అటు పెరూలోనూ ఆందోళనలు ఆగడం లేదు..పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా చేపట్టిన జాతీయ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పెరూలో మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా మద్దతుదారులు – భద్రతా దళాలకు మధ్య కొన్ని నెలలుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ప్రముఖ చారిత్రిక పర్యాటక కేంద్రం మచుపిచ్చు సందర్శనకు బ్రేక్ పడింది.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా చేపట్టిన జాతీయ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మచు పిచ్చుకు పర్యాటకులను ప్రభుత్వం అనుమతించడం లేదు. టూరిస్ట్ స్పాట్ అయిన ఈ చారిత్రక ప్రాంతానికి పర్యాటకులు రావడాన్ని నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆందోళలలో ఇప్పటి వరకు దాదాపు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తున్నది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు సమాచారం. ఆందోళనకారులు మచు పిచ్చుకు వచ్చే రైల్వే లైన్లను ధ్వంసం చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
దీంతో జిల్లాలో 417 మంది చిక్కుకుపోయారని చెప్పారు. వారిలో 300 మంది విదేశీయులు ఉన్నారు. కాగా, ఈ నెల 21, ఆ తర్వాతి రోజుల్లో మచు పిచ్చు సందర్శనకు టికెట్లు బుక్‌చేసుకున్నవారికి త్వరలోనే డబ్బును తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జాతీయ సమ్మె తీవ్ర ఆందోళనకు దారితీసింది. లిమాలోని వరల్డ్ హెరిటేజ్ బిల్డింగ్‌గా నమోదైన శాన్ మార్టిన్ ప్లాజా సమీపంలో పెద్ద సంఖ్యలో ఆందోళనాకారులు గుమిగూడారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు-ఆందోళనాకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న శాన్ మార్టిన్ భవనంలో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ మంటలు భవనం అంతా విస్తరించి కార్చిచ్చులా మారింది.
ఈ భవనం దాదాపు 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఆందోళనాకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేసారు. పెరూలో మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా మద్దతుదారులు – భద్రతా దళాలకు మధ్య కొన్ని నెలలుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తున్నది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు సమాచారం. వీరిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు మూడేండ్లుగా రాజకీయ టెన్షన్ కొనసాగుతోంది. అనేకసార్లు మధ్యవర్తులు పరిష్కారానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అవినీతి, బలవంతపు నిర్ణయాల కారణంగా దేశాధ్యక్షుడిగా ఉన్న పెడ్రో కాస్టిల్లా రాజీనామా చేసేలా కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుత దేశాధ్యక్షుడు డినా బులెర్టో దిగిపోవాలంటూ గత డిసెంబర్ నుంచి తాజాగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మెలో దేశ నలమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. పునో, కుస్కో, అయాకుచో, అపురిమాక్ వంటి ప్రాంతాల నుంచి ఈ సమ్మెలో పాల్గొనేందుకు ప్రజలు రాజధాని లిమాకు చేరుకున్నారని టెలిసూర్ అనే న్యూస్ ఛానెల్ పేర్కొంది. ఈ సమ్మెల్లో గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘రక్తపాతం ఎప్పటికీ మరచిపోలేనిది’ వంటి ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు కవాతు చేశారు. సుమారు 3,500 మంది ఈ ప్రదర్శనలో పాల్గన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని సమాచారం. అరెక్విపాలో చేపట్టిన ఆందోళనలో చిన్న పాటి ఘర్షణ జరిగిందని, ఈ ఘటనలో ఒకరు మరణించగా, పదిమందికి గాయాలైనట్లు ప్రభుత్వ కార్యాలయం పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. బొలూర్టె రాజీనామా చేయాలని, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.పునో, కుస్కో, అయాకుచో, అపురిమాక్ వంటి ప్రాంతాల నుంచి ఈ సమ్మెలో పాల్గొనేందుకు ప్రజలు రాజధాని లిమాకు చేరుకున్నారని టెలిసూర్ అనే న్యూస్ ఛానెల్ పేర్కొంది. ఈ సమ్మెల్లో గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘రక్తపాతం ఎప్పటికీ మరచిపోలేనిది’ వంటి ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు కవాతు చేశారు.