Homeఅంతర్జాతీయంతైవాన్ కు అండగా అమెరికా.. చైనాకు షాక్

తైవాన్ కు అండగా అమెరికా.. చైనాకు షాక్

చైనా ఏ క్షణమైనా తమ భూభాగంలోకి చొరబడే ప్రమాదం ఉందని తైవాన్ రక్షణ మంత్రి చూ- కూ- చెంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలసంధి సమీపంలో ఘర్షణ వాతావరణంతో ఈ పరిస్థితి నెలకొన్న వేళ తైవాన్ చుట్టుపక్కల ఇటీవల కాలంలో చైనా ఆర్మీ కదలికలు బాగా పెరిగాయి. దీంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంచలన వ్యాఖ్యలు సాక్షాత్తూ తైవాన్ రక్షణ మంత్రి చేయడంతో అవి ప్రపంచవ్యాప్తంగా సంచలనం స్రుస్టించాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుధ్దంతో ప్రపంచం ట్రిలియన్ల కొద్దీ సంపద నష్టపోయింది. అదే సమయంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుందోనన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తైవాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరేలా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. చైనా విమానాలు సైతం రోజు వారీగా తైవాన్ సమీపంలోకి వస్తుండటంతో ఆందోళన నెలకొంది.

తైవాన్ సమీపంలోని జలాలు, గగనతలంలోకి రావడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సాకులు వెతుకుతుందంటున్నారు తైవాన్ రక్షణ మంత్రి.. ఇటీవల తైవాన్ – అమెరికా సైనిక సహకారం పెరగడం కూడా ఇందుకు కారణమన్నారు. చైనా ఆర్మీ ఏ క్షణమైనా తైవాన్ భూభాగంలోకి చేరవచ్చన్నారు. చైనా సన్నాహాలు చూస్తే కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అయితే చైనా తమ భూభాగంలోకి వస్తే ఊపేక్షించబోమని ఖచ్చితంగా ఎదురుదాడికి దిగుతామని తైవాన్ స్పష్టం చేసింది. చైనా ప్రీమియర్ లీక్వికియాంగ్ ఆదివారం మాట్లాడుతూ.. తైవాన్ తో సంబంధాలను తాము ప్రమోట్ చేస్తూనే.. శాంతియుత వీలినాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. అదే సమయంలో తైవాన్ స్వాతంత్యాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఈ మాటలు చైనాపై తైవాన్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఉండటంతో ఏం కాబోతుందోనన్న ఆందోళన నెలకొంది.

ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 7.2 శాతం పెరిగింది. వరసగా ఎనిమిదో ఏడాది కూడా సింగిల్‌ డిజెట్‌ పెరుగుదల నమోదవుతూ వస్తోంది.

దీని ప్రకారం ఏడాది చైనా రక్షణ బడ్జెట్‌ 1.5537 ట్రిలియన్‌ యాన్‌లు అంటే..సుమారు 224.79 బిలియన్ల అమెరికా డాలర్లన్నమాట. ఈ ముసాయిదా బడ్జెట్‌ను ప్రస్తుతం జరుగుతున్న చైనా జాతీయ లెజిస్లేటర్‌ సమావేశాల్లో ఆదివారం ప్రవేశపెట్టారు. ఏది ఏమైనా…అమెరికా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్‌ నాలుగింట ఒక వంతు మాత్రమే. ఈ ఏడాది అమెరికా రక్షణ బడ్జెట్‌ దాదాపు 858 బిలియన్ల అమెరికా డాలర్లుగా ఉంది. తలసరిఆదాయం పరంగా చూస్తే అమెరికా చేస్తున్న రక్షణ వ్యయంలో పదహారవ వంతుగా మాత్రమే చైనా రక్షణ వ్యయం ఉంటుంది. చైనా రక్షణ బడ్జెట్‌ పెంపు ‘సముచితమైనది, సహేతుకమైనది’ అని 14వ నేషనల్‌ పీపుల్స్‌్‌ కాంగ్రెస్‌ మొదటి సెషన్‌ ప్రతినిధి వాంగ్‌ చావో తెలిపారు.

సంక్లిష్టమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొవడానికి, చైనా తన ప్రధాన బాధ్యతలను నెరవేర్చడానికి ఈ పెంపు అవసరమని అన్నారు. రక్షణవ్యయాన్ని ఎంత పెంచినా.. సాయుధ బలగాలను ఎంత ఆధునీకరించినా.. చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని, విస్తరణను, తన ప్రభావాన్ని పెంచడాన్ని కోరుకోదని చెప్పారు. సుమారు 800 విదేశీ సైనిక స్థావరాలు, 159 దేశాల్లో 1,73,000 సైనికులను మోహరించిన అమెరికాకు విరుద్ధమైన విధానాన్ని చైనా అనుసరిస్తుందని అన్నారు. చైనా రక్షణ వ్యయం బహిరంగంగా, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. ఐక్యరాజ్య సమితికి ప్రతీ ఏడాది చైనా తన సైనిక ఖర్చులపై నివేదికలను సమర్పిస్తోందని తెపారు. ‘చైనా భవిష్యత్‌ మొత్తం ప్రపంచంతో ముడిపడి ఉంది. చైనా సైనిక ఆధునీకరణ ఏ దేశానికి ముప్పు కలిగించదు. ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శాంతిని రక్షించడానికి సానుకూల శక్తిగా మాత్రమే చైనా ఉంటుంది’ అని వాంగ్‌ చెప్పారు. ఇది చైనా బయటకు చెబుతున్న మాటలు మాత్రమే..లోలోపల డ్రాగన్ బుద్ది డ్రాగన్ ఆలోచనలు డిఫరెంటుగా ఉంటాయి.

