భారత్ లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో సాగుకు కృత్రిమ మేథ మద్ధతు పలకనుంది. ఈమేరకు గూగుల్ సైతం సహకారం అందిస్తుండడంతో, ఇక భారంగా మారిన వ్యవసాయం.. అభివృద్ధి దిశగా పయనించనుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రైతు ఆరుగాలం కష్టపడినా, పంట చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి .. అయితే ఈ స్థితి మారనుందని అటు శాస్త్రవేత్తలు, ఇటు ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం అందించనుంది.
భారతదేశ డిజిటల్ భవిష్యత్తును నడిపించడంలో మేము సహాయం చేస్తున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. భారత్ కోసం,గతంలో తాము ప్రకటించిన వెయ్యి కోట్ల డాలర్లతో పదేళ్ల కాలం కోసం ఏర్పాటు చేసిన ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (IDF) నుంచి ఖర్చు చేసిన నిధుల వల్ల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంతమేర పురోగతి ఉందో చూడడానికి, కొత్త సాంకేతికతల గురించి పంచుకోవడానికి భారత్ వచ్చినట్లు చెప్పారు.
AI ఆధారంగా, ఒకే సమగ్ర మోడల్‌ను అభివృద్ధి చేయడం మా మద్దతులో భాగమని, ఇది పదాలు, మాటల ద్వారా 100కు పైగా భారతీయ భాషల్లో ఆపరేట్ చేయగలదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయరంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో భవిష్యత్‌లో వ్యవసాయం చేయనున్నారు.
వ్యవసాయ నిపుణుల సహకారంతో రైతుల పంటపొలాల సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పరిష్కారం చూపడం. దీని ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు మార్కెట్, ఇన్‌పుట్, ఔట్‌పుట్, డేటా, రుణం, ఇన్సూరెన్స్, సలహాలు, సూచనలు వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వ్యవసాయం చేయడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని, పంటల దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు హిందుస్తాన్ యూనిలివర్, గూగుల్ నీటితో అనుసంధానించబడిన అనేక రంగాలలో అవకాశాలను కనుగొనడానికి ప్రయత్నించాయి. సాంకేతిక నిపుణులు, సామాజిక వ్యవస్థాపకుల సాయంతో ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకుని రైతులకు సలహాలు ఇవ్వనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పంటలకు సంబంధించిన డేటా సేకరణ, ఏ సమయాల్లో మందుల పిచికారీ చేయడం, నేలలో ఎంత సారం
ఉంది, ఏ నేలల్లో ఏఏ పంటలు పండుతాయి, పని భారాన్ని ఎలా తగ్గించుకోవాలనుకునేది గూగుల్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. భారతదేశ వ్యవసాయరంగంలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. ఆహార ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వాతావరణంలో కాలుష్యం స్థాయిని కనుగోనవచ్చు. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా ఏ కాలంలో ఎలాంటి పంటలు పండించాలనే విషయాన్ని రైతులకు పూర్తిగా అందిస్తుంది
అలాగే మట్టికి సంబంధించిన నాణ్యత, మట్టిలో నీటిశాతం, ఎలాంటి రకమైన మట్టి, ఈ మట్టిలో ఎలాంటి పంటలు పండుతాయనే విషయాలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు పంటలు వేసిన తర్వాత పంటకు సంబంధించిన సమస్యలు, రోగాల నివారణ, రసాయన పిచికారీల గురించి, పంట నాణ్యత గురించి వంటివి తెలుసుకోవచ్చు. దీంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం అందిస్తుంది. జర్మన్ స్టార్టప్ పీట్ ప్లాంటిక్స్ అనే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. రైతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోటోలు తీస్తే చాలు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. వ్యవసాయరంగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కనపెట్టి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సాగుతోపాటు,మార్కెటింగ్‌లో సమస్యలన పరిష్కరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఏఐ అమలుకు చర్యలు తీసుకోవాలని అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖ అధికారులకు సూచించింది. వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే రైతులకు భారీ ఊరట లభించడం ఖాయం. సాగులో సమస్యలకు చెక్‌పెట్టడంతోపాటు.. భవిష్యత్ మార్కెటింగ్ వ్యూహాన్ని కూడా రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు చీడపీడలు వ్యాపించిన పంటను ఫొటో తీసి సంబంధిత అధికారులకు పంపిస్తే..వారు కృత్రిమ మేధ ద్వారా అది ఏ తెగులో గుర్తించడంతోపాటు దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తారు.
