Homeజాతీయంఢిల్లీని గడగడలాడిస్తోన్న లిక్కర్ స్కాం విచారణలో దూకుడు ..

ఢిల్లీని గడగడలాడిస్తోన్న లిక్కర్ స్కాం విచారణలో దూకుడు ..

ఢిల్లీని గడగడలాడిస్తోన్న లిక్కర్ స్కాం విచారణలో దూకుడు .. ఆమ్ ఆద్మీని మరింత టెన్షన్ పెడుతోంది. దీంతో ఇప్పటికే ఇద్దరు కీలక మంత్రుల్ని కోల్పోయిన ఆప్ .. తాజాగా నిరసనలకు దిగింది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం తనదైన స్టైల్లో నిరసనలకు దిగడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ఎందుకు టెన్షన్ పడుతోందన్నదే ఆసక్తికరంగా మారింది.

మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి నేతల అరెస్ట్ .. ఆప్ కు తలనెప్పిగా మారనున్నాయా..? ఈ తరుణంలో కేంద్ర బీజేపీపై ఆమ్ ఆద్మీ .. వినూత్నంగా ఆందోళనలకు దిగుతోందా..? అందుకే ఓ రోజంతా ధ్యానం చేస్తూ .. దేశం కోసం ప్రార్థన చేస్తున్నామంటూ కేజ్రీవాల్ విలక్షణంగా తన నిరసనలు తెలుపుతున్నారా..? ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది. కిందటి
నెల 29వ తేదీన మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షులు ఎక్సైజ్ శాఖ మాజీ కమిషనర్ అర్వ గోపి కృష్ణ, మాజీ కార్యదర్శి సీ అరవింద్ సైతం విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు కూడా సీబీఐ అధికారులు నోటీసులను జారీ చేశారు. విచారణ కోసం ఢిల్లీకి రావాల్సిందిగా సూచించారు.

వరుసగా విచారణలు, అరెస్టులను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు.

హోలీ పండగను పురస్కరించుకుని ఆయన ధ్యాన దీక్షను చేపట్టారు. ఏడు గంటల పాటు మెడిటేషన్ లో ఉన్నారు. తెల్లటి వస్త్రాలను ధరించి మెడిటేషన్ లో కూర్చున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఉదయం 10 గంటలకు ధ్యాన దీక్షలో కూర్చున్నారాయన. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగింది. దేశం కోసం తప్పట్లేదని వ్యాఖ్యానించింది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులకు ఆధునిక సౌకర్యాలను కల్పించిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైలుకు పంపిస్తున్నారని, దేశాన్ని దోచుకుంటున్న వారిని ఆయన అక్కున చేర్చుకుంటున్నారని మండిపడింది. దేశం కోసం ప్రార్థిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ చెప్పారు. త‌మ ప్ర‌భుత్వానికి చెందిన ఇద్ద‌రు మంత్రుల‌ను ద‌ర్యాప్తు సంస్థ‌లు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ధ్యానం ప్రారంభించ‌డానికి ముందు కేజ్రీవాల్ రాజ్‌ఘాట్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ ఆయ‌న నివాళి అర్పించారు. ద‌ర్యాప్తు సంస్థులను కేంద్రం దుర్వినియోగం
చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. దేశం ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని, అందుకే తాను ధ్యానం చేస్తున్న‌నని చెప్పారు. మంత్రుల అరెస్టును నిర‌సిస్తూ హోలీ వేడుక‌లకు కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. సిసోడియా, స‌త్యేంద్ర జైన్‌లు జైలులో ఉన్నార‌ని, కానీ అదానీపై ఎటువంటి చ‌ర్య తీసుకోలేద‌ని అన్నారు.

మంచి పనులు చేస్తున్నందుకు నేతలను బీజేపీ అరెస్టు చేయిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. సత్యేంద్ర జైన్, సిసోడియా జైలులో ఉన్నందుకు తాను బాధపడటం లేదని, వారు ధైర్యవంతులే కాకుండా ఇప్పటికే దేశానికి తమ జీవితాలను ఫణంగా పెట్టారని, దేశంలో చేటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులే తనకు బాధ కలిగిస్తున్నాయని సీఎం చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్పా లసీ కేసులో సత్యేంద్ర జైన్‌ను 2022 మేలో అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు
మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ అరెస్టులకు నిరసనగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ శ్రేయస్సు కోసం తన రోజంతా ధ్యానం, ప్రార్థనలు ప్రారంభించారు. హోలీని జరుపుకోకుండానే ఆయన ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు.

