ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ రంగం వైపే చూస్తోంది. ఏఐ టెక్నాలజీకి రోజురోజుకు యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. ఏఐతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతుండగా.. మరెన్నో అనర్ధులు సైతం ఉన్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.. తాజాగా ఇంటర్నెట్ యూజర్ల పాస్‌వర్డ్ ను కేవలం నిమిషం లోపే తెలుసుకునే అవకాశం ఉందని సర్వేలలో వెల్లడవడం ఇప్పుడు సరికొత్త ఆందోళనను రేకెత్తిస్తోంది..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మానవ వినాశనం జరగబోతోందా..? చాట్ జీపీటీ తో మేథస్సుకు మరణ శాసనమేనా..? ఒకప్పుడు కృత్రిమ మేథను అబ్బురంగా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడెందుకు ఆందోళనగా మారింది. ఇంతకీ ఏఐ వల్ల అంత ముప్పు నిజంగానే పొంచి ఉందా..?
ప్రస్తుతం యావత్ టెక్నాలజీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశిస్తోంది. ఏఐ ప్రతికూల ప్రభావాల గురించి కొంత మంది ఆందోళన చెందుతుండగా, మరికొందరు దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి సంతోషిస్తున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీపై దీని ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. మనం సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను ఏఐ ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయగలదని ఓ తాజా అధ్యయనం కనుగొంది. అంటే యూజర్ల పాస్‌వర్డ్‌లు వారు అనుకున్నంత సురక్షితంగా లేవు. తమ ఆన్‌లైన్ అకౌంట్‌లను రక్షించుకోవడానికి అదనపు చర్యలు తీసుకోక తప్పదు.
టెక్నాలజీ రోజురోజుకీ మరింత అడ్వాన్స్ అవుతోంది. ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీ టూల్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ టెక్నాలజీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ టెక్నాలజీతో అనేక పనులను తక్కువ సమయంలోనే చేయొచ్చు. ఏఐ టెక్నాలజీతో ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంతే ముప్పు కూడా పొంచి ఉంది. గత రెండు నెలల్లో ప్రపంచ దేశాల్లో ఏఐ గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీతో పాటు ఆన్‌లైన్ వినియోగదారుల ప్రైవసీని కూడా దెబ్బతీయగలదని అంటున్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. సాధారణంగా ఉపయోగించే ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌లకు రిస్క్ ఉందని తేలింది. ఎందుకంటే.. ఇలాంటి పాస్‌వర్డులను ఏఐ టెక్నాలజీ నిమిషంలోపే ఛేదించగలదు.
ఆన్‌లైన్ యూజర్లు సాధారణంగా ఉపయోగించే 50 శాతం పాస్‌వర్డ్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిమిషంలోపే ఛేదించవచ్చని హోమ్ సెక్యూరిటీ హీరోస్ ఇటీవల అధ్యయనంలో తేలింది. అధ్యయనం ప్రకారం.. 15,680,000 పాస్‌వర్డ్‌ల లిస్టును టెస్టింగ్ చేసేందుకు అనే ఏఐ పాస్‌వర్డ్ క్రాకర్‌ను ఉపయోగించింది. అంటే. దాదాపు 51 శాతం సాధారణ పాస్‌వర్డ్‌లను ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో పసిగట్టేయగలదు. 65 శాతం పాస్‌వర్డ్‌లను గంటలోపే క్రాక్ చేయగలదని వెల్లడించింది. అంతేకాకుండా.. ఒక నెలలో 81 శాతం పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయగలదని కూడా అధ్యయనం పేర్కొంది. ఏఐ టెక్నాలజీ.. నిజానికి మీ పాస్‌వర్డ్‌ను ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో గుర్తించగలదు. మీరు సెట్ చేసిన పాస్‌వర్డ్ లెన్త్ అనేది చాలా చిన్నదిగా ఉంటే మాత్రం ఏఐ క్షణాల్లోనే పసిగట్టేయగలదు. చిన్న పాస్‌వర్డులను మాత్రమే ఏఐ గుర్తించడం సాధ్యమవుతుందని గమనించాలి. ఉదాహరణకు.. మీ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైనవి పాస్‌వర్డుగా సెట్ చేస్తే మాత్రం వెంటనే క్రాక్ చేయగలదు. అదే.. లెటర్స్, సింబల్స్ వంటి 18 అక్షరాల లాంగ్ ఉండే పాస్‌వర్డ్‌లను గుర్తించడానికి ఏఐకి ఎక్కువ సమయం పడుతుంది.
