Homeసినిమావిశాల్ కు తప్పిన ప్రమాదం..

విశాల్ కు తప్పిన ప్రమాదం..

కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ విశాల్. ఆయన యాక్షన్ సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాడు. చాలా వరకు ఎంత రిస్క్ సన్నివేశాల్లో అయిన డూప్ లేకుండానే తానే స్వయంగా రిస్క్ చేస్తాడు. అంతే కాకుండా అతని నటనలో నవరసాలు ఉంటాయి. అన్ని రకాల ప్రేక్షకులు విశాల్ ను అమితంగా అభిమానిస్తుంటారు. సినిమా కోసం చేస్తున్న సన్నివేశాలకు ఆయనకు ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. తాజాగా మార్క్ ఆంటోని సినిమా సెట్‌లో ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి చిత్రయూనిట్ మీదకు వచ్చింది. అదే సమయంలో విశాల్ కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఇలా మార్క్ ఆంటోని సినిమా సెట్‌లో జరిగిన వీడియో వైరల్ అవుతోంది.

మార్క్ ఆంటోని షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశం చిత్రికరిస్తున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు అదుపుతప్పి వేగంగా దూసుకువస్తుంది. ఆ టైంలో విశాల్ సన్నివేశంలో భాగంగా కింద పడి ఉన్నాడు. లక్కీగా ట్రక్కు కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచి వెళ్లింది. దీంతో, త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయం కాలేదు. దీనిపై విశాల్ స్పందిస్తూ… క్షణకాలంలో, కొన్ని ఇంచుల దూరంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని… భగవంతుడికి ధన్యవాదాలను తెలియజేస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. ఈ ఘటన తర్వాత ఏ మాత్రం భయపడకుండా మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నామని తెలిపాడు. అయితే ఈ ప్రమాద ఘటనపై చిత్రయూనిట్ ఇంకా స్పందించలేదు. అధికారికంగా చిత్రయూనిట్ చేసే ప్రకటన తరువాతే అసలు విషయాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మరో పక్క విశాల్ కు పెను ప్రమాదం తప్పడంతో విశాల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేవుని ఆశీస్సులు, అందరి దీవెనలు ఎప్పుడూ ఆయనకు ఉంటాయని పోస్ట్ లు పెడుతున్నారు.

Must Read

spot_img