ప్రజలకు మంచి విద్య, మంచి వైద్య సదుపాయాలు కల్పించే వారిని, దేశాన్ని దోచుకునే వారికి అండగా నిలిచే వారిని ప్రధాని జైళ్లలో పెట్టడం ఆందోళన కలిగిస్తోందని కేజ్రీవాల్వి మర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది తప్పని భావిస్తే, మీరు కూడా దేశం గురించి ఆందోళన చెందుతుంటే, హోలీ జరుపుకున్న తర్వాత, దేశం కోసం ప్రార్థించడానికి సమయం కేటాయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నానని కేజ్రీవాల్ కోరారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసి
జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో జైన్ ను గత ఏడాది మేలో ఈడీ అరెస్టు చేసింది. కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పను ఎందుకు అరెస్ట్చేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. కర్నాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్ సంస్థకు చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఆఫీస్‌లో, ఆయన కుమారుడే కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుండా అడ్డంగా దొరికిపోతే.. ఆ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్‌ చేయలేదన్నది కేజ్రీవాల్‌ సంధిస్తున్న ప్రశ్న.

ఆయనకో రూల్.తమ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా విషయంలో మరో రూలా అని నిలదీస్తున్నారు.

సిసోడియా ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఏమీ దొరకలేదని గుర్తుచేశారు కేజ్రీవాల్. అయినప్పటికీ విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేసి జైలుకు పంపించారని విమర్శించారు. ప్రధానిని ఉద్దేశించిన ఓ నోట్‌ రాసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. అవినీతిని అంతం చేస్తాం.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనే మాటల్ని దయచేసి చెప్పకండి.. ఈ ఉదాహరణలు చూసిన తర్వాత అవి మీకు సెట్‌ అవ్వవంటూ సెటైర్లు వేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో 40 లక్షలు లంచం తీసుకుంటూ విరూపాక్షప్ప ఆఫీస్‌లో ఆయన కుమారుడు ప్రశాంత్ దొరకడం బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది.

అవినీతి కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోగా.. ఆయన్ను బీజేపీ నెత్తిన పెట్టుకుంటోంది. ముందస్తు బెయిల్‌ మాత్రమే కాదు.. భవిష్యత్‌లో ఆయనకు పద్మభూషణ్‌ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కర్నాటక గడ్డపై సెటైర్లు వేశారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు..అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా నియమించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేబినెట్ లో మంత్రులుగా వీరిని నియమించేందుకు వీరి పేర్లను ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్
..లెఫ్టినెంట్ గవర్నర్ కు మొదట పంపారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా చేసిన అనంతరం ఆ లేఖలను కేజ్రీవాల్ రాష్ట్రపతికి పంపగా వాటిని ఆమె ఆమోదించారు. దీంతో వీరి స్థానే అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. వీరిద్దరూ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
2020 నుంచి కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిషి.. లోగడ మనీష్ సిసోడియా నేతృత్వంలోని విద్యాశాఖ టీమ్ లో కీలక పాత్ర వహించారు. 2019 లోక్స భ ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. ఇక సౌరభ్ భరద్వాజ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013-14 లో ఆయన కేజ్రీవాల్ తొలి ప్రభుత్వంలో 49 రోజులపాటు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి కూడా అయిన భరద్వాజ్ .. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ .. ధ్యానం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

కేంద్రంలోని బీజేపీ.. ఢిల్లీ ఆప్ సర్కార్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే ఢిల్లీ లిక్కర్ కేసు పేరిట అరెస్టులకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. కర్నాటక బీజేపీ నేత విరూపాక్ష అంశంలో బీజేపీ తీరును ఆయన ఎండగట్టారు.

Must Read

spot_img