Homeఅంతర్జాతీయంఆదిత్య స్పేస్ మిషన్ ..సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధమైందా..?

ఆదిత్య స్పేస్ మిషన్ ..సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధమైందా..?

సూర్యుడి వేడికి .. కారణం అందరికీ తెలిసిందే.. కానీ దీనిపై అధ్యయనం చేస్తే, మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చన్న అంచనాలతో ఇస్రో .. ఆదిత్య స్పేస్ మిషన్ ను చేపట్టిందా..? దీనికోసం .. అవసరమైన పరికరాల తయారీకి అడుగులు వేస్తోందా..? ఇంతకీ దీని పరిశోధనకు ఇస్రో ఏం చేయనుంది..? ఇన్నాళ్లూ గ్రహాలపైనే ఫోకస్ పెట్టిన ఇస్రో ఇప్పుడు.. సూర్యుడిని అధ్యయనం చేయబోతోంది. అందుకోసం ఆదిత్య స్పేస్ మిషన్‌ను సిద్ధం చేస్తోంది. ఆదిత్య – L1 అనేది భారతదేశం సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో పంపనున్న తొలి స్పేస్ మిషన్.ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అర్థం.

అందుకే ఈ శాటిలైట్‌కి ఆ పేరు పెట్టారు. ఈ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ .. నింగిలోకి మోసుకెళ్తుంది. సూర్యుడి ఉపరితలాన్ని కరోనా అని పిలుస్తారు. అక్కడ దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంత వేడి ఉంటుంది కాబట్టే.. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి కూడా సూర్యుడి వేడి బాగానే తగులుతూ ఉంటుంది. ఈ వేడిపై పరిశోధన చేసేందుకు ఆదిత్య – L1ను 2023 జూన్ లేదా జులైలో ప్రయోగించనుంది ఇస్రో. ఈ ప్రయోగం నిమిత్తం ఆదిత్య – L1 చాలా దూరం ప్రయాణించాల్సి ఉండడంతో దీనిలో 7 పేలోడ్స్ ఉంటాయి.

అవి కనిపించే ఉద్గార రేఖ కరోనాగ్రాఫ్, సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ తక్కువ శక్తి ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 కక్ష్యలో ఉన్న ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, ఆదిత్య సౌర పవన కణ ప్రయోగం, ఆదిత్య కోసం ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ, అధునాతన ట్రై-యాక్సియల్ హై-రిజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్లు. ఈ పేలోడ్లలో అతి పెద్దదైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ ని .. జనవరి 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ .. ఇస్రోకి అందించింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో కూడా సూర్యుడిపై ప్రయోగాల్లో నాసా సరసన చేరుతుంది. దీన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకేసేందుకు శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.

సూర్యుడి వాతావరణం గురించి మానవాళి మెదళ్లను తొలిచేస్తున్న అనేక అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా భారత్‌ సన్నద్ధమవుతోంది. భానుడి శోధనకు తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు ప్రారంభించింది. ఆదిత్య-ఎల్‌ 1 పేరుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. సూర్యుడిపై విస్తృత అధ్యయనాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా .. పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆదిత్య-ఎల్‌ 1తో ఇస్రో కూడా ముందడుగు వేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సూర్యుడి వాతావరణంపై పరిశోధనలకుగాను ఆదిత్య-1 ప్రాజెక్టు చేపట్టాలని ఇస్రో మొదట భావించింది. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌’తో కూడిన 400 కేజీల పేలోడ్‌ను అందులో పంపాలని.. 800 కి.మీ. దిగువ భూ కక్ష్యలో దాన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు.అయితే.. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ‘లాగ్రాంగియన్‌ పాయింట్‌-1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెడితే మెరుగైన ప్రయోజనాలుంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు ఆ తర్వాత గుర్తించారు.

ఉపగ్రహం ఆ కక్ష్యలో ఉంటే గ్రహణాల ప్రభావానికి లోనుకాకుండా నిరంతరం సూర్యుణ్ని పరిశీలించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పేరును ఆదిత్య-ఎల్‌ 1గా మార్చారు. అంతేకాకుండా ఆదిత్య-1 ద్వారా పంపాలని భావించిన పేలోడ్‌ సూర్యుడి వాతావరణం-‘కరోనా’పై పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆదిత్య-ఎల్‌1 ద్వారా పంపనున్నపేలోడ్‌లు కరోనాతో పాటు సూర్యుడి ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌లను కూడా పరిశీలిస్తాయి. ‘ఎల్‌ 1’ చుట్టూ హాలో కక్ష్యలో ఆయస్కాంత క్షేత్ర బలంలో మార్పులను కూడా ‘ఆదిత్య-ఎల్‌ 1’ గణిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సూర్యుని రహస్యాలను కనుగొనేందుకు.. ఆదిత్య ఎల్1 ఒక్కటే కాదు. ఇస్రో లిస్టులో.. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ.. వచ్చే ఏడాది మొదట్లోనే చేయబోతున్నారు మన సైంటిస్టులు. వాటి కోసం.. చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే.. అవన్నీ అంతరిక్ష రంగంలో భారత్ ప్రతిష్టను పది మెట్లు ఎక్కించే రీసెర్చ్‌లు. అవన్నీ విజయవంతమైతే.. ఇస్రోతో పాటు ఇండియా ఖ్యాతి కూడా గ్లోబ్ మొత్తం డబుల్ అవుతుంది. చంద్రయాన్‌-3, గగన్‌యాన్‌ మిషన్‌, వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్, నిసార్ మిషన్‌ ఇలా పలు కీలక శాటిలైట్ మిషన్లపై ఇస్రో పనిచేస్తోంది.