అధ్యయనం ప్రకారం.. 18 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పాస్‌వర్డ్‌లు సాధారణంగా ఏఐ పాస్‌వర్డ్ క్రాకర్ల నుంచి సురక్షితంగా ఉంటాయని తెలిపింది. కేవలం నంబర్‌లు మాత్రమే ఉండే పాస్‌వర్డులను క్రాక్ చేసేందుకు కనీసం 10 నెలల సమయం పట్టింది. అదేవిధంగా, సింబల్స్, సంఖ్యలు, క్యాపిటల్, స్మాల్ అక్షరాల కలయికతో కూడిన పాస్‌వర్డ్‌లు అత్యంత సురక్షితమైనవిగా పేర్కొంది. ఎందుకంటే.. వాటిని క్రాక్ చేయడానికి ఏఐకి ఆరు క్విన్టిలియన్ సంవత్సరాల వరకు పట్టవచ్చు. మీ ఆన్‌లైన్ అకౌంట్లు సేఫ్‌గా ఉండాలంటే.. సాధారణ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవద్దు. కేవలం నెంబర్లు కాకుండా
స్పెషల్ క్యారెక్టర్ సింబల్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. కనీసం 15 అక్షరాల పొడవు ఉండే పాస్‌వర్డ్‌లను ఎంచుకోవాలి. అందులో లెటర్స్, సింబల్స్, నెంబర్లు, అప్పర్, లోయర్-కేస్ అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. ఈ టైప్ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమే.. అప్పుడు ఇలాంటి పాస్‌వర్డులను స్టోర్ చేయడానికి మీరు పాస్‌వర్డ్ మేనేజర్ ని ఉపయోగించవచ్చు. ఒకరి పాస్‌వర్డ్‌లో కనీసం రెండు అక్షరాలు, సంఖ్యలు, సింబల్స్ ఉండాలని కూడా అధ్యయనం చెబుతోంది. 3 లేదా 6 నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం కూడా ఒక ప్రాక్టీస్‌గా కొనసాగించాలని సూచించింది. చివరగా, అన్ని అకౌంట్లకు ఒకే
సాధారణ పాస్‌వర్డ్‌ని ఉపయోగించకూడదు. ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనం హెచ్చరిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పు. మనిషి ఆలోచనలు పనిగట్టి నడుచుకునేది కాదు… మానవ మేథస్సుతో పోటీ పడే కృతిమ మేథ. అవును అందుకే ప్రపంచ మంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్వాగతించింది. అయితే… ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చూసి ప్రపంచం భయాందోళనలు చెందుతోంది. దీని వల్ల మానవ మేథస్సుకు ముప్పు ఉందని ఆందోళన పడుతోంది. ఏఐ అభివృద్ది అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పుటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అవసరాలు ఏమున్నాయో తెలుసుకుని వాటిని
తీర్చే సమాచారం ఇవ్వడం దగ్గర నుంచి.. ఆ అవసరాలు, వస్తువులు ఎక్కడ దొరుకుతాయో మన కళ్లముందు చెప్పే వ్యవస్థ వరకూ ఎదిగింది. అయితే అంతటితో ఆగలేదు. అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణ ఆలోచనలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే.. చివరికి కృత్రిమ మేథ, ప్రకృతి ఇచ్చిన మానవ మేథస్సుతో పోటీపడి.. మనుషుల్ని పక్కకు నెట్టేసే పరిస్థితి. ఇందుకు చాట్ జీపీటీ ఒక శాంపిల్. ఈ చాట్ జీపీటీతో మనుషులు ఆలోచన చేసే సృజనాత్మక రచనలు నుంచి అనేక ఆవిష్కరణను అదే చేసేస్తోంది.
