Homeజాతీయంఅమ్మకానికి ఎయిరిండియా - కొనుగోలుకు టాటా

అమ్మకానికి ఎయిరిండియా – కొనుగోలుకు టాటా

ఎయిరిండియా.. మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా 500 విమానాల కొనుగోలుకు టాటా గ్రూప్
సిద్ధమైందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిరిండియా .. ఏకంగా 500 విమానాలు .. కొనుగోలు .. వార్త దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఆయా సంస్థలు ఏ ప్రకటన చేయకున్నా.. ఎయిరిండియా పూర్వ వైభవం సాధించగలదన్న అభిప్రాయం మాత్రం వెల్లువెత్తుతోంది.

ఏకంగా 500 విమానాల కొనుగోలుకు టాటా గ్రూప్ సిద్ధం..

టాటా స‌న్స్ ఆధీనంలోని ఎయిరిండియా చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎయిర్‌బ‌స్‌, బోయింగ్ సంస్థ‌ల నుంచి 500 విమానాల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వీటిల్లో ఎయిర్‌బ‌స్ ఏ350, బోయింగ్ 787 & 777 విమానాలు కూడా ఉన్నాయి. త‌ద్వారా మ‌హారాజాకు పూర్వ వైభ‌వం తేవాల‌ని టాటా స‌న్స్ ఉవ్విళ్లూరుతున్న‌ట్లు వినికిడి. 400 నారో వైడ్‌,100 అంత కంటే మోర్ వైడ్‌ విమానాల కోసం ఆర్డ‌ర్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ విమానాల కొనుగోలు కోసం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలతో ఎయిరిండియా ఒప్పందంపై సంతకాలు చేయనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. వీటిలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 150 ఉన్నాయ‌ని స‌మాచారం. 500 విమానాల విలువ 100 బిలియ‌న్ డాల‌ర్లు అని ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న వ‌ర్గాలు తెలిపాయి. ఇంత భారీ మొత్తంలో ఒక ఎయిర్‌లైన‌ర్ విమానాలు కొనుగోలు చేయ‌డం ఇదే తొలిసారి. ద‌శాబ్దం క్రితం 460 ఎయిర్‌బ‌స్‌, బోయింగ్ జెట్ విమానాల కోసం అమెరికా విమాన‌యాన సంస్థ‌లు ఆర్డ‌ర్లు పెట్టాయి. ప్ర‌పంచాన్నే వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత క్ర‌మంగా విమాన‌యానానికి గిరాకీ పెరుగుతోంది.

ఈ తరుణంలో 100 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన విమానాల‌ను కొనుగోలు చేయాల‌ని టాటా స‌న్స్ వారి ఎయిరిండియా భావిస్తోంది. విమాన ప్ర‌యాణాల‌కు గిరాకీ ఎక్కువైనా పారిశ్రామికంగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా పౌర విమాన‌యాన రంగానికి స‌వాళ్లు కొన‌సాగుతున్న వేళ ఎయిరిండియా సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఎయిరిండియా భారీగా విమానాలు కొనుగోలు చేయ‌నుంద‌న్న వార్త‌ల‌పై అటు ఎయిర్ బ‌స్ గానీ.. ఇటు బోయింగ్ గానీ స్పందించ‌లేదు.

సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌తో క‌లిసి టాటా స‌న్స్ నిర్వ‌హిస్తున్న జాయింట్ వెంచ‌ర్ సంస్థ విస్తారా.. క‌లిసిపోనున్న వేళ‌.. దేశీయంగా, అంత‌ర్జాతీయంగా త‌న స్థానాన్ని బ‌లోపేతం చేసుకోవాల‌ని ఎయిరిండియా భావిస్తోంది. 218 విమానాల‌తో దేశంలోనే రెండో అతిపెద్ద విమాన‌యాన సంస్థ‌గా టాటా స‌న్స్ ఎయిరిండియా నిలువ‌నుంది. ఇటీవల ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి దక్కించుకున్నాక టాటా గ్రూప్ దూకుడు పెంచింది. పలు ఎయిర్‌లైన్స్‌ను తనలో విలీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చరిత్రకు మరో అడుగు దూరంలో నిలిచింది. దాదాపు 500 విమానాల కోసం టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా ఆర్డర్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే ఆ సన్నాహాలు ప్రారంభించిందని, దాదాపు ఖరారైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎయిరిండియా పునరుజ్జీవం కోసం టాటా గ్రూప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని అంటున్నాయి. ఇక ఈ డీల్ విలువ చరిత్రలో నిలిచిపోతుందని వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఏకంగా 100 బిలియన్ డాలర్లపైనే.. అంటే భారత కరెన్సీలో రూ.8.2 లక్షల కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ 500 విమానాల్లో ఎక్కువగా 400 వరకు నారో- బాడీ జెట్స్, మిగతా 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్- బాడీ విమానాలు ఈ ఆర్డర్‌లో ఉన్నట్లు సమాచారం. ధర, వాల్యూమ్ ఇలా ఏ పరంగా చూసినా.. ఎయిరిండియా ఇవ్వబోయే ఆర్డర్ విమానయాన చరిత్రలో నిలిచిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇప్పటివరకు ఒక విమానయాన సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదని చెబుతున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం అమెరికా ఎయిర్‌లైన్స్ నుంచి 460 ఎయిర్‌బస్, బోయింగ్‌కు వచ్చిన ఆర్డరే ఇప్పటివరకు అతిపెద్దదిగా ఉంది.