ఆదిత్య ఎల్1 తర్వాత.. ఇస్రో నుంచి రాబోయే వరుస మిషన్ల లిస్ట్ ఇది. ఇందులో.. గగన్ యాన్, చంద్రయాన్ -3 ఎంతో కీలకమైనవి. వీటి కోసం.. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా.. ఆదిత్య ఎల్1 తర్వాత.. చంద్రయాన్-3 మిషన్‌ని లాంచ్ చేసేందుకు ఇస్రో ఉవ్విళ్లూరుతోంది. 2023 ప్రారంభంలోనే.. దీనికి కూడా ముహూర్తం పెట్టుకున్నారు. మూన్ మీద ల్యాండ్ అయ్యేందుకు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న రెండో ప్రయత్నమే.. చంద్రయాన్-3 మిషన్.

ఇది గనక సక్సెస్ అయితే.. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్‌కి.. మార్గం సుగమమవుతుంది. చంద్రయాన్-3 మిషన్ ప్రస్తుతం.. అభివృద్ధి దశలో ఉంది. శాటిలైట్ అన్ని రకాల వాతావరణాలను తట్టుకునేలా.. ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటోందని.. ఇస్రో తెలిపింది. ఇక.. ఈ మిషన్‌కి ప్రైవేట్ కంపెనీలతో పాటు ఇతర స్పేస్ ఏజెన్సీలేవి సహకరించడం లేదు. కానీ.. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ మిషన్ కోసం సబ్-సిస్టమ్స్‌ని తయారుచేసి అందించాయి. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్‌కి కొనసాగింపుగా వస్తున్నదే.. చంద్రయాన్-3.

గత మిషన్‌లో.. భారత్‌కు చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ రాకెట్ జీఎస్ఎల్వీ-ఎంకె3 ద్వారా.. చంద్రుని సౌత్ పోల్‌పై రోవర్‌ని ల్యాండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ మిషన్‌లో.. చంద్రయాన్-2లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్‌తో సహా హార్డ్‌వేర్‌కు సంబంధించి.. అనేక టెస్టులు చేస్తున్నారు. నిజానికి.. చంద్రయాన్-3 మిషన్‌ని.. ఈ ఆగస్టులోనే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల ఆలస్యమైంది.

ఇక.. ఇస్రో చేపట్టిన మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. గగన్ యాన్. ఇది.. ఇస్రో చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన మిషన్. ఇది.. అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ఇండియా చేపట్టిన తొలి ప్రాజెక్ట్. స్పేస్‌లోకి మనుషులను పంపడానికంటే ముందు.. ఇస్రో.. రెండు మానవరహిత మిషన్లను చేపట్టనుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరు, పరిశీలనకు.. గగన్ యాన్ మానవ రహిత మిషన్లను నిర్వహిస్తారు.

ఈ రెండు మిషన్లు విజయవంతంగా పూర్తయితే.. అప్పుడు నింగిలోకి ఆస్ట్రోనాట్స్‌ని పంపుతారు. ఇది.. వంద శాతం ఇండియన్ మిషన్. దీనికి సంబంధించిన సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఓవరాల్ కో-ఆర్డినేషన్, ఇంప్లిమెంటేషన్ అంతా ఇస్రోదే. గగన్ యాన్ మిషన్ మొత్తం బడ్జెట్ 9 వేల 23 కోట్లు. ఇది గనక విజయవంతమైతే.. అది భారతదేశానికి గర్వకారణమే కాదు.. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు పరిశ్రమల్లోనూ.. విశేషమైన పురోగతికి దారితీస్తుంది. అన్నింటికన్నా ముందు.. సౌర వ్యవస్థను అన్వేషించడానికి.. స్థిరమైన ప్రోగ్రామ్‌ను డెవలప్ చేయడానికి.. ఇదొక పెద్ద అడుగు కానుంది. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి.. దేశీయ లాంచ్ వెహికిల్ ద్వారా మనుషులను పంపి.. తిరిగి వారిని భూమికి తీసుకురావడమే.. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.

Must Read

spot_img