రైతులు పండించే పంటకు ఏడాది ముందునుంచే భవిష్యత్ మార్కెటింగ్ అవసరాలను అంచనా వేయవచ్చు. భారతదేశంలోని చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం;సైబర్ భద్రతలో గూగుల్ పెట్టుబడి వంటి అంశాలను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానంటూ తన పర్యటన ప్రారంభంలో పిచాయ్స్వ యంగా రాసిన బ్లాగ్‌లో తెలిపారు. ఇది కాకుండా, విద్య, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI లేదా
కృత్రిమ మేధ) వినియోగంలో గూగుల్ చొరవ మీద కూడా చర్చ జరుగుతుందని బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్నపిచాయ్.. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బలంగా పని చేస్తోందని, ప్రపంచ ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. అటువంటి సమయంలో, బాధ్యతాయుతమైన, సమతుల్య నియమాలను రూపొందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయని అన్నారు.
100కు పైగా భారతీయ భాషల్లో టెక్ట్, వాయిస్ ద్వారా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే వీలు కల్పించేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తామని చెప్పారు.ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది, అయితే వ్యవసాయ పరిశ్రమలో డ్రోన్ల వాడకం విజృంభిస్తోంది.వ్యవసాయ సంబంధ నిర్ణయాలను మెరుగ్గా తెలియజేయడానికి వ్యవసాయ క్షేత్రాలపై డ్రోన్‌ల ద్వారా సేకరించిన సమాచారంతో మెరుగైన ఉత్పత్తి సాధ్యమవుతోంది. దీంతో అనేక ప్రాంతాలలో డ్రోన్ల వినియోగం ఇప్పటికే పెద్ద ఎత్తున ఖచ్చితత్వ వ్యవసాయ కార్యకలాపాలలో ముఖ్యమైన భాగంగా మారింది.
డ్రోన్ల రికార్డింగ్ ఫీల్డ్‌ల నుండి సేకరించిన డేటా, సాధ్యమైనంత ఉత్తమమైన దిగుబడిని సాధించడానికి సహాయపడుతుంది. ఖచ్చితమైన వ్యవసాయ వ్యవస్థలను ఉపయోగించడం వల్ల దిగుబడిని 5% వరకు పెంచవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. మెజారిటీ గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు.
రైతులకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోవడం, చీడపీడలు అదుపు తప్పడం వంటివి నష్టాలకు ప్రధాన కారణమయ్యాయి. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయ డ్రోన్ల వంటి వినూత్న పరిష్కారాలు. సాంకేతిక పురోగతిలో గ్రామీణ
రంగం ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నప్పటికీ, ఇప్పుడు వ్యవసాయ డ్రోన్ల నిర్దిష్ట వాతావరణాలకు అనుగుణంగా ఎంపికలను చేయడానికి రైతుకు శక్తినిస్తుంది. పంట ఉత్పత్తి, పంట పెరుగుదల పర్యవేక్షణలో సహాయపడుతుంది. అలాగే, మట్టి మరియు పంట క్షేత్ర విశ్లేషణ, నాటడం, పురుగు మందుల అప్లికేషన్‌తో సహా పలు రకాల పనుల కోసం డ్రోన్లను ఉపయోగిస్తారు. స్థిరమైన వ్యవసాయ నిర్వహణకు సమర్థవంతమైన విధానంలో భాగంగా వ్యవసాయంలో డ్రోన్లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.
వ్యవసాయిక దేశంలో కృత్రిమ మేథ .. మరింత అభివృద్ధికి కారణం కానుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం .. సక్సెస్ కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..