నిజానికి అమెరికాను కాస్త పక్కన బెడితే.. చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచిందనే చెబుతున్నారు నిపుణులు.. ఇలా సైనిక వ్యయాన్ని పెంచడం వరుసగా ఇది ఎనిమిదోసారి. గతేడాది రక్షణ బడ్జెట్‌కు 1.45 ట్రిలియన్స్‌ యువాన్లు కేటాయించింది. అయితే, యువాన్‌తో పోలిస్తే డాలర్‌ విలువ పెరిగిన దృష్ట్యా డ్రాగన్‌ దేశం ఈ ఏడాది రక్షణ వ్యవయాన్ని 224 బిలియన్‌ డాలర్లకు పెంచినట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే, చైనా ఆర్థిక వృద్ధిరేటు కంటే రక్షణ రంగం బడ్జెట్‌ అధికంగా ఉండడం గమనించదగ్గ విషయం అంటున్నారు నిపుణులు. 2027 పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లక్ష్యాలపై దృష్టి సారించిన చైనా.. సాయుధ దళాలు, సైనిక కార్యకలాపాలను నిర్వహించేందుకు, సంసిద్ధతను పెంచేందుకు, సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పని చేయాలని ప్రీమియర్‌ లి క్వికియాంగ్‌ పిలుపునిచ్చారు.

సాయుధ దళాలు బోర్డు అంతటా సైనిక శిక్షణ, సంసిద్ధతను తీవ్రతరం చేయాలని, కొత్త సైనిక వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అభివృద్ధి చేయాలని, పోరాట పరిస్థితులలో శిక్షణ కోసం ఎక్కువ శక్తిని వెచ్చించాలి, అన్ని దిశలు, డొమైన్‌లలో సైనిక బలగాలను బలోపేతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలి అని జాతినుద్దేశించి ప్రసంగంలో లీ సూచించారు. పీపుల్స్‌ లిబరేషన్‌ హైకమాండ్‌ అయిన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌గా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ నాయకత్వం వహిస్తున్నారు. జిన్‌పింగ్‌ నాయకత్వంలో చైనా సైన్యం రాబోయే కొద్ది సంవత్సరాల్లో అమెరికా సాయుధ దళాలతో సమానంగా ఉండాలనే లక్ష్యంతో భారీగా సైనిక ఆధునికీకరణను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల తైవాల్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై చైనా కలవరానికి గురవుతున్నది. తైవాన్‌ జలసంధిలో అగ్రరాజ్య నౌకాదళం, వాయుసేనలు గస్తీలను ముమ్మరం చేయడం ఇబ్బందికరంగా చైనా భావిస్తోంది.

గతేడాది ఆగస్టులో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ ఫెలోసీ తైవాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ పర్యటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చైనా తైవాన్‌కు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. అయితే చైనాను రెచ్చగొట్టే విషయంలో అమెరికా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. చైనా స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రపంచదేశాలను హెచ్చరించడం చేస్తుంటుంది. చైనా ఏ దేశంపైన కుట్ర చేసినా చేయాలని తలచుకున్నా అది అమెరికాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. అందుకే తైవాన్ విషయంలో అమెరికా పెద్దన్న పాత్ర పోశిస్తోంది.

అంతే కాదు..ఆసియాలోని పలు దేశాలను తమ మిత్ర దేశాలుగా ప్రకటిస్తూ చైనాకు ధీటుగా పావులు కదుపుతోంది. తైవాన్ పైన, జపాన్ పైన చైనా నుంచి ఏ తప్పు జరిగినా వెంటనే తానున్నానంటూ ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో తైవాన్ సముద్రతీరాల్లో అమెరికా యుధ్ధనౌకల సంచారం పెరిగింది. ఉపగ్రహాలతో నిఘా వేస్తూ చైనా చేయబోయే కుట్రలను తెలుసుకుంటూ తైవాన్ ను అలర్ట్ చేస్తూ వస్తోంది. ఆర్థికంగా ఆయుధపరంగా తైవాన్ ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు జో బైడెన్. ఈ రెండు మూడు నెలలలో అమెరికా ప్రతినిధులు వరుసగా తైవాన్ విజిట్ చేస్తూన్నారు. అది చైనాకు కంటగింపుగా మారింది. పైగా తైవాన్ జపాన్ దేశాలతో కలసి సైనిక విన్యాసాలు జరుపుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని సమాచారం. పలు పరిశ్రమలు దేశం దాటిపోతున్నాయి. సంపన్నులంతా చైనాను వీడి ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ పై యుధ్దానికి దిగిన రష్యాకు ఏం జరిగిందో చూసిన చైనా తైవాన్ పై యుధ్దానికి దిగకపోవచ్చని అంటున్నారు.

శాంతి పూరిత విలీనానినే చైనా ఎంచుకుంటే సైతం తైవాన్ అందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ యుధ్దమంటూ వస్తే అది రాకుండా అమెరికా అడ్డు పడుతుందా లేక తానే స్వయంగా రంగంలోకి దిగుతుందా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

Must Read

spot_img