణాలలో ఉండే ఫెర్రిటిన్ అనేది స్పెర్మ్ తయారు చేస్తుంది. ఐరన్ లోపం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం మొదలవుతుంది. యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌లు కూడా తగ్గడం ప్రారంభించి స్పెర్మ్ సరిగ్గా అభివృద్ధి చెందదు. దాంతో మహిళలో ఆవిర్భవించే ఓవమ్..అంటే అండం పలదీకరణం చెందే అవకాశాలు ఉండవు. అందుకే అలాంటి వారికి పిల్లలు కలగరు. అదీ అసలు కారణం.

ఈ రుగ్మత ప్రతి 10 మంది పురుషుల్లో ముగ్గురికి రక్తహీనత రూపంలో వస్తోందని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన పీఎల్‌ఓఎస్‌ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో కూడా ప్రచురితమైంది. ఈ పరిశోధనలో 15 నుంచి 54 ఏండ్ల వయస్సు గల 61 వేల మంది పురుషులను తీసుకుని వారి శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్‌ను కనుగొన్నారు. దీనికి రెమెడిగా మహిళలు సాధారణంగా తీసుకున్నట్టే పురుషులు కూడా ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలని పరిశోధకులు వారికి సలహా ఇస్తున్నారు. అయితే ఇందుకు వైద్యనిపుణుల సలహాలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంచిక ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదికను పీఎల్ఓఎస్‌ ధ్రువీకరించింది. అధిక బరువు ఉన్న పురుషుల కంటే తక్కువ బరువు ఉన్న పురుషులు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. తక్కువ బరువు ఉన్న పురుషులలో 34.7 శాతం రక్తహీనత కలిగి ఉండగా, అధిక బరువు ఉన్న పురుషుల్లో 19.3 శాతం మాత్రమే రక్తహీనతతో ఉన్నారు.

వృద్ధులు కూడా రక్తహీనతతో బాధపడుతున్నట్లు వారి అబ్జర్వేషన్ లో గుర్తించారు. మద్యం, సిగరెట్లు తాగే పురుషుల్లో రక్తహీనత లక్షణాలు మరింత ఎక్కువగా కనిపించాయి. అలాగే ఆల్కహాలిజం హెమటోలాజికల్ కాంప్లికేషన్స్‌లో ఆల్కహాల్ శరీరంలోని వివిధ రకాల రక్త కణాలను, వాటి పనితీరును ప్రభావితం చేస్తోందని గుర్తించారు.

అతిగా మద్యం తాగే వారిలో రక్తకణాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా కొత్తగా ఏర్పడే రక్తకణాలు కూడా అసాధారణంగా ఉంటాయని గుర్తించారు. 90 శాతం రక్తహీనత కేసులకు ఐరన్‌ లోపం ప్రధాన కారణం. ఇదే సమయంలో 10 శాతం కేసుల్లో ఫోలేట్, విటమిన్ బీ12, విటమిన్ ఏ లోపం కారణంగా ఉంటున్నదని పరిశోధకులు చెప్తున్నారు. మహిళల్లో పీరియడ్స్ కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఈ కారణంగానే వారిలో రక్తహీనత ఏర్పడుతుంది.

అయితే, పురుషుల్లో కడుపులో పురుగులు ఉండటం, మద్యం సేవించడం లేదా సిగరెట్ స్మోకింగ్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుందని తేలిపోయింది. కడుపులో టేప్‌వార్మ్, పిన్‌వార్మ్, హుక్‌వార్మ్ వంటి అనేక రకాల నులి పురుగులు ఉన్నాయి. ఒక పురుగు ఒక్క రోజులో 0.1-0.4 మి.లీ రక్తాన్ని పీలుస్తుంది. ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పురుగులు రోజులో 250 మి.లీ రక్తాన్ని పీలుస్తాయంటున్నారు. దాంతో రక్తం తగ్గిపోయి ఎనిమియా సంభవిస్తుంది.

Must Read

spot_img