Homeఅంతర్జాతీయంఅమెరికాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా..

అమెరికాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా..

ఆసియాలో ఉక్రెయిన్ తరహా సంక్షోభాన్ని పునరావృతం చేయాలని చూస్తే సహించేది లేదని చైనా హెచ్చరించింది. తైవాన్ అంశంలో చైనాను అణగదొక్కాలని చూస్తున్నట్లు అమెరికాపై మండిపడింది..

తైవాన్‌ అంశాన్ని ముందుకు తేవడం ద్వారా ఆసియాలో ఉక్రెయిన్‌ తరహా సంక్ష్షోభాన్ని పునరావృతం చేయాలని చూస్తే సహించేది లేదని చైనా హెచ్చరించింది. అమెరికా తన ప్రపంచాధిపత్యం కోసం ఉక్రెయిన్‌ను ఓ ప్రయోగశాలగా చేసుకుని యుద్ధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో చైనా ఈ హెచ్చరిక చేసింది. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై చైనా వైఖరిని పునరుద్ఘాటించారు. చైనా – రష్యా బంధం వల్ల ఏ దేశానికి ఎలాంటి ముప్పు ఉండబోదన్నారు. మూడవ పక్షంగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం
చేసుకోవడం, అసమ్మతిని ఎగదోయడం వంటి చర్యలకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. ప్రపంచానికి ద్రవ్యోల్బణం ఇప్పుడొక పెను ముప్పుగా పరిణమించిందని అన్నారు. పశ్చిమ దేశాలు తమ ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడాలని, ఈ విషయంలో ప్రజల వాణిని అవి చెవికెక్కించుకోవాలని కిన్ గాంగ్ హితవు పలికారు.

తైవాన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి లేదని మరోసారి ఉద్ఘాటించారు చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌… తైవాన్‌ అంశం చైనా అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రపంచ ప్రజానీకంపైతీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని, యూరప్‌లో సెక్యూరిటీ గవర్నెన్స్‌ పెరిగిపోతోందన్నారు. యుద్ధం కన్నా శాంతికి, ఆంక్షల కన్నా చర్చలకు, రెచ్చగొట్టే చర్యల కన్నా చర్చలకే తాము అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. చైనా దౌత్యంలో దయ, సుహృద్భావాలకు కొదవ లేదు, అయితే జిత్తులమారి నక్కలు, తోడేళ్లు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటితో ఘర్షణ
పడడం తప్ప చైనాకు మరో మార్గం లేదన్నారు. మాతృ భూమి రక్షణకు వారితో ముఖాముఖి తలపడక తప్పదని తేల్చి చెప్పారు కిన్ గాంగ్..

చైనా ఆధునీకీకరణ అంటే శాంతి, అభివృద్ధి, సహకారం, పరస్పర ప్రయోజనాలు, మానవాళికి ప్రకృతికి మధ్య సామరస్యత ద్వారా సాధించేదే తప్ప యుద్ధం, వలసాధిపత్యం, వనరులను కొల్లగొట్టడం వంటి వాటికి పాల్పడడం కాదని కిన్‌ గాంగ్‌ అమెరికానుద్దేశించి వ్యంగ్యంగా అన్నారు.

పశ్చిమ దేశాల ఆధునీకరణకు భిన్నమైన కొత్త పంథా తమది అని ఆయన చెప్పారు. బెల్ట్‌ అండ్‌ రోడ్డు ఇనిషియేటివ్‌ ఉన్నత ప్రమాణాలతో, మంచి ఉద్దేశంతో చేపట్టినదన్నారు. మిగిలిన భాగస్వాములనందరినీ కలుపుకుంటూ, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ప్రపంచంతో పంచుకుంటుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ జనాభాలో 80 శాతానికి, ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 70 శాతానికిపైగా ప్రాతినిధ్యం కలిగి వున్నాయని, కాబట్టి వర్థమాన దేశాల ప్రజలు మెరుగైన జీవితం కలిగివుంటే హక్కు ను కోరుకోవడం తప్పేమీ కాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో వర్థమాన దేశాలు తమ వాణిని గట్టిగా వినిపించే అవకాశం ఉండాలని, తగిన ప్రాతినిధ్యం కూడా ఉండాల్సిన అవసరముందన్నారు కిన్ గాంగ్..

ఇండో-పసిఫిక్‌ వ్యూహం ద్వారా ‘చైనాను ముట్టించడానికి’ అమెరికా ప్రయత్నిస్తోందని కిన్‌ గాంగ్‌ విమర్శించారు. ”ప్రత్యేకమైన బ్లాక్‌లను ఏర్పాటు చేసి, ఘర్షణలను రెచ్చగొట్టి, ప్రాంతీయ సమగ్రతకు విఘాతం కలిగించాలన్నదే అమెరికా అనుసరించే ఇండో-పసిఫిక్‌ వ్యూహం లక్ష్యం.” అని అన్నారు. ”ప్రాంతీయ భద్రతను పరిరక్షించేందుకే ఇండో-పసిఫిక్‌ వ్యూహం అని వారు చెబుతున్నారు, కానీ, వాస్తవానికి, ఆ వ్యూహం ఘర్షణలను రెచ్చగొడుతోంది. నాటోకు ఆసియా-పసిఫిక్‌ వర్షన్‌ను సృష్టించాలని భావిస్తోంది.” క్వాడ్‌,అకస్‌ గ్రూపులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎన్‌పిసి సమావేశాల సందర్భంగా ప్రతినిధి
బృందాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన ప్రసంగంలో అమెరికాను నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. చైనాను అన్ని విధాలుగా అదుపు చేయాలని, అణగదొక్కాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.. భారత్‌తో సంబంధాలపై కిన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న చైనా విధానం అసలు ఉద్దేశం తమను అన్ని రంగాల్లో అణగదొక్కాలన్నదేనని విమర్శించారు.

