Homeఆంధ్ర ప్రదేశ్పవన్ పై పోటీకి ఆలీ సై అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందా..?

పవన్ పై పోటీకి ఆలీ సై అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందా..?

ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, ప్రముఖ హస్యనటుడు ఆలీ సంచలన వ్రకటన చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి తాను సిద్దమని ఆలీ పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేస్తానని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం రాజకీయాల్లో సాధారణమని అన్నారు. ఇండస్ట్రీ పరంగా పవన్ తనకు మంచి స్నేహితుడని, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని అన్నారు ఆలీ. మంచి చేసే వారినే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోజాను పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అంటూ విమర్శించడంపై వ్యాఖ్యానిస్తూ నిజంగా రోజమ్మ కోహినూర్ డైమండ్ తో సమానమని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన సందర్భంలో ఆలీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో చేరి ప్రచారంలో పాల్గొన్న ఆలీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ తో నాడు భేటీ కావడంతో ఆలీ జనసేనలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా వైసీపీ లో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి ఏదైనా నామినేటేడ్ పదవి ఖాయమని అనుకున్నారు. వాస్తవానికి ఆలీ గుంటూరు జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాలని ఆయన ఆకాంక్షగా ఉంది. ఓ టీవీ కార్యక్రమంలో తన మనసులో మాట ఎన్నికలకు ముందు చెప్పారు
అలీ. అయితే వైసీపీలో ఆయన ఎన్నికల ప్రచారానికే పరిమితం అయ్యారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అంటూ పలు పదవులు ఆలీకి వరిస్తాయంటూ ప్రచారం జరిగింది. కానీ చివరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. అయితే తాజాగా ఆలీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ ఆదేశిస్తే ఒక్క పవన్ పైనే కాదని.. ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధమని ప్రకటించారు. పవన్ కల్యాణ్ తనకు మిత్రుడే అయినా.. రాజకీయం వేరు.. ఫ్రెండ్ షిప్ వేరని అలీ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

రాజకీయాలపై ఆసక్తితో గత ఎన్నికలకు ముందు ఏదో ఓ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్న అలీ తెలుగుదేశం, వైసీపీతో పాటు జనసేన పార్టీతోనూ సంప్రదింపులు జరిపారు. పవన్ కల్యాణ్ .. అలీ మంచి మిత్రులు కావడంతో జనసేనలో చేరుతారని ఎక్కువ మంది అనుకున్నారు. కానీ అలీ మాత్రం అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేయడం వివాదాస్పదమయింది.

రాజకీయ విమర్శలు దాటి వైసీపీ మార్క్ విమర్శలు చేయడంతో పవన్ కు.. అలీ మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఆ తర్వాత పవన్, అలీ ఎప్పుడూ కలిసి కనిపించలేదు. ఇటీవల అలీ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆ వేడుకకు కూడ పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. అయితే తమ మధ్య గ్యాప్ లేదని.. పవన్ కల్యాణ్ తన మిత్రుడేనని అలీ చెబుతూ ఉంటారు. రాజకీయం.. స్నేహం వేరని అంటున్నారు. అయితే పవన్ ను అలీ చాలా తక్కువ చేసి మాట్లాడారని.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటారు.

ఆయన తీరుపై పవన్ కూడా నొచ్చుకున్నారని.. రాజకీయంగా అలీ నిర్ణయాన్ని ప్రభావితం చేయాలని కానీ..తన పార్టీలో చేరాలని కానీ ఎవర్నీ పవన్ ఎప్పుడూ ఆహ్వానించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే రాజకీయంగా విమర్శలు చేస్తే తప్పు లేదు కానీ పవన్ విషయంలో అలీ చేసిన విమర్శలు హద్దులు దాటాయని పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఆలీ .. పవన్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా, అక్కడ ఆయనపై వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానన్నారు. అయితే పవన్ ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా, ఆ లిస్ట్ లో.. ఆయన గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు ఉంటాయా.. లేక ఆయన కొత్తగా ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.

అలీ ఉత్సాహం చూసి ఆయనకు పవన్ పై పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధినేత జగన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.టీడీపీ, జనసేన, బీజేపీ.. కలసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా పెద్దగా తేడా ఉండదని, విజయం వైసీపీది అయినప్పుడు ప్రతిపక్షాలు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అని అన్నారు అలీ. ఏపీకి ఎవరు ఎలాంటి మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు అలీ. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు. కారణం ఏదైనా పవన్ కల్యాణ్, అలీల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై ఒక్క సారిగా విమర్శల దాడి చేస్తున్న సమయంలో.. అలా అలీ.. పవన్ పై పోటీ ప్రకటన చేయడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఒక వేళ పవన్ కు గట్టి పోటీ ఇచ్చేది అలీ అని భావిస్తే.. జగన్ ఆదేశించడానికి వైసీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అసలు అలీకి ఈసారి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు లేవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వచ్చే ఎన్నికల కోసం టిక్కెట్ల కసరత్తు ఎప్పుడో ప్రారంభించారని… అలీకి ఎక్కడైనా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే.. ఆయనను నియోజకవర్గంలో పని చేసుకోమని సూచించేవారని అంటున్నారు.

టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. ఆయనకు ఇటీవల సలహాదారు పదవి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు అలీ ప్రకటనతో .. పవన్ కల్యాణ్ పై పోటీకి అలీని వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తుందేమో చూడాలని చర్చలు సాగుతున్నాయి. గతేడాది అక్టోబర్ లో అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించింది. 2 ఏళ్ల పాటు అలీ ఈ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనీ అలీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన పవన్ పై
వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అలీ వ్యాఖ్య‌ల వెనుక జ‌గ‌న్ వ్యూహం ఉందా ?
సినిమా రంగం నుంచి ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేసేవారు చాలా అరుదు. అలీ కూడ విమ‌ర్శ‌లు చేసే ర‌కం కాదు. అలాంటి అలీతో ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయించ‌డం వెనుక వైసీపీ దురుద్దేశ్యం ఉంద‌ని జ‌న‌సేన భావిస్తోంది. ఇటీవ‌ల ప‌వ‌న్ వైసీపీపై విరుచుకుప‌డుతున్నారు. ప‌వ‌న్ పై వైసీపీ మంత్రుల‌తో విమ‌ర్శ‌లు చేయిస్తోంది. మ‌రో అడుగు ముంద‌ుకేసి ప‌వ‌న్ కు సన్నిహితంగా ఉండే అలీతో విమ‌ర్శ‌లు చేయించ‌డం వెనుక వైసీపీ రాజ‌కీయ ప్ర‌యోజనం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

జ‌న‌సేన‌, టీడీపీ పొత్తులు, వేగంగా మారుతున్న ఏపీ రాజ‌కీయాల్లో అలీ వ్యాఖ్య‌లు దుమారం రేపాయ‌ని చెప్పొచ్చు. అయితే ఈ వ్యూహం వెనుక ఆలీకి టిక్కెట్ ఇచ్చే అవకాశముందా అన్న చర్చ సైతం వెల్లువెత్తుతోంది. మరోవైపు .. ఆలీ సైతం టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నవేళ .. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఈ వ్యూహం ఎంతవరకు వాస్తవమన్న వాదన పక్కన పెడితే, ఆలీకి టిక్కెట్ ఇచ్చే అవకాశముంటే, పదవి ఎందుకిచ్చారన్న చర్చ కూడా వెల్లువెత్తుతోంది.

Must Read

spot_img