టాటా చేతికి ఎయిర్ ఇండియా

ఇక ఇంత పెద్ద మొత్తం ఆర్డర్ చేసినప్పుడు అదే రీతిలో డిస్కౌంట్ లభిస్తుంది. అయినప్పటికీ ఈ డీల్ విలువ 100 బిలియన్ డాలర్లపైనే ఉండనుంది. పెద్ద మొత్తంలో రాయితీకి అవకాశం ఉన్నందునే ఒకేసారి ఎక్కువ విమానాలను కూడా ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్సం యుక్తంగా నిర్వహిస్తున్న విస్తారాను.. ఎయిరిండియాలో విలీనం చేశారు. దీంతో భారత్‌లో అతిపెద్ద ఫుల్ సర్వీస్ క్యారియర్‌గా అవతరించింది. ఇక దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్యారియర్, దేశీయ మార్కెట్‌లో రెండో అతిపెద్ద క్యారియర్‌గా నిలిచింది.

JRD టాటా స్థాపించిన ఎయిరిండియా కొన్నేళ్ల కిందట భారత ప్రభుత్వం చేతికి వెళ్లింది. అయితే ఈ జనవరిలో మళ్లీ టాటా గ్రూప్ ఈ సంస్థను తిరిగి దక్కించుకుంది. అప్పటినుంచి తన కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటూ వెళ్తోంది. భారత్‌లో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిరిండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ గత నెలాఖరులో ప్రకటించింది. విలీనం పూర్తయ్యాక ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25 శాతానికి పైగా వాటా లభించనుంది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ప్రక్రియ 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా.

విస్తారాలో టాటా గ్రూప్‌ 51 శాతం వాటా కలిగి ఉండగా.. మిగతా 49 శాతం వాటా ఎస్‌ఐఏ చేతుల్లో ఉంది. విస్తారాను విలీనం చేశాక దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఎయిరిండియా అగ్రగామి ఎయిర్‌లైన్స్‌గా ఎదగనుందని టాటా గ్రూప్‌ తన ప్రకటనలో పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సేవల సంస్థగా, రెండో అతిపెద్ద డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌గా అవతరించనుంది.

విమానయాన వ్యాపార విభాగంలో భారీ మార్పులకు టాటా గ్రూప్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే విస్తరించిన తన విమానయాన వ్యాపార సామ్రాజ్య పునర్‌నిర్మాణ ప్రణాళికలో భాగంగా నాలుగు ఎయిర్‌లైన్స్ బ్రాండ్లను ఒకే గూటికి తీసుకురావాలనుకుంటోంది. 4 బ్రాండ్లనూ ఎయిరిండియా లిమిటెడ్ కింద కలిపేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా విస్తారా ఎయిర్‌లైన్స్ బ్రాండ్‌ను మూలనపడేయాలని టాటా గ్రూప్ భావిస్తోందంటూ ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉమ్మడి కంపెనీలో తన వాటా పరిమాణాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ లెక్కిస్తోందని ఓ వ్యక్తి తెలిపారు.

అయితే ఈ రిపోర్టులపై ప్రశ్నించగా టాటా గ్రూప్, ఎయిరిండియా, విస్తారాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌, టాటా గ్రూప్ ఉమ్మడిగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా కొత్త యాజమాన్యం టాటా గ్రూప్ సారధ్యంలోని ఎయిరిండియా క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటోంది. ఎయిరిండియా తన ప్రస్తుత విమానాల సంఖ్య 113ను రానున్న ఐదేళ్లలో మూడింతలు పెంచుకోనుందని ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యాంప్‌బెల్ గత నెలలోనే ధృవీకరించారు. చిన్న, పెద్ద విమానాలను గణనీయంగా పెంచుకోనున్నట్టు స్పష్టం చేశారు.

మరోవైపు నిధుల సేకరణపైనా టాటా గ్రూపు దృష్టిసారించింది. ఒక ఫండింగ్ రౌండ్‌లో భాగంగా 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించడంపై యాజమాన్యం చర్చిస్తోందని కంపెనీకి చెందిన వర్గాలు సెప్టెంబర్‌లో వెల్లడించాయి. 25 ఎయిర్‌బస్ ఎస్ఈ, 5 బోయింగ్ కో కొనుగోలు చేయాలనుకుంటోంది. దీంతో మళ్లీ ఎయిరిండియా పూర్వ వైభవాన్ని సంతరించుకున్నట్లేనని నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎయిరిండియా .. పూర్వ వైభవం సాధించనుంది. ఏకంగా 500 విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైందన్న వార్తలు .. ఇప్పుడు విమానయాన రంగంలో టాటా గ్రూప్ ముందడుగుకు తార్కాణంగా మారింది.

Must Read

spot_img