2021 నాటికి, యునైటెడ్ స్టేట్స్, చైనాలు వరుసగా ప్రపంచంలో అతిపెద్ద, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి,..

అయితే కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా కొలవబడినప్పుడు చైనా పెద్ద స్థూల దేశీయ ఉత్పత్తిని కలిగి ఉంది.. చారిత్రాత్మకంగా, కొరియన్ యుద్ధం, వియత్నాం యుద్ధం సమయంలో కొన్ని బహిరంగ సంఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం, యునైటెడ్ స్టేట్స్, చైనాలు అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడం వంటి పరస్పర రాజకీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.. అయితే తైవాన్‌తో చైనా సంబంధాలకు సంబంధించి పరిష్కరించని ఆందోళనలు ఉన్నాయి. వన్ చైనా పాలసీని, చైనాలో ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పాత్రను, చైనాలో మానవ హక్కులను యుఎస్ అంగీకరిస్తుందా లేదా అనేది తెలియదు.. జపాన్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ యొక్క రెండవ అతిపెద్ద విదేశీ రుణదాత చైనా. దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక సమస్యలపై రెండు దేశాలు వివాదంలో ఉన్నాయి.. చైనా వాస్తవంగా మొత్తం దక్షిణ చైనా సముద్రంపై సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేస్తుంది.. అయితే యునైటెడ్ స్టేట్స్ దానిని అంతర్జాతీయ జలాలుగా చూస్తుంది.. అలాగే ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు తన యుద్ధనౌకలు, విమానాల హక్కును నొక్కి చెప్పింది.

1845 వాంగ్జియా ఒప్పందం వరకు చైనాతో సంబంధాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 1900 తర్వాత ఓపెన్ డోర్ పాలసీని ప్రోత్సహించడం ద్వారా బయటి శక్తుల ప్రభావ గోళాలను అమెరికా వ్యతిరేకించింది. ఇది అమెరికన్ ఆర్థిక శక్తి చైనీస్ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించడానికి.. ఇతర విదేశీ పోటీదారులను తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుందని విశ్వసించింది. ఇది బాక్సర్ తిరుగుబాటును అణచివేయడంలో ఇతర విదేశీ శక్తులతో కలిసింది. చైనీస్ రైల్వేలలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికన్ బ్యాంకులను ప్రోత్సహించడానికి వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు 1900లలో విఫలమయ్యాయి. అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ 1938 తర్వాత జపాన్‌కు వ్యతిరేకంగా చైనాకు మద్దతు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పసిఫిక్ యుద్ధం సమయంలో యూఎస్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో మిత్రపక్షంగా ఉంది.

జపాన్‌కు వ్యతిరేకంగా 1945-1947లో నేషనలిస్ట్ ప్రభుత్వం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య రాజీకి వాషింగ్టన్ ప్రయత్నించి విఫలమైంది.

చైనా అంతర్యుద్ధం సమయంలో మెయిన్‌ల్యాండ్ చైనాలో మావో జెడాంగ్ యొక్క CCP విజయం తర్వాత, సంబంధాలు దెబ్బతిన్నాయి. కొరియా యుద్ధ సమయంలో అమెరికా, చైనాలు పరస్పరం పోరాడాయి. తైవాన్‌ను చైనా చట్టబద్ధమైన ప్రభుత్వంగా పరిపాలిస్తున్న రిపబ్లిక్ ఆఫ్ చైనాను.. యూఎస్ గుర్తించడం కొనసాగించింది.. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1972 చైనా పర్యటన వరకు ఐక్యరాజ్యసమితిలో PRC సభ్యత్వాన్ని నిరోధించింది. ఊహించని విధంగా తారుమారైంది. జనవరి 1, 1979న, యూఎస్ పీఆర్సీ తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. దానిని చైనా యొక్క ఏకైక చట్టబద్ధమైన ప్రభుత్వంగా
గుర్తించింది.. అదే సమయంలో, తైవాన్ సంబంధాల చట్టం యొక్క చట్రంలో తైవాన్‌ తో అనధికారిక సంబంధాలను కొనసాగించింది. తైవాన్ రాజకీయ స్థితి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ప్రధాన మూలంగా కొనసాగుతోంది.

తైవాన్ విషయంలో జోక్యం చేసుకోకూడదంటూ అమెరికాను గట్టిగానే హెచ్చరించింది చైనా.. తైవాన్ వివాదంపై ఆసియాలో మరో సంక్షోభానికి దారితీసేలా చేయవద్దంటూ అగ్రరాజ్యానికి చురకలంటించింది డ్రాగన్ కంట్రీ.
……………………………………….

Must Read

spot_img