Homeఅంతర్జాతీయంఆఫ్గనిస్తాన్ నిజంగానే అపారమైన సంపదను చూసిందా ?

ఆఫ్గనిస్తాన్ నిజంగానే అపారమైన సంపదను చూసిందా ?

తాలిబన్ పాలనలో అధోగతిపాలైన ఆఫ్గనిస్తాన్ దేశంలో ఓ వింత జరిగింది. కల్లోలిత దేశంలో ఓ ఆఫ్గన్ టెకీ సూపర్ కార్ తయారుచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసాడు. కారంటే అది మామూలు కారు కాదు..నిజంగానే అదో సూపర్ కారుగా తాలిబన్లు చెప్పుకుంటున్నారు. తమ దేశంలో మరికొంత కాలానికి దేశవ్యాప్తంగా ఇవే కార్లు తిరగనున్నాయని తాలిబన్లు గొప్పలు పోతున్నారు. కానీ అంత సీన్ లేదు..

ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్ నిజంగానే అపారమైన సంపదను చూసింది. బిలియన్ల కొద్ది అమెరికా డాలర్లు వరదలా ప్రవహించాయి. ఖరీదైన కార్లతో సంపన్నదేశంగానే విలసిల్లింది. ఒకప్పుడు అక్కడి జనం అత్యాధునిక లైఫ్ స్టైల్ లోనే జీవించారు. అమెరికా, దాని మిత్ర దేశాల దళాలు కాబూల్ బాగ్రామ్ ఎయిర్‌బేస్‌లో ఉన్నప్పుడు, రాత్రిపూట అక్కడ వెలుగులు విరజిమ్మేవి. కానీ ఎప్పుడైతే తాలిబన్లు అమెరికాను పక్కకు నెట్టి తమ ఆధీనం చేసుకున్నారో అప్పటి నుంచి ఆఫ్గనిస్తాన్ వెనక్కు నడుస్తోంది. షరియా చట్టాల అమలును చూస్తోంది. ఈ క్రమంలో అక్కడి ఓ టెకీ సూపర్ కార్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచి తేల్చాడు. కాబూల్‌కు చెందిన ఇంజనీర్ మహ్మద్ రజా అహ్మదీ అనే ఈ టెకీ ఇప్పుడు దేశంలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

నిజానికి అఫ్గానిస్తాన్‌లో వాహనాల తయారీ పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్‌కార్‌ను తయారు చేయాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది, దాని సాంకేతికత, విడిభాగాలను ఎక్కడ సంపాదించారన్నది ఆసక్తికరంగా మారింది. మహ్మద్ రజా మేరకు ఈ సూపర్ కార్ తయారీకి 10 నుంచి 12 మందితో కూడిన బృందం పనిచేసింది. ప్రస్తుతానికి ఇది వారు రూపొందించిన ప్రోటోటైప్ స్పోర్ట్స్ కారు. ఇందులో టయోటా ఇంజిన్ ఉపయోగించారు. టెక్నికల్అండ్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్గానిస్తాన్‌తో కలిసి ఎస్‌టాప్ కార్ డిజైన్ స్టూడియోలో ఈ కారును రూపొందించాడు. ఒకప్పుడు తాను తయారు చేసిన కారుతో ఆఫ్గన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రన్ వేపై ప్రదర్శించాలని కలలు కనేవాడినని తెలిపాడు.

“నా కల కలలాగే మిగిలిపోతుంది, ఎప్పటికీ నెరవేరదు అనుకున్నా. కానీ ఇప్పుడు అది సాకారమైంది. అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం నా కారును బాగ్రామ్ఎ యిర్‌బేస్‌లో ప్రదర్శించింది. అప్పుడు నేను కలగనట్టే ఆ ప్రాంతంలో వెలుగులు విరజిమ్మాయి.” కాబూల్‌కు చెందిన ఇంజనీర్ మహ్మద్ రజా అహ్మదీ అన్న మాటలు ప్రపంచంలో తాము కూడా ఎదగాలన్ని ఆత్మవిశ్వాసాన్ని రేపుతున్నాయి. యుద్ధంతో నలిగిపోయిన అఫ్గానిస్తాన్‌లో మొదటి ‘సూపర్‌కార్’ని రజా అహ్మదీ రూపొందించాడు. ఎస్‌టాప్ అనే స్థానిక డిజైన్ స్టూడియో సోషల్ మీడియా పేజీలో మహ్మద్ రజా అహ్మదీ తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే ”ఈ కారు డిజైనింగ్ , అసెంబ్లింగ్ ఐదేళ్లుగా కొనసాగుతోంది. అంటే కారు పని గత ప్రభుత్వం హయాంలోనే మొదలైంది.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొటోటైప్ తయారీ పూర్తయింది. అఫ్గానిస్తాన్‌లోని విద్య, సాంకేతిక విద్య విభాగాధిపతి మౌల్వీ గులాం హైదర్ షహమత్ అఫ్గానిస్తాన్‌ ఏమన్నారంటే..‘‘ఇంతకు ముందు కేవలం 50 శాతం పని మాత్రమే జరిగిందని, అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ పాలన ఏర్పడినప్పుడు, మహ్మద్ రజా అహ్మదీ 8 నెలల క్రితం తమను సంప్రదించాడని చెప్పారు.

ఆ తరువాత తను తలపెట్టిన పని పూర్తయిందని వివరించారు హైదర్. అయితే కారు ఇంటీరియర్ పని ఇంకా బాకీ ఉందని చెప్పారు.ఈ వాహనం కోసం ఇప్పటివరకు 40 నుంచి 50 వేల డాలర్లు వెచ్చించామని, ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేయడానికి మరికొంతఖర్చవుతుందని ఆయన తెలిపారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అనేక మార్పులు చేర్పులు ఇంకా చేయనున్నామని అన్నారు.

ఈ కారును పూర్తిగా సిద్ధం చేసి ప్రపంచానికి చూపించి అఫ్గానిస్థాన్‌ పురోగతిని, ఉజ్వల భవిష్యత్తును చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తామన్నారు గులాం హైదర్. ఈ ఏడాది ఖతార్‌లో జరగనున్న వాహనాల ఎగ్జిబిషన్‌లో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ఈ కారును ప్రదర్శనకు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనం చిత్రాలు, కొన్ని వీడియోలు గత ఏడాది నవంబర్‌లో సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కారును అఫ్గానిస్తాన్‌లో సైతం ప్రదర్శించారు. అయితే విమర్శకులు ఈ వాహనంలోని భాగాలు ఇతర వాహన కంపెనీలకు చెందినవని లేదా మాడిఫై చేసినవేనని ఆరోపిస్తున్నారు. కేవలం వాటిని మరో రూపంలో అసెంబ్లింగ్ మాత్రమే చేసారని అంటున్నారు. అఫ్గానిస్తాన్ తమ దేశంలోనే సొంతగా విడిభాగాలు, ఇతర ఉపకరణాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించాలని చాలెంజ్ చేస్తున్నారు.

Must Read

spot_img