Homeఅంతర్జాతీయంఅమెరికా మరోసారి సైక్లోన్ దాడికి గురైంది..

అమెరికా మరోసారి సైక్లోన్ దాడికి గురైంది..

అమెరికా మరోసారి సైక్లోన్ దాడికి గురైంది. పవర్ ఫుల్ విండ్స్ బుధవారం అమెరికాను బలంగా తాకాయి. దీంతో వేలాది ఇళ్లలో కరెంటు నిలిచిపోయింది. వేలాది విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. పెద్దగా అవసరం లేనట్టయితే ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. తప్పనిసరైతే పూర్తి సరంజామాతో బయలు దేరాలని సూచించింది…

అత్యంత శక్తివంతమైన శీతాకాలపు తుఫాను గాలులు బుధవారం అమెరికాను తాకాయి. అగ్రరాజ్యం అమెరికా మరోసారి శీతాకాలపు మంచుతుపాను గుప్పిట్లో చిక్కుకుంది. మంచు తుఫానులు వెస్ట్ కోస్ట్ నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా రెండు అడుగుల వరకు మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వేలాది ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లాస్ఏంజెల్స్ సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. మిన్నెసోటాలో పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రహదారులపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది.

తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే, అత్యవసర పరిస్థితుల్లో మీ వాహనంలో అదనపు ఫ్లాష్‌లైట్, ఆహారం, నీరు ఉంచండి. ప్రయాణం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి. మీరు తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే, మీతో శీతాకాలపు మనుగడ కిట్‌ని కలిగి ఉండండి. మీరు ఒంటరిగా ఉంటే, మీ వాహనంతో ఉండండి.” అని సూచించింది. డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ. మిన్నియాపాలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్‌లలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో గురువారం ఉదయం నాటికి 1500కు పైగా విమానాలు రద్దయ్యాయి. వ్యోమింగ్‌లో ప్రధాన రహదారులపై కూడా అడుగుల మేర మంచు ఉండడంతో ప్రయాణాలు సాగించడం చాలా ప్రమాదకరంగా మారింది. “మీరు వ్యోమింగ్ వైపు వస్తున్నట్లయితే దయచేసి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోండి” అని రాష్ట్ర రవాణా శాఖ హెచ్చరించింది.

వ్యోమింగ్ అంతటా రహదారులపై మంచు ఉండడంతో చాలా రోజుల పాటు ఆ రహదారులను మూసే అవకాశం కూడా ఉంది.

దాదాపు 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. వాటిలో దాదాపు సగం మిచిగాన్‌లోనే ఉండడం గమనార్హం. ప్రమాదకర శీతాకాలపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఒకవైపు అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలితో వణుకుతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒహైయో వ్యాలీ, మధ్య అట్లాంటిక్‌లలో సగటు కంటే 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.

గత సంవత్సరం డిసెంబరు నెలలో అమెరికాను కుదిపేసిన ‘బాంబ్ సైక్లోన్’ చూస్తే వాతావరణ వైపరీత్యాల యుగం మొదలైందనే అనిపించింది..అప్పట్లో మంచుతుపాను కారణంగా చాలా మంది మరణించారు. ఇళ్ల చుట్టూ కొండలా పేరుకుపోతున్న మంచుతో జనం నానా అవస్థలు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటూ గడిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు ధారాళంగా కురవడంతో దారిలో నిలిచిపోయి చలికి గడ్డకట్టుకుని చనిపోయినవారు లెక్కకు మించి ఉన్నట్టుగా సమాచారం. తుపాను వచ్చినప్పుడు దాని వాతావరణ పీడనం కనిష్ఠ స్థాయికి పడిపోతే ఆ తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వ్యవహరిస్తారు. గ్రేట్‌లేక్స్ ప్రాంతంలో ఇది ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.

ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నట్టు సమాచారం. అమెరికాలోని పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్రమైన మంచు తుఫాను ప్రభావం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు యునైటెడ్ స్టేట్స్ లోపల, వెలుపల మొత్తం 1327 విమానాలు రద్దు చేశారు. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం, USలో 2,030 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. గత నెలలో కూడా అమెరికాలో మంచు తుపాను కారణంగా చాలా రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం గంటకు రెండు అంగుళాల వరకు మంచు కురుస్తుంది. బలమైన గాలులు ఉత్తర మైదానాలు, ఎగువ మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రయాణ పరిస్థితులను ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపింది.

Must Read

spot_img