Homeసినిమాఆదిపురుష్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ !!!

ఆదిపురుష్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ !!!

వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ది ఫ్లాష్ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇదే రోజు డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారు.. స్టేడియంలో సిక్స్ కొట్టేవాడి ఒక రేంజ్ ఉంటది. అవును ఎప్పుడు స్టేడియంలో సిక్స్ కొట్టేవారికి క్లాప్స్ కొడతారు.

గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారు.. స్టేడియంలో సిక్స్ కొట్టేవాడి ఒక రేంజ్ ఉంటది. అవును ఎప్పుడు స్టేడియంలో సిక్స్ కొట్టేవారికి క్లాప్స్ కొడతారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఇండియా సినిమాలతో హాలీవుడ్ సినిమాలతో పోటీకి రేడి అయ్యారు. కాస్త లేట్ అయిన బొమ్మ హిట్టు కొట్టాలని పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఆదిపురుష్ సినిమాని ఓ హాలీవుడ్ సినిమా కి పోటీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ మూవీ..ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నాశిరకంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

అలాగే కథని కూడా పూర్తిగా వక్రీకరించారనే విమర్శలు గట్టిగా వినిపించాయి. కచ్చితంగా కంటెంట్ ప్రెజెంటేషన్ మార్చాల్సిందే అని హిందుత్వ సంస్థలు డిమాండ్ చేశాయి. దీంతో ఓం రౌత్ మళ్ళీ సినిమా అవుట్ పుట్ పై దృష్టిపెట్టి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మరింత బెటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాని ఏకంగా ఆరు నెలల పాటు పోస్ట్ పోస్ట్ చేశారు. జూన్ 16న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబందించిన డేట్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందరికి రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో కాస్తా హాలీవుడ్ కామిక్ వెర్షన్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసినట్లు ఓంరౌత్ చెప్పారు.

కథని అందులో ఉన్న గాఢతని తాను ఎక్కడా తక్కువ చేసి చూపించలేదని చెప్పాడు. రామాయణం గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ అవ్వబోతున్న రోజే హాలీవుడ్ లో మరో సూపర్ హీరో మూవీ ది ఫ్లాష్ రిలీజ్ కాబోతుంది. అఫీషియల్ గా చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరో చిత్రాలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆదిపురుష్ రిలీజ్ రోజే ది ఫ్లాష్ కూడా రిలీజ్ కాబోతూ ఉండటం కచ్చితంగా వరల్డ్ మార్కెట్ లో సినిమాకి కొంత ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి దీనిని ఆదిపురుష్ టీం ఎలా అధికమిస్తారు అనేది చూడాలి.

Must Read

spot_img