Homeఅంతర్జాతీయంరష్యాతో యుద్ధానికి దిగితే... ప్రపంచ యుద్ధమేనా?

రష్యాతో యుద్ధానికి దిగితే… ప్రపంచ యుద్ధమేనా?

ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా.. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే చైనాకు ఏ మాత్రం తీసిపోదు.. ఆ దేశ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది.. ఎవరినైనా ఎదిరిస్తుంది.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై బాంబులు వేసి ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో ప్రపంచానికి తెలుసు.. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్, ఇప్పుడు బైడెన్… అధ్యక్షులు మాత్రమే మారారు. అమెరికా సామ్రాజ్యవాదం మారలేదు. పైగా కొత్త చివుళ్ళు తొడుక్కుంటున్నది.

నాటో దేశాల సభ్యత్వంలో చేరేందుకు ఉక్రెయిన్ మొగ్గు చూపుతున్న రోజులవి. బెలారస్ వంటి దేశంపై యుద్ధం చేసి రష్యా గెలిచిన రోజులు కూడా అవే. కానీ వెనుక ఉన్న నాటో దేశాలు ఉక్రెయిన్ ను ఎగదోశాయి. ఈ పన్నాగం తెలియని బెలేన్ స్కీ తాడో పేడో అనే సంకేతాలు ఇచ్చాడు. ఒళ్ళు మండిన పుతిన్ యుద్ధానికి సిద్ధమన్నాడు. అలా ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కీలకమైన కీవ్, మరియా పోల్ రష్యా సొంతమయ్యాయి. ఇప్పటికీ భీకరమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇవి ఎంతవరకు దారితీస్తాయో తెలియదు కానీ…పుతిన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. మరోవైపు నాటో దేశాలు కూడా యుద్ధాన్ని విరమించేలా చేయడం లేదు.. దీంతో పరిస్థితి నానాటికి చేయిదాటిపోతున్నది.. ఇదే సమయంలో జపాన్ సరిహద్దుల్లో అటు రష్యా, ఇటు చైనా, ఉత్తర కొరియా దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో జపాన్ కూడా శాంతి మంత్రాన్ని పక్కనపెట్టి సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తన దేశ జీడీపీలో రెండు శాతం ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితులు మొత్తం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందేమో అనే భయాలు కలుగుతున్నాయి.

రెండు దేశాల మధ్య యుద్దం కాస్తా మూడో ప్రపంచ యుద్దంగా మారనుందా…?

ఆ మధ్య అమెరికా ఇరాన్, ఇరాక్ పై యుద్ధాలు చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ రెండు దేశాల్లో చమరు నిల్వలు విస్తారంగా ఉంటాయి.. వాటిని చవకగా పొందేందుకు అమెరికా అనేక కుయుక్తులు పన్నింది. దీనికి ఆ దేశాలు ఒప్పుకోలేదు. దీంతో అమెరికా ఆ దేశాలపై యుద్ధం ప్రకటించింది. తనకు తొత్తులుగా ఉండే వ్యక్తులను దేశ అధ్యక్షులను చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ.. కూడా ముస్లిం దేశాలు అమెరికాను ప్రతిఘటించకపోవడం ఆశ్చర్యకర విషయమే… అయితే ప్రస్తుతం అమెరికా లాగానే సమాంతర శక్తిగా రష్యా ఎదుగుతున్నది.. ఇది ఎలాగైనా తనకు ప్రమాదమేనని భావించిన అమెరికా.. ఉక్రెయిన్ ను అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అమెరికా… ఇప్పుడు హఠాత్తుగా రంగంలోకి దూకడం వెనక కారణం ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రస్తుతం ప్రపంచం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో… మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే ఈ భూమి మీద మనిషి మనగడే ఉండదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఇటీవల పాకిస్తాన్ మంత్రి మా వద్ద అణు బాంబు ఉందని హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే… మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా, ఉక్రెయిన్‌ స్థితిగతులపై అపార అవగాహన ఉన్న దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.. పటిష్ఠమైన సైనిక బలగం, అపార అణ్వాయుధ సంపత్తి కలిగిన రష్యాతో యుద్ధానికి దిగితే తీవ్ర పరిణామాలకు దారి తీసేదని.. అందుకే కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడానికే అమెరికా సహా నాటో దేశాలు పరిమితమయ్యాయి… 24 ఫిబ్రవరి 2022న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేటీకి కొనసాగుతూ ప్రమాదకర స్థాయికి చేరుకుంది..