పలు రంగాల్లోని ఉద్యోగులను చాట్‌జీపీటీ లాంటి ఏఐ టెక్నాలజీ భర్తీ చేస్తాయనే వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనల మధ్యే గ్లోబల్ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇటీవలి తాజా నివేదిక షాక్ కు గురిచేసే అంశాలను వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏర్పడుతున్న పరిణామాల వల్ల మరికొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. లేబర్ మార్కెట్‌పై భారీ ప్రభావం చూపుతుందని పేర్కొంది. అమెరికా, యూరోప్ దేశాల్లో మూడింట రెండోంతుల ఉద్యోగాలు ఆటోమేటెడ్‌గా మారిపోనున్నాయని తెలిపింది. ఈ మేరకు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై ఆర్థిక ప్రగతిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు అనే పేరుతో చేసిన పరిశోధనలో కీలక విషాయలను బహిరంగపర్చింది గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల శ్రామిక రంగంలో ఒడుదొడుకులు ఉంటాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మూడించ రెండింట ఆటోమేషన్‌కు ప్రభావితమవుతాయి. దాంతో పాటు ప్రస్తుతం చాలా పనులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. కానీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. ఉత్పాదకత మరింత పెరుగుతుంది. దాని ద్వారా ప్రపంచ జీడీపీ 7 శాతానికి పెంచేందుకు దోహదపడుతుంది. ‘ అని పేర్కొంది గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక. చాట్‌జీపీటీ లాంటి అధునాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మనుషుల మాదిరిగానే కంటెంట్‌ను తయారు చేస్తాయని పేర్కొంది. వచ్చే దశాబ్ధంలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.
ఇదే విషయంపై భారత్ లోని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతలో వచ్చిన మార్పుల వల్ల కలిగిన ఉద్యోగాల సృష్టితో పోలిస్తే వేగంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొంది. జనరేటివ్ ఏఐ డెవలప్‌మెంట్ గతంలోని ఐటీ మాదిరిగానే ఉంటే మాత్రం ఉపాధి అవకాశాలను తగ్గించనుంది. చాట్‌జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా కార్యనిర్వహణ, న్యాయ శాఖలపై అధిక ప్రభావం ఉండబోతోంది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 46 శాతం, లీగల్ విభాగంలో 44 శాతం మంది ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంటుందని పేర్కొంది. మరోవైపు.. నిర్వహణ, ఇన్‌స్టాలేషన్, నిర్మాణ రంగం,
రిపేర్ వంటి వాటిపై తక్కువ ప్రభావం ఉంటుంది. అంటే.. ఇప్పటివరకు మనుషులను శాసించిన యంత్రాలు, ఇప్పుడు మేథస్సును శాసించబోతున్నాయి. ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకోవాలంటున్నారు విశ్లేషకులు.. తాజాగా ఆన్ లైన్ యూజర్లు ఉపయోగించే పాస్ వర్డ్ లను కేవలం ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో పసిగట్టేయగలదని ఓ అధ్యయనంలో తేలడంతో ఆందోళనకు కారణమవుతోంది..
ఇంటర్నెట్ రంగంలో ఏఐ టెక్నాలజీ దూసుకెళుతోంది. కోట్లాది మంది యూజర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు. ఏఐతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని యూజర్లు భావిస్తుండగా.. అంతకుమంచి నష్టాలు తప్పవని ప్రముఖులు సైతం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ తో ముప్పు పొంచి ఉందని పలు సర్వేలు చెబుతుండటం సరికొత్త ఆందోళనకు కారణమవుతోంది.