యుద్ధంతో ఆ ప్రాంత పర్యావరణ విధ్వంసం, పేదల శ్రమ దోపిడీ, ఆర్థిక కుదుపులు, సరుకుల ధరల పెరుగుదల ఆహార ధాన్యాల కొరత ఎక్కువయ్యింది. రష్యా చమురును వ్యతిరేకిస్తూ అమెరికా, యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించడంతో రష్యా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రష్యా కరెన్సీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు దాదాపు 66 శాతం ముడి చమురును అమ్ముకోలేని దుస్థితికి చేరింది. రోజు రోజుకూ పరిస్థితులు విషమించి, మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి.

పుతిన్ చేతులలో అణ్వాయుధాల విన్యాసాలు జోరందుకున్నాయి. ఉక్రెయిన్‌‌లో ఉత్పత్తి రంగం కుంటుపడడం, వ్యవసాయం మూలకు పడడం, శ్రామికులు బజారున పడడం, పరిశ్రమలు ధ్వంసం కావడం, రవాణాకు ఆటంకాలు కలగడం లాంటి సమస్యలు వెంటాడుతున్నాయి.. ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి రెండు దేశాలకు మద్దతిస్తున్నాయి. ఈ సుదీర్ఘ యుద్ధం వలన ప్రపంచంలోని సుమారు 1.6 బిలియన్ ప్రజలు జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తున్నది. దాదాపు 1.2 బిలియన్ మంది ప్రజలు ఆహారం, ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ఉక్రెయిన్‌ వాసులు దేశం వదిలి పోతున్నారు. పలు దేశాల సామాన్య జనులు ఆహార కొరత, నీటి ఎద్దడి, ఆరోగ్య వసతుల లేమి వంటి సమస్యలలో చిక్కుకున్నారు ఉక్రెయిన్ నుంచి దిగుమతి తగ్గడంతో పలు దేశాలు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఉక్రెయిన్ పౌరులకు హాని కలగడమే కాకుండా, అసంఖ్యాక సామాన్య జనం అత్యవసరాలకు దూరం అయ్యారు. ఈ యుద్ధంతో ఆరు మిలియన్‌ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. 13 వేల మంది పౌరులు గాయపడటంతో పాటు ఐదున్నర వేల మంది ఉక్రెనియన్లు మరణించి ఉంటారని అంచనా.. ఆగస్టు 2022 నాటికి ఉక్రెయిన్‌ వాసులు సుమారు 6.6 మిలియన్‌ల మంది నిర్వాసితులుగా మారి పోలాండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా, మోల్డోవా వంటి యూరప్ దేశాలకు వలస వెళ్లారు.యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సముద్ర, గగనతల రవాణా ఎగుమతులు ఆగిపోయి… 400 మిలియన్‌ ప్రజలు ఆకలి కేకలతో కాలం గడుపుతున్నారు. ఈస్ట్‌ ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, సెంట్రల్‌ అమెరికా దేశాలు యుద్ధం మూలంగా కరువును ఎదుర్కొంటున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని పుతిన్ ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ యుద్ధాన్ని గనక ఆపితే రష్యా పరువు పోతుంది. అమెరికా లాంటి దేశాలు చులకనగా చూస్తాయి. దీనికి తోడు యూరప్, మధ్య ఆసియా దేశాలపై రష్యా పట్టు తగ్గుతుంది.. మరోవైపు కీలక నగరాలను ఆక్రమిస్తున్న రష్యా బలగాలు…తాము పూర్తిగా ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకున్నాకే దేశాన్ని విడిచి వెళ్తామని అంతర్గతంగా చెబుతున్నారు..

ఈ పరిస్థితులు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నాయి. రేపు ఏదైనా జరగరానిది జరిగితే చమరు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పుడు వర్ధమాన దేశాల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది.. బెంజిమెన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు మంచి యుద్ధం… చెడ్డ శాంతి ఉండవు.. వీటిని అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎంత త్వరగా గుర్తిస్తే ప్రపంచానికి అంత మంచిది.

ఎంత నష్టం జరిగినా.. పరువు పోకూడదనే కారణంతో రష్యా.. నాటో సహా అమెరికా దేశాల సహాయంతో ఉక్రెయిన్ లు యుద్దాన్ని కొనసాగిస్తున్నారు.. ఇందులోకి అమెరికా ప్రవేశించడంతో భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్దం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి..

Must Read

spot_img